Satyabhama Serial Today May 13th Episode : సత్యభామ సీరియల్ : గుడిలో చెట్టు సాక్షిగా వాటేసుకున్న సత్య, క్రిష్‌లు.. తల్లి అండతో నటన మొదలెట్టేసిన నందిని!
Satyabhama Serial Today Episode : నందిని, సత్యలకు గుడిలో పదహారు రోజుల పండగ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode : క్రిష్ అలసిపోయి గుడి మెట్ల మీద కూర్చొండిపోతాడు. ఇక సత్య క్రిష్ చేతిలోని కుంకుమ తీసుకొని తానే పసుపు రాస్తూ కుంకుమ పెడుతుంది. సత్య కూడా కళ్లు తిరిగి పడిపోబోతుంది. క్రిష్ చూసి సత్యని ఎత్తుకొని తీసుకొచ్చి గుడి దగ్గర కూర్చొపెడతాడు. పక్కనే మరో అమ్మాయి చేతిలో వాటర్ బాటిల్ ఉంటే తీసుకొని సత్య మీద చల్లుతాడు. సత్య లేస్తుంది.
క్రిష్: సారీ నాకు తెలీకుండా నిద్ర వచ్చేసింది పడుకుండి పోయా. మొత్తం ఒక్కదానివే చేసే బదులు లేపొచ్చు కదా. ఎందుకో కానీ నువ్వు అర్థమైనట్లే ఉంటావ్ కానీ అర్థం కావు. దగ్గరైనట్లే ఉంటావ్ కానీ దగ్గర కావు. అట్లా అని దూరం కూడా కావు.
సత్య: మన అగ్రిమెంట్ కాపీ సెల్‌లో ఉంది చూపించమంటావా.
క్రిష్: మనిషివి నీరసంగా ఉన్నా మాటలు మాత్రం తూటాల్లా వస్తాయి.
ఇక క్రిష్ సత్య కళ్లు తిరిగి పడిపోయిందని అంటాడు. ఇక భైరవి అంత చిన్న పనికే పడిపోయావా అంటుంది. ఇక క్రిష్ సత్యను వెనకేసుకు వస్తే భైరవి అత్తగా ఓ మాట అనొద్దా అని అంటుంది. జరిగింది అంతా కడుపులో దాచుకున్నాం వాళ్ల పుట్టింటి వాళ్లకి చెప్పాలా అని అడుగుతుంది. దీంతో క్రిష్ అమ్మా ఊరుకో ఇంకా ఆరు నెలలే కదా తర్వాత ఎవరి దారి వారు చూసుకుందాం అంటాడు. అందరూ షాక్ అవుతారు.
భైరవి: అట్లా అన్నావ్ ఏంట్రా ఎవరికి ఎవరు ఏంటి..
క్రిష్: అదే అమ్మా రెండు నెలలకు సత్య నెల తప్పుతుంది. నాలుగు నెలలకు కడుపులో బిడ్డ కదులుతుంది. అప్పుడు నువ్వు కోడలి దగ్గరే ఉండి సేవలు చేస్తావ్ కదే. నన్ను అసలు దగ్గరకు రానివ్వవు కదా. నేను సత్య ఎవరికి ఎవరో అన్నట్లు ఉంటామ్ కదా ఆ ముచ్చట చెప్తున్నా.
మహదేవయ్య: ఏమో అనుకున్నాశభాష్‌రా చిన్నా నువ్వు కూడా లెక్కలతో రెడీగా ఉన్నావ్ అన్నమాట. నాకు కూడా కావాల్సింది ఇదే. పంతులు పరిహారం కాగానే మా చిన్నా ఎంత మారిపోయాడో కదా.
ఇక పంతులు మళ్లీ ముడుపు కట్టించే పూజ చేస్తారు. ఇక మహదేవయ్య సత్యతో నీ మొగుడు మాటిచ్చాడు. గుర్తుపెట్టుకో అంటాడు. ఇద్దరూ కలిసి ఓ అగ్రిమెంట్‌కి రావాలి అంటే సత్య ఆల్రెడీ వచ్చామని అంటాడు. ఇక పంతులు ముడుపు సత్యకు ఇచ్చి ఇంట్లో పెట్టి రోజూ పూజ చేయించమని అంటాడు.
ఇక మహదేవయ్య, విశ్వనాథం ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. సత్య బాధ పడుతుంది. ఇక పంతులు చెట్టుకు భార్యాభర్తలు ఇద్దరూ కౌగిలించుకొని కోరిక కోరుకోమని నెలలో అది నెరవేరుతుందని అంటుంది.
విశ్వనాథం ముందు హర్ష, నందినిలను వెళ్లమని అంటాడు. నందిని తనకు ఇష్టం లేదు అంటే మహదేవయ్య మన ఇంటకి వారసులు ఎంత అవసరమో వాళ్లకు కూడా అంటే అవసరం అని అంటాడు. దీంతో నందిని, హర్ష వెళ్లి చెట్టు దగ్గరకు వెళ్లి ఒకర్ని ఒకరు పట్టుకుంటారు. తర్వాత సత్య, క్రిష్‌లు వెళ్తారు.
క్రిష్ కావాలనే సత్యని ఇరికిస్తూ సత్య నడుము పట్టుకుంటాడు. తిట్టుకుంటూ సత్య కూడా క్రిష్ నడుము పట్టుకుంటుంది. క్రిష్ కావాలనే సత్య నడుము గట్టిగా పట్టుకుంటే సత్య క్రిష్ నడుము గిల్లేస్తుంది. దీంతో క్రిష్ అరుస్తాడు. ఏమైందని అందరూ అడిగితే సత్య గండు చీమలు కుట్టుంటాయి అని అంటుంది. ఇక పంతులు ఇద్దరికీ తమకు తొందరగా పిల్లలు పుట్టాలని కోరుకోమని అంటారు.
ఇక పదహారు రోజుల పండగ ప్రారంభమవుతుంది. సత్య, నందినిలకు పుస్తెలు మార్చే పూజ చేస్తారు. ఎవరి తల్లి వారి బిడ్డ మెడలో పసుపు తాడు వేసి పుస్తెలు గుచ్చుతారు. ఇద్దరి మెడలో పుస్తెల చైన్ వేస్తారు. సత్య ఆ తాళిని పట్టుకొని తాను విడాకుల పత్రాల మీద పెట్టిన సంతకం గుర్తు చేసుకుంటుంది. ఇక భైరవి నందినికి సైగ చేస్తుంది. దీంతో నందిని కళ్లు తిరిగి పడిపోయినట్లు నటిస్తుంది. భైరవి హల్ చల్ చేస్తుంది.
నందినిని తమ ఇంటికి తీసుకెళ్తారు భైరవి వాళ్లు. డాక్టర్ చూసి మందులు ఇస్తాడు. అంతా బాగానే ఉందా అని మహదేవయ్య అడిగితే భైరవి యాక్టింగ్ చేస్తుంది. నందిని బాగా వీక్‌గా ఉందని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమన్నారు అని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: సినీ పరిశ్రమలో మరో విషాదం - రోడ్డు ప్రమాదంలో 'త్రినయని' సీరియల్ నటి దుర్మరణం