Satyabhama Serial Today March 20th: సత్యభామ సీరియల్: అంగరంగ వైభవంగా రెండు జంటల పెళ్లిళ్లు.. ఏడుస్తూ ఏడిపించేసిన నందిని, సత్య!
Satyabhama Serial Today Episode భైరవి తప్పించిన తన కూతురు నందినిని బాలు తీసుకువచ్చి పెళ్లి జరిపించడంతో ఇవాళ్లి ఎపిసోడ్ ఆసక్తి కరంగా మారింది.
Satyabhama Today Episode సత్య మెడలో తాళి కట్టే పీటల మీద నుంచి లేస్తాను అని క్రిష్ అంటే హర్ష ఇద్దరి పెళ్లి ఒకసారి జరిగితేనే ఓకే లేదంటే ఒప్పుకోను అంటాడు. ఇక సత్య తన అన్నను మొండిగా ప్రవర్తించొద్దని చెప్తుంది.
సత్య: అన్నయ్య నందినిని వెతకాల్సిన బాధ్యత క్రిష్ మీద ఉంది.
భైరవి: మంచిగా చెప్పావు అమ్మ. కూతురు కనిపించని బాధని గుండెల్లో దాచుకొని నీ పెళ్లి జరగాలి అని మేం ఆరాటపడుతున్నాం. అది మీ అన్నకి అర్థం కావడం లేదు.
హర్ష: సత్య నువ్వు వీళ్ల ట్రాప్‌లో పడకు వీళ్లంతా కలిసి నాటకాలు ఆడుతున్నారు.
క్రిష్: ఏయ్ బామ్మర్ది నాటకాలు ఏంటి నాటకాలు నకరాలు చేస్తున్నావా.
సత్య: క్రిష్ నేను మాట్లాడుతాను నువ్వు ఆగు.
క్రిష్: ఒక వైపు మా చెల్లి కనిపించక మేం పరేషాన్ అవుతుంటే మీ అన్న ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.
హర్ష: పెళ్లి ఆపుతున్నారు అంటూ ఒకసారి నువ్వు మా నాన్న షర్ట్ పట్టుకున్నావు కదా ఇప్పుడు మీ నాన్న అదే పని చేస్తున్నారు. మా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తున్నాడు నేను కూడా వెళ్లి మీ నాన్న షర్ట్ పట్టుకోనా. మా నాన్న మాకు సంస్కారం నేర్పించారు అందుకే నేను అలాంటి పని చేయడం లేదు.
రుద్ర: హా.. రారా రా వచ్చి మా బాపు షర్ట్ పట్టుకో నీ కథ ఏంటో తేల్చుతా..
మహదేవయ్య: రుద్ర ఆగురా కాబోయే అల్లుడుతోని మాట్లాడే పద్ధతి ఇదికాదు.
భైరవి: మీ అంగీ పట్టుకుంటా అన్నోడు మీ అల్లుడు ఎలా అవుతాడు.
సంధ్య: ఏ షర్ట్ పట్టుకున్న మీ కొడుకును మా నాన్న అల్లుడిని చేసుకోవడం లేదా..
హర్ష: సంధ్య కరెక్ట్‌గా అడిగింది. దానికి ఉన్నపాటి పౌరుషం నీకు లేకుండా పోయింది ఏంటి సత్య. ఎందుకు వాళ్ల వైపు మాట్లాడుతున్నావ్.
సత్య: వాళ్లు పరాయి వాళ్లు కాదు అన్నయ్య మా అత్తారింటి వైపు వాళ్లు.
మహదేవయ్య: చూడు హర్ష నేను ఇష్టపడి నీ చెల్లిని కోడలిగా తెచ్చుకుంటున్నా. నిన్ను అల్లుడిగా చేసుకుంటున్నా అలాంటప్పుడు నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు ఏం ఉంటుంది. అయినా నా మనసు అర్థం కావడం లేదా.. నిన్ను పక్కకు తప్పించి మా చిన్నాతో నీ చెల్లి పెళ్లి చేయాలి అనుకుంటే నాకు నిమిషం పని. ఇంత డ్రామా అవసరమే లేదు. ఇంత మంది ముందు నా పరువు తీసుకోవాల్సిన అవసరం లేదు. నన్ను అరెస్ట్ చేయాలి అనుకున్న మీ నాన్నని క్షమించాల్సిన అవసరం లేదు. విశ్వనాథం దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేసి.. అందరికి చెప్తున్నా ఈయన నా బావ. పంతులు మా చిన్నాతో తాళి కట్టించండి.
భైరవి: మనసులో.. ముందు ఈ పెళ్లి జరిగితే కిందా మీద పడి అయినా సరే నందిని పెళ్లి ఆపుతా.
క్రిష్ సత్యల పెళ్లి జరుగుతూ ఉంటే బాలు పెళ్లి ఆపండి అని నందినిని తీసుకొని వస్తాడు. నందిని ఏడుస్తుంది. భైరవి షాక్ అవుతుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇక నందినిని రౌడీలు తీసుకెళ్తుంటే బాలు అడ్డుపడి వాళ్లతో ఫైట్ చేసి నందినిని తీసుకొని వస్తాడు.
క్రిష్: థ్యాంక్స్ బ్రో మా చెల్లి కాపాడి తీసుకొని వచ్చినందుకు.
మీన: అసలు నీకు కిడ్నాప్ గురించి ఎలా తెలిసింది ఎవరు చెప్పారు.
ఫ్లాష్ బ్యాక్‌లో బాలు నందిని వెతకడానికి వెళ్లినప్పుడు రేణుక నందిని కిడ్నాప్ విషయాన్ని బాలుకి చెప్తుంది. ఇక నందిని పెళ్లి పీటల మీద కూర్చొంటుంది. క్రిష్ సత్య మెడలో.. హర్ష నందిని మెడలో తాళి కడతారు. ఇద్దరు పెళ్లి కూతుళ్లు బాధ పడతారు. రెండు జంటలు దండలు మార్చుకుంటారు. ఒకరి వెంట ఒకరు ఏడు అడుగులు వేస్తారు. రెండు జంటలు పెద్ద వాళ్ల ఆశీర్వాదం తీసుకుంటారు.
బాలు: మొత్తానికి నా చేతుల మీదుగా మీ పెళ్లి జరిగిపోయింది. నేను వచ్చిన పని అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది బ్రో. అల్ ది బెస్ట్ ఇద్దరికి. మీన, బాలు వెళ్లిపోతారు.
ఇక రౌడీలు, క్రిష్ ఫ్రెండ్స్ క్రిష్‌ని ఎత్తుకొని సందడి చేస్తారు. నందిని ఏడుస్తుంది. సత్య, హర్షలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. సత్య ఫ్యామిలీ కూడా బాధ పడుతుంది.
రేణుక: చిన్నాని ఇంత ఖుషీగా ఎప్పుడూ చూడలేదు. ఆ ముఖం చూడండి ఎంత వెలిగిపోతుందో. ఆ ఖుషీకి కారణం మీరే మామయ్య. మీరు పెళ్లి చేయబట్టే తనకు అంత ఖుషీ దొరికింది.
మహదేవయ్య: కాదు బిడ్డ వాడి ఖుషీకి కారణం సత్య. ఎవరికైనా అనుకున్నది సాధిస్తేనే, కోరకున్నది దక్కితేనే ఖుషి.. మనసులో ఉన్నది జీవితంలోకి వస్తేనే ఖుషి..
భైరవి: మనసులో.. కోరుకున్నది అందుకోగానే సంబరపడితే ఎట్లా అనుకున్నది నిలుపుకోవాలి కదా..
నందిని: ఒక్క సారి నా దిక్కు కూడా చూడొచ్చు కదా బాపు. నా ముఖంలో ఖుషీ కనిపిస్తుందా..
మహదేవయ్య: నీకు ఇష్టం లేని పెళ్లి చేసుండొచ్చమ్మా. కానీ నువ్వు అంటే ఈ నాన్నకి చాలా ఇష్టం తల్లి. ఏడ్వకు తల్లి నువ్వు ఈ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో ఉన్నా మహదేవయ్య బిడ్డ లెక్కే ఉంటావ్. ఏలోటు రాకుండా ఖుషీతో ఉండేలా చూస్తా.. నందిని తండ్రిని పట్టుకొని ఏడుస్తుంది. సత్య కూడా తన తండ్రి గుండెల మీద వాలి ఏడుస్తుంది.
సత్య: చాలా తృప్తిగా ఉంది నాన్న.
విశ్వనాథం: అదినీ భ్రమ తల్లి. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు.
సత్య: నేను మోసం చేసినా నా మనసు ఎప్పుడూ మోసం చేయదు నాన్న. మా నాన్నలా ఎప్పుడూ నాకు తోడుగా ఉంటుంది.
విశాలాక్షి: ఏం సాధించావు అనే అంత తృప్తి. నువ్వు ఇప్పుడు గెలవలేదు. ఓడిపోయావు.
సత్య: అన్ని సార్లు గెలుపే ఆనందాన్ని ఇవ్వదు అమ్మ కొన్నిసార్లు ఓటమి కూడా తృప్తిని ఇస్తుంది.
విశ్వనాథం: ఏదో సాధించా అనుకుంటున్నావు కానీ చాలా కోల్పోయావు. ఇది నీకు ముందు ముందు తెలుస్తుంది.
శాంతమ్మ: నీది త్యాగం చేసే వయసు కాదే.
సత్య అత్తారింటికి వెళ్లిపోతున్నాను అని చెప్పి తాను ఏడుస్తూ అందర్ని ఏడిపించేస్తుంది. మరోవైపు నందిని కూడా ఏడుస్తుంది. తోడబుట్టిన దాన్ని అత్తారింటికి పంపేటప్పుడు బాధగా ఉన్నా అక్కడ సంతోషంగా ఉంటుంది అని ధైర్యం ఉంటుందని, కానీ వాళ్లని చూస్తుంటే నీ గురించి భయం మరింత పెరుగుతుంది సత్య అని హర్ష ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.