Satyabhama Serial Today March 18th: సత్యభామ సీరియల్: పెళ్లిళ్లు ఆపాలని అడ్డంగా దొరికిపోయిన విశ్వనాథం.. చేతులు జోడించి తండ్రిని పొమ్మన్న సత్య!
Satyabhama Serial Today Episode క్రిష్‌తో తన పెళ్లి జరగాలి అని సత్య తన తల్లిదండ్రులను ఎదురించి అనరాని మాటలు అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode పోలీసులు పెళ్లి మండపానికి వచ్చి మహదేవయ్య, రుద్ర శీనయ్యను హత్య చేశారు అని అతని భార్య ఫిర్యాదు చేశారని చెప్పి అరెస్ట్ చేస్తా అంటారు. దీంతో మహదేవయ్య, రుద్ర ఎదురు తిరుగుతారు. విశ్వనాథం ఏమీ తెలియనట్లు వీళ్లు హంతకులా, మర్డర్ చేశారా అని అడుగుతాడు. దీంతో రుద్ర మాస్టారూ మధ్యలో దూరకుండా పక్కన నిల్చొని చూడండి అంటాడు.
హర్ష: నేరం చేసిందే కాకుండా ఏంటీ మానాన్న మీద ఎగురుతున్నారు.
మహదేవయ్య: అల్లుడు పెద్దోళ్లు మాట్లాడుతున్నప్పుడు పిల్లులు సైలెంట్‌గా ఉండాలి. చూడు కమిషనర్ మా ఇంట్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ముహూర్తాల టైం దగ్గర పడింది. అక్కడ పుస్తే కట్టుడు అయిన తర్వాత ఆరాంగా మాట్లాడుకుందాం.
విశ్వనాథం: ఏంటండి ఆరాంగా మాట్లాడుకునేది ఇక్కడ ఎవరు ఎవరికీ పుస్తెలు కట్టరు. ఏ పెళ్లి జరగదు. ఏదో రౌడీల కుటుంబం అనుకున్నాం కానీ ఇలా హంతకుల కుటుంబం అనుకోలేదు. సమయానికి కమిషనర్ గారు రాబట్టి మీరేంటో మాకు తెలిసింది లేదంటే మా పిల్లల బతుకులు అన్యాయం అయిపోయేవి.
రుద్ర: చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ నోరు అదుపులో పెట్టుకో.
విశ్వనాథం: తప్పు ఏం అన్నాను అండి. మీరు హంతకులు కాబట్టే కమిషనర్ గారు అరెస్ట్ చేయడానికి వచ్చారు. మీరు ఏంటో తెలిశాక కూడా మీతో వియ్యం ఎలా పొందుతాము అనుకున్నారు. మా దగ్గర మీలా డబ్బు లేకపోవచ్చు పరువు ఉంది ఆత్మాభిమానం ఉంది. సత్య, హర్ష పీటల మీద నుంచి రండి వెళ్దాం.
సత్య: నాన్న
విశ్వనాథం: సత్య ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నాను ఇక మీద నేను చెప్పేది నువ్వు వినాల్సిందే పద. చూశావా వీళ్లని అందరి చేతులు రక్తంతో తడిచి ఉన్నాయి. ఎవరి నోళ్లు మంచివి కాదు. ఇలాంటి ఇంటికి నిన్ను పంపడం అంటే బలి ఇవ్వడమే అందుకు నేను ససేమిరా ఒప్పుకోను. ఇంకా ఏంటి చూస్తున్నారు ఈ పెళ్లిళ్లు జరగవు వెళ్లండి..
క్రిష్: ఆగండి.. ఏంటి బాపు ఇందంతా ఏం జరుగుతుంది మర్డర్ ఏంటి అరెస్ట్ ఏంటి. అరే ఈ పెళ్లిళ్లు ఆగిపోవడం ఏంటి.. అసలు నాకు ఏం సమాజ్ అవ్వడం లేదు.
విశ్వనాథం: సమాజవ్వడానికి ఏముంది నువ్వు రౌడీవి అయితే మీ నాన్న అన్నలు హంతకులు.
మహదేవయ్య: మాస్టార్ మాట అనే ముందు నిజం ఏంటో తెలుసుకోవాలి ఆలోచించాలి. ఆయన అంటే బయటోడు ఒంటి మీద కాకీ చొక్క ఉంది అని ఏమైనా మాట్లాడుతాడు. కానీ నువ్వు నాకు కాబోయే వియ్యంకుడిని మనం కలకాలం కలిసి ఉండాల్సిన వాళ్లం. మీ పిల్ల మా ఇంట్లో ఉంటుంది. మా పిల్ల మీ ఇంట్లో ఉంటుంది. మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి.
రఘు: మేం నిజాలు తెలుసుకునే ఆధారాలతోనే వచ్చాం.
మహదేవయ్య: మాట అంటే అంత రోషం పొడుచుకు వచ్చిందా కమిషనర్. నువ్వు నామీద తప్పుడు నేరం ఆరోపించలే. కాబోయే ఎమ్మెల్యేను నాకు ఎంత ఉండాలి. సరే నీ సాక్ష్యం ఏంటో చూపించు. నా ముందటకి తీసుకురా..
రఘు: సీఐ ఎక్కడామె..
మహదేవయ్య: ఎప్పుడొస్తుంది. సాక్ష్యని వెంట తీసుకొని రాకుండా వచ్చేశావా.. మా ఇంట్లో పెళ్లి ఆపి తమాషాలు చేస్తున్నావా..
శీనయ్యభార్య: నా భర్తని చంపింది వీళ్లు కాదు. నా భర్త యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అందరూ షాక్ అవుతారు. మహదేవయ్య నిజం చెప్తే తన కొడుకును చంపేస్తానని ఆమెను బెదిరించుంటాడు.
మహదేవయ్య: తప్పుడు సాక్ష్యం పట్టుకొచ్చి నన్ను తప్పుడు కేసులో ఇరికిద్దామనుకున్నావ్ కదా కమిషనర్. ఇంత మంది ముందు నా పరువు తీసువులే. నా కాబోయే వియ్యంకుడితో మాటలు అనిపించావ్. పెళ్లి జరగకుండా ఆపినావ్‌లే ఇప్పుడు నిన్నేం చేయాలి. ఈ పెళ్లి ఆపాలి అనుకున్నది కమిషనర్ కాదు నాకు కాబోయే వియ్యంకుడు. మనల్ని అరెస్ట్ చేసి ఈ పెళ్లిళ్లు ఆపి ఈ కమిషనర్ తన గురువుకి గురుదక్షణ ఇద్దాం అనుకున్నాడు. నా కొడుకు ప్రేమను ప్రేమించిన నీ కూతురిని దూరం చేయడానికి ఎందుకు ఇంత దిగజారావ్.
క్రిష్: ఆవేశంగా.. సత్య మొండితనం వల్ల నీ నకరాలు నడవలే. ఇప్పుడు మా బాపుని అరెస్ట్ చేయించడానికి వచ్చావ్. మామ కాలర్ పట్టుకొని నిన్ను..
బాలు: బ్రో.. బ్రో వద్దు బ్రో మా మామయ్య చేసింది తప్పే జరిగింది ఏదో జరిగిపోయింది. సత్య కోసం అంతా మర్చిపో..
క్రిష్: లేదు బ్రో ఈ మామ మాస్టారు మామూలోడు కాదు సత్యని ఎంత సతాయిస్తున్నాడో తెలుసా. మా ఇద్దర్ని విడదీయడానికి ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడో తెలుసా.. పోనీలే అని భరించాను..
సత్య: వదులు..
హర్ష: ఏంటి నువ్వు భరించింది నీ దౌర్జన్యాలను మేం భరిస్తున్నాం.
క్రిష్: బామర్ది నువ్వు నడిమిట్ల రాకు నువ్వు ఈ ఇంటికి కాబోయే అల్లుడివి. మర్యాద ఇస్తున్నాను పక్కకు జరుగు.
సత్య: క్రిష్ గొడవ వద్దు వదిలేయ్..
క్రిష్: ఆ మాట మీ అన్నకి చెప్పు.
సత్య: అన్నయ్య నువ్వు పక్కకు వెళ్లు.
హర్ష: సత్య నాన్నని వదిలమని చెప్పు.
సత్య: అది నేను చూసుకుంటాను. అయినా నాన్న చేసింది తప్పే కదా.. సత్య ఫ్యామిలీ సత్య మాటలకు షాక్ అయిపోతారు.
క్రిష్: అట్లా గడ్డి పెట్టు సత్య. అరే గౌరవం ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి కమిషనర్‌ని అడ్డుపెట్టుకొని మా బాపుని అరెస్ట్ చేస్తాడా.
విశ్వానాథం: అవును ఈ పెళ్లి ఆపడానికే ఇందంతా చేశాను తప్పు ఏంటి. ఇలాంటి రౌడీ కుటుంబంలోకి నా కూతుర్ని పంపించడం ఇష్టం లేకే ఇదంతా చేశాను. నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అని తెగించే ఈ పని చేశాను..
క్రిష్: విన్నావా విన్నావా సత్య..
విశాలాక్షి: ఏమండి జరిగిన గొడవచాలు. ఇక ఊరుకోండి.
విశ్వనాథం: విశాలాక్షి.. రేపు ఆ ఇంట్లో అది నరకయాతన పడుతుంది. అప్పుడు చూస్తూ ఊరుకుందామా.. దాన్ని పట్టించుకునే నాధుడే ఉండడు అయినా చూస్తూ ఉందామా..
క్రిష్: అబ్బాబ్బాబా.. మాస్టారూ లెక్చర్లు ఎక్కువ అయిపోయాయి.
రుద్ర: కత్తి పట్టుకొని వచ్చి.. మన కుటుంబాన్ని అన్నిన్ని మాటలు అంటుంటే నరికి అవతల పడేయకుండా ఏంట్రా గొణుగుతున్నావ్ అని విశ్వనాథాన్ని నరికేయబోతాడు. అప్పుడు క్రిష్ ఆపుతారు.
క్రిష్: విన్నావా నేను ఊ అంటే ఇక్కడ నీకు జరిగే మర్యాద.
సత్య: ఆపండి.. మీ అందరికీ నేను దండం పెడుతున్నాను. ఈ పెళ్లి నేను కాదు అనడం లేదు కదా ఈ పెళ్లి జరుగుతుంది. గొడవలు వద్దు.
విశ్వనాథం: సత్య అడ్డు తప్పుకో అతడేం చేస్తాడో చూద్దాం.
సత్య: ఏంటి నాన్న చూసేది. ఎందుకు ఇంత మొండితనం ఒక్కసారి కాదు వందసార్లు చెప్పాను నేను క్రిష్‌ని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాను. అర్థం కాదా కూతురు ఇష్టాన్ని గౌరవించడం తెలీదా. ఎందుకు నాన్న అందరి ముందు ఇలా పరువు పోగొట్టుకోవడం. ఎందుకు ఇలా గొడవ పడటం నేను బతికి ఉండాలనా చచ్చిపోవాలి అనా..
మీన: సత్య నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా..
సత్య: నేను స్ఫృహలో ఉండే మాట్లాడుతున్నాను మీన. నువ్వు ఇష్టం లేని పెళ్లే చేసుకున్నావ్ కదా అయినా కాపురం చేస్తున్నావు కదా. మీ పెద్దవాళ్లు అడ్డుకుంటున్నారా.. లేదే. మరి మా వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారు. నా జీవితం నాశనం చేస్తున్నారు.
హర్ష: సత్య తప్పుగా మాట్లాడుతున్నావ్. నాన్నని బాధపెడుతున్నావ్.
సత్య: నాన్న బాధ సరే మరి నా బాధ ఎవరికి అర్థం అవుతుంది.
శాంతమ్మ: ఏంటే నీ బాధ కళ్లళ్లో పెట్టుకొని పెంచిన తండ్రితో మాట్లాడాల్సిన మాటలేనే ఇవా.
సత్య: కన్న కూతురు సుఖం కోరుకునే తండ్రి ప్రవర్తించే పద్ధతి ఇదేనా. నా తండ్రి నా పెళ్లికి ఆయన కాళ్లు కడిగి కన్యాదానం చేయాలి అని నా ఆశ. కానీ అది ఇష్టం లేక ఎలా ప్రవర్తిస్తున్నారో చూడు. మీకు అది ఇష్టం లేకపోతే నా పెళ్లి చూడటం ఇష్టం లేకపోతే దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి. నేను ఒక అనాథని అనుకొని ఎవరి కాళ్లో పట్టుకొని బతిమలాడి కన్యాదానం చేయమని బతిమాలుకుంటాను. వెళ్లిపోండి ఇక్కడి నుంచి.. క్రిష్ మళ్లీ చెప్తున్నాను నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని సత్య పెళ్లి పీటల మీద కూర్చొంటుంది.
బాలు: మామయ్య సత్య తనంతట తానే ఈ పెళ్లి చేసుకుంటాను అన్న తర్వాత ఇంత మందిలో తన నిర్ణయాన్ని కాదు అని బాధపెట్టడం సరికాదు. హర్ష బావ నువ్వు వెళ్లి పీటల మీద కూర్చొ. క్రిష్ నువ్వు వెళ్లు.
ఇక అందరూ పెళ్లి పీటల మీద కూర్చొంటారు. మహదేవయ్య పోలీసుల్ని పంపేస్తాడు. రెండు జంటలు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. ఇక విశ్వనాథం ఇష్టం లేకుండా పెళ్లి పనుల్లో పాల్గొంటాడు. సత్య తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Alos Read: 'త్రినయని' సీరియల్ మార్చి 18th: లలితాదేవి చేయి కట్ చేసేసిన నయని.. గాయత్రి పాప నామకరణం ఆగిపోతుందా?