Satyabhama Serial August 23rd: సత్యభామ సీరియల్: ఫస్ట్‌నైట్ కాకుండానే సత్య ప్రగ్నెంట్ అంతా భైరవి మాయేనా!
Satyabhama Today Episode సత్య ప్రెగ్నెంట్ అనేలా భైరవి తన ఫ్యామిలీ డాక్టర్‌తో రిపోర్ట్స్ ఇప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode క్రిష్, సత్య ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్‌కి వెళ్తారు. డాక్టర్ సత్యతో ప్రెగ్నెంట్ అని చెప్తుంది. సత్య ప్రవర్తనకి డాక్టర్ బిత్తరపోతుంది. ఇక సత్య డాక్టర్‌తో గొడవ పడబోతే క్రిష్ సత్యని లాక్కొస్తాడు. డాక్టర్ తన ఫ్యామిలీ డాక్టర్ అని ఆమెతో ఏం చెప్పొద్దని అంటాడు. ఇక సత్య మొత్తం గుర్తు చేసుకుంటుంది.
సత్య: అంతా జరిగిందని ఆ రోజు చెప్పింది నిజమా ఏం జరగలేదని ఈరోజు చెప్పింది నిజమా. సూటిగా చెప్పు.
క్రిష్: ఈరోజు చెప్పిందే నిజం సత్య. నీకు దండం పెడతా అలా చూడకు సత్య అసలే టెన్షన్‌లో ఉన్నా పద ఇంటికి వెళ్దాం. అనుమానం ఉండొచ్చు కానీ మరి ఇంత అనుమానమా. సత్య ఇది పబ్లిక్ ప్లేస్ ఎవరైనా చూస్తే బాగోదు. పద
సత్య: మరి ఎందుకు రిపోర్ట్ పాజిటివ్ వస్తాయ్.
క్రిష్: అదే నాకు అర్థం కావడం లేదు.
సత్య, క్రిష్ ఇంటికి బయల్దేరుతారు. డాక్టర్ భైరవికి కాల్ చేసి తాను చెప్పినట్లే తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చానని అంటుంది. ఇక పంకజంతో ఇద్దరూ ఈ పాటికి కొట్టుకుంటారని బయటకు వస్తారని అంటుంది. నాలుగో నెలలో ఇరికిస్తానని ఇద్దరినీ పద్మవ్యూహంలో ఇరికిస్తానని చెప్తుంది. సత్య బతుకు తెల్లారిపోవాలని ఇళ్లు వదిలి వెళ్లిపోవాలని అంటుంది.
ఇంట్లో అందరూ భోజనాలు చేస్తుంటారు. సత్య వడ్డిస్తుంటే మహాదేవయ్య అరుస్తాడు. పెళ్లాం మీద సీరియస్ అయి సత్యతో ఏం పని చేయించొద్దని తిడతాడు. సత్యతో పూజ చేయిద్దామని మీ పెద్దమ్మని పిలిపించమని భైరవి మహదేవయ్యతో చెప్తుంది. మహదేవయ్య సరే అంటాడు. క్రిష్, సత్య భయపడతారు. ఇప్పుడు పూజలు అవి వద్దని క్రిష్ అంటాడు. ఇక సత్య తల్లిదండ్రుల్ని కూడా పిలిపిద్దామని అంటుంది. అత్త మాటలకు సత్య ఇలా ఇరుక్కున్నానేంటి అని బాధ పడుతుంది. పరిస్థితులు చూస్తుంటే పెద్ద ఉప్పెన వస్తుందనిపిస్తుందని అనుకుంటుంది. క్రిష్ వచ్చి సత్యని ఓదార్చుతాడు.
సత్య: మన ప్రాబ్లమ్ తెలిసి కూడా ఎందుకు పూజ ఆపలేదు.
క్రిష్: ఏ కారణం చెప్పి ఆపాలి. వాళ్లు ఆగే పొజిషన్‌లో లేరు.
సత్య: ప్రెగ్నెన్సీ లేదని ఇంట్లో వాళ్లకి చెప్పేస్తా అంటే వినలేదు ఇప్పుడు చూడు. అయినా ఆ డాక్టర్‌ని నిలదీయాల్సింది.
క్రిష్: అదేం అంత పెద్ద పని కాదు కానీ అలా చేస్తే తను మా ఇంట్లో వాళ్లకి నేను బెదిరించానని చెప్తుంది. అందుకే ఆగాను.
సత్య: క్రిష్ నువ్వు ఏమైనా అనుకో నేను రేపు పూజలో కూర్చొను అబద్ధంతో అందర్ని మోసం చేస్తున్నా ఇక దేవుడిని కూడా మోసం చేయను.
క్రిష్: నిజం దేవుడికి తెలీదా మీ వాళ్లకి రావొద్దని నేను చెప్తా.. వాళ్లు చెప్పినట్లు చేద్దాం.
సత్య: వెంటనే ఇంకో డాక్టర్ దగ్గరకు పోదాం.
క్రిష్: ఇప్పుడు కాదు రేపు పోదాం.
సత్య: నీకు నీ వాళ్ల సంతోషం ఇష్టం. నా గురించి పట్టించుకోవు.
క్రిష్: నువ్వు ఏ నిర్ణయం అయినా తీసుకో నేను అడ్డుపడను.
ఉదయం సత్య, క్రిష్‌లు గుడికి వెళ్తామని భైరవితో చెప్తారు. భైరవి మాత్రం ఒప్పుకోదు. చివరకు క్రిష్ సత్యని తీసుకెళ్లిపోతాడు. వాళ్లు గుడికి వెళ్లడం లేదని పంకజం అంటే వాళ్లు ఎక్కడికి వెళ్లినా ఇంట్లో కుండ పగలక తప్పదని అంటుంది. సత్య క్రిష్ మరో డాక్టర్ దగ్గరకు వెళ్తారు. ఇక సత్య అక్కడున్న బాబు బొమ్మ చూస్తుంటే క్రిష్ చూడొద్దని సత్యని తన వైపు తిప్పుతాడు. ఎందుకని సత్య అడిగితే ఒకసారి ఆ బొమ్మ చూసి ఇబ్బంది పడ్డానని ఈ సారి మరేమైనా అంటే మొత్తం తిరిగి తన మెడకే చుట్టుకుంటుందని అంటాడు. ఇంతలో డాక్టర్ వస్తుంది. డాక్టర్ సత్యని టెస్ట్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: రేపే కనకం, విహారిలకు పెళ్లి.. ప్రకాశ్ కుట్ర విహారి కనిపెట్టగలడా!