అన్వేషించండి

Satyabhama Serial Today October 4th: సత్యభామ సీరియల్: మడత కుర్చీ, మరచెంబు.. అత్తని అల్లాడించిన సత్య.. దట్ ఈజ్ భామ.. సత్యభామ! 

Satyabhama Today Episode క్రిష్‌ ఫస్ట్ నైట్‌కి ఏర్పాట్లు చేయడం సత్య క్రిష్‌కి మరో పజిల్ ఇచ్చి తెలివిగా తొలిరేయిని వాయిదా వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode మహదేవయ్య ఇంట్లో చక్రవర్తితో కలిసి అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. చక్రవర్తి కొడుకు ఫారిన్‌లో చదువుతున్నాడని క్రిష్‌ చెప్తే సత్య ఆయనలో ఉన్నది మీ బాబాయ్ రక్తం అందుకే బుద్ధిమంతుడిలా చదువుకుంటున్నాడని అంటుంది. దానికి క్రిష్ అంటే ఏంటి నీ ఉద్దేశం సత్య నాలో ఉన్నది మా బాపు రక్తం కాబట్టి నాకు చదువు ఎక్కలేదు అంటవా అని అడుగుతాడు.

భైరవి: అయినా నా కొడుకులకు ఏం తక్కువే చదువు రాకపోతే ఏమైంది.
క్రిష్: అట్లా అడుగమ్మా నువ్వు నన్ను అను ఏమైనా భరిస్తా అదే మా బాపుని అంటే మాత్రం దబిడదిబిడే. అంతే బాబాయ్ బాపు అంటే నాకు అంత ఇష్టం. 
రుద్ర: రేపోమాపో మా బాపు MLA అవుతాడు అప్పుడు చిన్నా గాడు కుడి భుజం అయితే నేను ఎడమ భుజం. ఏమంటావ్రా.
క్రిష్: చెప్పేది ఏముందన్న అవసరం అయితే ప్రాణం అడ్డు వేస్తాం.
జయమ్మ: ఇప్పుడు అర్థమైందా సత్య చక్రి ఈ ఇంటికి ఎందుకు రాను అన్నాడో. 
మహదేవయ్య: ఓరేయ్ చిన్నా వాడు ఎప్పుడో ఏడాదికి ఒకసారి బుద్ది పుట్టినప్పుడు వస్తాడు వాడి ముందు ఇలాంటి మాటలు వద్దులేరా. 
సత్య: చక్రి తిన్నాక చేయి కడుక్కోవడానికి నీరు ఇస్తూ.. మీకు క్రిష్ అంటే చాలా ఇష్టమా అంకుల్. క్రిష్తో మీరు ఉన్నంత అంత ఆపేక్షగా ఎవరూ ఉండరు.
చక్రి: అదేంటి అమ్మ వాళ్ల అమ్మానాన్నలు ఉన్నారు కదా. అందరూ ఆ ప్రేమని ఒకేలా చూపించలేరు కదా.
క్రిష్: మీరు ఏమైనా అనుకోండి అంకుల్ కానీ మీరు క్రిష్‌ మీద చూపించిన ప్రేమలో ఒక ఆరాటం, ప్రత్యేకత కనిపిస్తుంది. ఏం లేదు నాకు క్రిష్ గురించి కొంచెం ఇన్‌ఫర్మేషన్ కావాలి.
చక్రి: నేను ఎప్పుడో అకేషనల్‌గా వాడిని కలుస్తుంటానమ్మా నాకు వాడి గురించి తెలీదు వస్తానమ్మా. 
మహదేవయ్య: ఏమో అనుకున్నా మస్త్ ఫాస్ట్‌గా ఉన్నావ్.
సత్య: తప్పదు కదా నేను పోటీ పడుతుంది సమాజంలో పెద్ద మనిషి అని పేరున్న వ్యక్తితో కదా గెలవడం అంత ఆషామాషీ కాదు కదా.
మహదేవయ్య: ఆమాత్రం సోయ ఉంది కదా.  
సత్య: నా వెనకాల తిరుగుతూ ఎప్పుడు ఏం చేస్తానో అని కాపలా కాస్తున్నారా.
మహదేవయ్య: నీ మొగుడు అసలు తండ్రి ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నావా.
సత్య: తప్పదు కదా. 
మహదేవయ్య: నీ తెలివి తెగింపు ఈ మహదేవయ్య ముందు నడవవ్. చిన్నా గాడి అసలు తండ్రి ఎవరో నువ్వు తెలుసుకోలేవు. జీవితాంతం వాడు నా కొడుకులా ఉండాల్సిందే.
సత్య: క్రిష్ తండ్రి ఎవరో నేను తెలుసుకోలేకపోయినా పర్లేదు కానీ మీరు తండ్రి కాదు అని తెలుసుకున్నా కదా అది చాలు నేను యుద్ధం చేయడానికి మీ పతనానికి. 

నందిని గదిలో ఉంటే హర్ష మాట్లాడాలని ప్రయత్నిస్తే చిరాకు పడుతుంది. నువ్వు నీ దోస్త్ చాలా యాక్టింగ్ చేశారని అంటుంది. కావాలనే నువ్వు, మైత్రి పెళ్లి చెడగొట్టారని అంటుంది. మైత్రి విషయంలో జాలి పడిన నువ్వు కుండమార్పిడి పెళ్లి అప్పుడు ఎందుకు నా బాధ పట్టించుకోలేదని అడుగుతుంది. దానికి హర్ష నువ్వు అంటే నాకు ఇష్టం అని హర్ష అని నందిని చేయి పట్టుకొని వీలైనంత త్వరగా మైత్రి పెళ్లి చేస్తానని చెప్తాడు. మరోవైపు క్రిష్‌ రాత్రి బెడ్ మీద పువ్వులు చల్లుతూ దుబాయెళ్లి సెంటే తెచ్చా అంటూ పాట పెట్టి డాన్స్ చేస్తాడు. అది చూపిన సత్య నవ్వుకుంటుంది. క్రిష్ పుట్టిన సంవత్సరం తెలుసుకున్నా అని చెప్తే సత్య అలా కుదరదని నెల డేట్ కూడా చెప్తేనే ఫస్ట్ నైట్ అవుతుందని అంటుంది. క్రిష్‌ని కావాలనే రెచ్చగొడుతుంది. పుట్టిన నెల తెలుసుకోవడానికి మరో పజిల్ ఇస్తానని అంటుంది. తెలుగు నెలల్లో అర్జునుడి పేరు తలచుకోగానే నేను పుట్టిన నెల తెలుస్తుందని అంటుంది. క్రిష్ ఫ్రస్టేషన్‌తో ఊగిపోతాడు.   

ఉదయం మహదేవయ్య ఇంటికి పాలు వాడు వస్తాడు. సత్తెమ్మా సత్తెమ్మా అని పిలుస్తాడు. దాంతో భైరవి వచ్చి నేను పెద్దమ్మ ఉండగా సత్తెమ్మా సత్తెమ్మా అని పిలుస్తావ్ ఏంట్రా అని అంటుంది. ఇంతలో సత్య నెలవారి డబ్బులు తీసుకొచ్చి అత్తయ్యా పాలవాడితో గొడవ ఎందుకని అంటుంది. ఇక తన చేతిలో అధికారం తీసుకున్నావ్ అని భైరవి సత్య మీద రేగిపోతుంది. ఇంతలో వీధిలో మర చెంబులు కుర్చీలు అమ్మే వాడు రావడంతో భైరవి కోపంతో ఊగిపోతుంది సత్య నవ్వుతుంది. ఇంతలో మహాదేవయ్య పిలిచి భైరవితో ఇది కోడళ్ల రాజ్యం కోడలు నీకు విశ్రాంతి ఇస్తుంటే ఈ గొడవలు ఎందుకని అంటాడు. నీ చిన్న కోడలికి పెత్తనం ఇచ్చేయ్ అని అంటాడు. భైరవి భర్త మాటలకు బుంగమూతి పెట్టుకుంటుంది. ఇంతలో సత్య మామ దగ్గరకు వెళ్లి నన్ను బిజీ చేస్తే మీతో ఛాలెంజ్ మర్చిపోతా అనుకుంటున్నారా అని అంటుంది. మామతో మరోసారి ఛాలెంజ్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: భుజంగమణి మిస్సింగ్.. లలితాదేవే దొంగ అని నిలదీసిన తిలోత్తమ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Pawan On Bangladesh: బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Pawan On Bangladesh: బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
Sr NTR @ 75 Years: ఎన్టీఆర్ తొలి సినిమా ‘మన దేశం’కు 75 ఏళ్లు... సంచలన నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ నిర్మాతలు
ఎన్టీఆర్ తొలి సినిమా ‘మన దేశం’కు 75 ఏళ్లు... సంచలన నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ నిర్మాతలు
Kanguva OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూర్య 'కంగువ' - స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూర్య 'కంగువ' - స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Embed widget