అన్వేషించండి

Trinayani Serial Today October 4th: 'త్రినయని' సీరియల్: భుజంగమణి మిస్సింగ్.. లలితాదేవే దొంగ అని నిలదీసిన తిలోత్తమ!

Trinayani Today Episode భుజంగమణి కనిపించకుండా పోవడంతో తిలోత్తమ ఇంటికి వచ్చిన లలితాదేవి దొంగతనం చేసి ఉంటుందని అనుమానించి అందరి ముందు నీలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode మానసాదేవి పూజ చేయడానికి అందరూ ఏర్పాట్లు చేస్తారు. వల్లభతో ఇంట్లో ఆడవాళ్ల కోసం లలిత దేవి చీరలు తెప్పిస్తుంది. వాటన్నింటిని లలితదేవి బయట పెట్టిస్తుంది. హాసిని తాను ఒకటి తీసుకొని నయని కోసం ఒకటి సెలక్ట్ చేస్తుంది. పూజ శ్రద్ధగా చేయమని లలితదేవి అంటుంది. అందరినీ త్వరగా రెడీ అవ్వమని లలిత దేవి చెప్తుంది. మరోవైపు విక్రాంత్ సుమన దగ్గరకు వచ్చి నీకు చీర ఇస్తారంట అని చెప్తాడు. 

సుమన: ఇప్పుడు ఆవిడ గారు నాకు ముష్టి వేస్తే నేను కళ్లకత్తుకొని తీసుకోవాలా.
విక్రాంత్: వచ్చి వాళ్లు ఇచ్చిన చీర తీసుకొని పూజకు కట్టుకో. 
సుమన: వాళ్లు భుజంగమణి తీసుకొచ్చి పూజ చేస్తే నేను చప్పట్లు కొట్టాలా. ఇదంతా మా అక్క భుజంగమణి షో చేయడానికే ఇలా చేస్తుంది. సుమన చీర కట్టుకోను అంటే విక్రాంత్ మంచిగా చీర కట్టుకున్న వాళ్లకి గిఫ్ట్ ఇస్తారని పెద్దమ్మ చెప్పారని అంటాడు. దాంతో సుమన వెంటనే రెడీ అవ్వడానికి వెళ్తుంది. 

మరోవైపు తిలోత్తమ దగ్గరకు చీర తీసుకొని వల్లభ వస్తాడు. భుజంగమణిని కొట్టేయడమే మన లక్ష్యం అని తిలోత్తమ అంటుంది. దానికి వల్లభ నువ్వు త్వరగా ఈ చీర కట్టుకొని వస్తే భుజంగమణి కొట్టేద్దామని అంటాడు. మరోవైపు పూజకు అన్ని సిద్ధం చేస్తారు. మానసాదేవిని ఇంట్లో పెట్టి అందంగా అలంకరిస్తారు. లలితాదేవి, నయని, హాసిని, విశాల్, గాయత్రీ పాపలు మంచిగా రెడీ అయ్యి అక్కడే ఉంటారు. మిగతా వాళ్లు కోసం లలితదేవి అడిగితే హాసిని వాళ్లని పిలుస్తుంది. అందరూ హాల్ లోకి చేరుకుంటారు. ముగ్గురు కోడళ్లు పూజలో పాల్గొనాలి అని లలితాదేవి అంటుంది. 

అందరూ భుజంగమణి కోసం అడుగుతారు. కిచెన్‌లో ఉందని హాసిని తీసుకురమ్మని లలితాదేవి చెప్తే నేను తెస్తా అంటే నేను తెస్తా అని సుమన, తిలోత్తమలు వంట గదికి పరుగులు పెడతారు. కిచెన్ మొత్తం వెతుకుతారు. ఇక నయని వాళ్లు దీపాలు పెట్టి పూజ మొదలు పెడతారు. కిచెన్లో మొదటి తిలోత్తమ ఒక కొత్త బట్టలో మూట తీసి చూస్తే అందులో కుంకుమ ఉంటుంది. తర్వాత హాసినికి పువ్వులు, సుమనకు బియ్యం దొరుకుతాయి. ముగ్గురూ బయటకు వెళ్లి భుజంగమణి లేదని భుజంగమణి లేకుండా పూజ ఏంటని అడుగుతారు. నయని మూటకట్టి ఉంచాం కదా అంటుంది. ఎందులోనూ లేవని అంటుంది హాసిని. అక్కడ లేదు అంటే ఎవరో తీసి ఉంటారని నయని అంటుంది. ఎవరు తీశారని లలితాదేవి అంటుంది. ఇక లలితాదేవి ముందు పూజ చేయండి మణి ఎక్కడికీ వెళ్లదు ఇక్కడే ఉంటుందని అంటుంది.

నయని, విశాల్ ఇంట్లో అందరూ పూజ చేస్తారు. తిలోత్తమ వల్లభతో లలితాదేవినే భుజంగమణి తీసేసుంటుందని పూజ అవ్వగానే వెళ్లిపోతానని అంటుందని అంటుంది. సుమన వాళ్లు భుజంగమణి కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఇక గాయత్రీ పాప ఆరోగ్యం చక్కబడాలని విశాల్, నయనిలు మొక్కుకుంటారు. అమ్మవారికి నయని హారతి ఇస్తుంది. పూజ అయిపోయిన తర్వాత లలితాదేవి వెళ్లిపోతా అంటే తిలోత్తమ ఎక్కడికి వెళ్తావని ఆపుతుంది. భుజంగమణిని మర్యాదగా ఇచ్చి వెళ్లు అక్క అని అంటుంది తిలోత్తమ. నయని తిలోత్తమకు కోప్పడుతుంది. దాంతో తిలోత్తమ లలితక్కనే అడుగుతున్నా కొట్టేసిన భుజంగమణిని ఇచ్చి వెళ్లమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: అమ్మాయి గారు సీరియల్: పెళ్లి గెటప్‌లో రాజు.. కూతురి జీవితం కోసం ఆలోచిస్తున్న సూర్యప్రతాప్, విజయాంబిక ప్లాన్ ఏంటో?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget