Satyabhama Serial Today October 23rd: సత్యభామ సీరియల్: సత్య మీద సంజయ్ కళ్లు, వంకర మాటలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి భర్తకి కంప్లైంట్ ఇచ్చిన సత్య!
Satyabhama Today Episode ఇంట్లో అందరూ సత్య వంటని పొగడటం సంజయ్ టేస్ట్ చేసి వంటతో పాటు సత్య మీద ఇబ్బంది కరంగా కామెంట్లు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode మహదేవయ్య చక్రవర్తితో ఎవరూ చూడకుండా మాట్లాడుతాడు. తన అసలైన చిన్న కొడుకు సంజయ్‌ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావని అడుగుతాడు. దాంతో చక్రవర్తి శాశ్వతంగా నీ ఇంట్లోనే నీ కొడుకుని వదిలేసి వెళ్లాలని తీసుకొచ్చానని అంటాడు. మహదేవయ్య వెంటనే సంజయ్‌ని తీసుకెళ్లిపో అని అంటే కుదరదంటే కుందరదని చక్రవర్తి అంటాడు.
చక్రవర్తి: నా కొడుకు నాకు కావాలి అందుకే సంజయ్‌ని ఇక్కడికి తీసుకొచ్చాను. పాతికేళ్ల నాటకానికి తెర దించడానికే సంజయ్‌ని తీసుకొచ్చా.
మహదేవయ్య: నవ్వుతూ.. తీస్కపోతావా ఎట్లా తీస్కపోతావ్ ఏమని చెప్పి తీస్కపోతావ్. వాడు నా చేతిలో తోలు బొమ్మ నా నీడ దాటి అడుగు బయట పెట్టని ఆట బొమ్మ.
చక్రవర్తి: తెలుసు అన్నయ్య నువ్వు ఇలా పదే పదే చెప్పక్కర్లేదు. క్రిష్‌ని నువ్వు ఎలా పెంచావో తెలుసు వాడు ఎంతలా నీ మాయలో పడ్డాడో తెలుసు తెలిశాక కూడా వాడిని ఎలా నీ మాయలో పెడతాను చెప్పు. నాకు శక్తి లేకపోవచ్చు నీకు ఎదురు తిరగలేకపోవచ్చు కానీ ఆ శక్తి ఉన్న ఓ ఆది శక్తిని అడ్డు పెట్టుకొని నీకు ఎదురు తిరుగుతా. చూపిస్తా..
మహదేవయ్య: చూపించు చూపించు.
చక్రవర్తి: ఓసారి అటు చూడు.
మహదేవయ్య: సత్యని చూసి నీకు కళ్లు మసకబారాయిరా ఇది గడ్డ పరకరా.
చక్రవర్తి: ఆ గడ్డి పరకకు భయపడే కదా నీ పెద్ద కొడుకు జైలులో ఉన్నాడు. ఆ గడ్డి పరకకు భయపడే కదా నా కొడుకు పేరు నీ గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకున్నావ్. నీ చిన్నాని అడ్డు పెట్టుకొని ఆటలు ఆడితే నేను నీ కోడలిని కాదు కాదు నా కోడలిని అడ్డు పెట్టుకొని యుద్ధం చేస్తా.
మహదేవయ్య: ఏంట్రా చిన్నాకి నువ్వే అసలు తండ్రి అన్న విషయం సత్యకి చెప్తావా అదే జరిగితే నేను ఎంతకి తెగిస్తానో తెలుసా. చిన్నాని నీ కళ్లకి కనిపించకుండా చేస్తా.
చక్రవర్తి: తెలుసన్నయ్య అందుకే ఆ నిజం చెప్పకుండా నాకు కావాల్సింది సాధించుకుంటా. ఆ నమ్మకంతోనే నీ కొడుకుని ధైర్యంగా ఇక్కడ వదిలేసి వెళ్తున్నా ఇక మిగిలింది నా కొడుకుని తీసుకెళ్లడమే అది నా కోడలు చూసుకుంటుంది. లోపలికి వెళ్లి హ్యాపీగా నీ కొడుకుతో ఎంజాయ్ చేయ్ అన్నయ్య.
ఇక సంజయ్ ఎక్కడుందీ నా బ్యూటీ అని సత్య కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో సత్య బయట సత్యభామనే అనే సాంగ్ పెట్టుకొని బట్టలు ఆరేయడం చూసి పక్కన ఉన్న గులాబి పువ్వు తీసుకొని సత్య దగ్గరకు వస్తాడు. ఏం కావాలని సత్య అడిగితే ఎదురుగా ఇంత అందం ఉంటే ఇంకేం కావాలి అంటాడు. చిన్న మూమెంట్స్ అయినా అద్భుతంగా డ్యాన్స్ చేశావని నా హర్ట్ టచ్ చేశావని పువ్వు చేతికి ఇస్తాడు. సత్య వద్దు అనేస్తుంది. పరాయివాళ్ల భార్యతో ఇలా ప్రవర్తించడం తప్పు అని నీ లిమిట్స్‌లో ఉండు అని సత్య చెప్తుంది.
సత్యభామలో ఫైర్ చూడకని ఆ పువ్వుని కింద వేసి నలిపేస్తుంది దానికి సంజయ్ అది నా హార్ట్ నలిపేయకని అసలు నువ్వు చక్రవర్తి కొడుకువేనా అని అంటుంది. ఇక సంజయ్ కోరుకున్నది దక్కించుకోవడమే నా సంస్కారం అనుకుంటాడు. మరోవైపు సత్య బాల్కానీలో ఉంటే క్రిష్ వెనకనుంచి వచ్చి టచ్ చేస్తే సత్య ఏయ్ అని అరుస్తుంది. దాంతో క్రిష్ సత్య నేను ఏమైంది అని అడుగుతుంది. దానికి సత్య సంజయ్ ఎన్ని రోజులు ఇక్కడ ఉంటాడు అని అడుగుతుంది. ఈ రోజే వచ్చాడు కదా పెళ్లి చేస్తానని బాబయ్‌కి మాట ఇచ్చా కదా అంటాడు.
నన్ను ముందు ద్వేషించావ్ తర్వాత అలవాటు అయ్యావ్ కదా వాడికి కూడా అలవాటు అవుతావు అంటే ఏయ్ ఊరుకో ఎందుకు వాడితో నిన్ను కంపార్ చేసుకుంటావని అంటుంది సత్య. ఇక నువ్వు ఎప్పుడైనా పరాయి ఆడదాన్ని పొగిడావా అని అడిగితే పొగిడాను అని క్రిష్ అంటాడు. సత్య ఫుల్ ఫైర్ అయితే పెళ్లికి ముందు నిన్ను పొగిడా అని అంటాడు. ఇక సంజయ్ నన్ను చాలా అందంగా ఉన్నానని అన్నాడని అంటే క్రిష్ చిన్నాగా నవ్వి ఇలాంటి అబద్దాలు పట్టించుకోకు సత్య అబద్దాలు చెప్పిన వాళ్లు నరకానికి వెళ్తారు అంటాడు. సత్య బుంగమూతి పెట్టుకుంటుంది.
అందరూ భోజనాలకు కూర్చొంటారు. సంజయ్ మాత్రం తినానికి రాడు. మహదేవయ్య అడిగితే ఉప్పుకారం నా వల్ల కాదన్ని అంటాడు. దాంతో భైరవి వాడు పిజ్జాలు ఆర్డర్ చేసుకుంటాడు అని అంటుంది. ఇక జయమ్మ ఒకప్పుడు వంటల్లో కారాలు ఇప్పుడు సత్య వంట సూపర్‌గా ఉంటుంది అని అంటుంది. క్రిష్ కూడా నాకు పొట్ట వచ్చింది అన్నావ్ కదా ఇదే రీజన్ అంటాడు. ఇక సంజయ్ వెంటనే వచ్చి వడ్డించమని అంటాడు. ఇక సంజయ్ తింటూ నువ్వు గ్రేట్ బ్రో సూపర్ వైఫ్ గ్రేట్ వైఫ్ అని సత్యకి అర్థమయ్యేలా నెగిటివ్‌గా పొడుగుతాడు. సత్యని పొగుడతే భైరవి తిట్టుకుంటుంది. పంకజం కూడా భైరవిని రెచ్చ గొడుతుంది.
ఇక సత్యని తన భర్త ఏం అనడం లేదని ఏం చేసినా ఊరుకుంటున్నారని ఇద్దరూ సపరేట్‌గా మాట్లాడుకుంటున్నారని అంటుంది. ఇక సత్య మీద ఎలా అయినా పగ తీర్చుకుంటానని భైరవి అంటుంది. ఉదయం సత్య తులసి కోట దగ్గర పూజ చేస్తుంటే అప్పుడే లేచి వచ్చి సంజయ్ వస్తాడు. ఈ అందం చూడటానికి నా కళ్లు సరిపోవని కెమెరాలో బంధించాలి అనుకొని చాటుగా ఫొటోలు తీస్తాడు. సత్య అది చూసేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: పచ్చబొట్టేసినా ప్రయోజనం లేకున్నదే: మామని చూసి సత్య పాటలు, చిన్న కొడుకు ఎంట్రీ!