అన్వేషించండి

Satyabhama Serial Today January 28th: సత్యభామ సీరియల్: సంధ్యని కొట్టి సంజయ్‌కి వార్నింగ్ ఇచ్చిన సత్య.. పెళ్లికి ఓకే చెప్పిన మహదేవయ్య, సత్య ఒప్పుకుంటుందా!

Satyabhama Today Episode సంధ్య సంజయ్‌ని ప్రేమిస్తుందని సత్య ఇంట్లో వాళ్లకి చెప్పి సంధ్యని కొట్టి ఈ పెళ్లి జరగదు అని వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode తన ప్రేమ విషయం అక్కకి తెలిసిపోయిందని సంధ్య చాలా టెన్షన్ పడుతుంది. అక్కకి ఎలక్షన్‌లో సపోర్ట్ చేయలేదని రివేంజ్ తీసుకుంటుందని అనుకుంటుంది. ఇంతలో సంజయ్ సంధ్యకి కాల్ చేస్తాడు. సంధ్య సంజయ్‌ని తిడుతుంది. అక్కకి లవ్ మేటర్ తెలిసిపోయిందని అంటుంది. దాంతో సంజయ్ మీ అక్క నన్ను వార్నింగ్ ఇచ్చిందని.. ఇప్పుడు మీ ఇంటికే బయల్దేరిందని సునామీని ఎదురించడానికి సిద్ధంగా ఉండమని అంటాడు. సంధ్య చాలా టెన్షన్ పడుతుంది. దాంతో సంజయ్ మా పెద్దనాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడని చెప్తాడు. సంధ్య చాలా  సంతోషిస్తుంది. 

మహదేవయ్య పెళ్లికి ఒక కండీషన్ పెట్టారని మీ అక్క ఎలక్షన్లో పోటీ చేయకుండా నువ్వే ఆపాలని అంటాడు. ఇక సత్య తన గురించి చెడుగా చెప్తుందని ఏం నమ్మొద్దని అంటాడు. పోటీ నుంచి తప్పుకోమని ఫోర్స్ చేయమని అంటాడు. ఇంతలో సత్య ఇంటికి వచ్చి సంధ్యని పిలుస్తుంది. సత్య కోపంగా సంధ్యని పిలుస్తుంది. అందరూ ఏమైందని అడిగితే అది వస్తేనే అన్నీ తేల్చుతానని సత్య అంటుంది. ఇంతలో సంధ్య వస్తుంది. సత్య సంధ్యని కొడుకుతుంది. ఏమైందని అందరూ అడుగుతారు.

సత్య: మనకు నమ్మక ద్రోహం చేస్తుంది. మనల్ని మోసం చేస్తుంది. మన అందరి కళ్లు కప్పి నా మరిది సంజయ్‌ని ప్రేమిస్తుంది. కంప్యూటర్ క్లాస్‌ల పేరు చెప్పి చెట్టాపట్టాలేసుకొని వాడితో తిరుగుతుంది. 
విశాలాక్షి: అక్క చెప్పేది నిజమేనా.
సంధ్య: నిజమే నేను సంజయ్‌ని ప్రేమిస్తున్నాను. మేం పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నా. ప్రేమించడం తప్పు అయితే బావగారు చేసింది తప్పే. అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించడం తప్పా.
సత్య: ప్రేమించడం తప్పు కాదే నువ్వు ప్రేమించిన మనిషి కరెక్ట్ కాదు.
సంధ్య: అక్క సంజయ్ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా మర్యాదగా ఉండదు. 
నందిని: సంజయ్ అన్న తప్పుడు మనిషి అని నీకు ఎలా తెలుసు వదిన.
సంధ్య: కథలు అల్లుతుంది. 
సత్య: సంధ్య నేను నీ మంచి కోరుకుంటానే నువ్వు నా చెల్లివే.
సంధ్య: నువ్వు చెప్పిందే నిజమైతే మా ఇద్దరికీ దగ్గరుండి పెళ్లి  చేయి.
సత్య: వాడు మంచోడు కాదు సంధ్య నాతో చెడుగా ప్రవర్తించాడు. మర్యాద లేకుండా మాట్లాడాడు. వాడి ఆగడాలు భరించలేక ఒక సారి కొట్టాను. అప్పటి నుంచి నా మీద పగ పెంచుకున్నాడు. నన్ను ఏం చేయలేక సంధ్య మీద ప్రేమ అనే నాటకం ఆడుతున్నాడు. సంధ్యని పెళ్లి చేసుకొని నరకం చూపిస్తాను అని నాతోనే  చెప్పాడు. 
సంధ్య: అమ్మానాన్న అక్క నాటకాలు ఆడుతుంది. సంజయ్ చాలా మంచోడు. అక్క గురించి నాకు ముందే చెప్పాడు. తను అన్నట్లే అక్క ప్రవర్తిస్తుంది. అక్క స్వార్థంతో ప్రవర్తిస్తుంది. నేను ఆ ఇంటి కోడలు కావాలి అంటే అక్క ఎన్నికల నుంచి తప్పుకోవాలని కండీషన్ పెట్టారు. 
సత్య: నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకు ఎందుకు అలాంటి కండీషన్ పెడతారు. వాళ్ల టార్గెట్ నేను సంధ్య. నన్ను ఓడించడానికి నిన్ను బలి చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా. అమాయకంగా చెల్లి వాళ్లు ఉచ్చులో లాగుతుంది. అందరి జీవితాలు అయోమయంలో పడతాయి నాన్న. మనసులో సంజయ్‌ ఆ మహదేవయ్య కొడుకు అది నేను ఎలా చెప్పగలను చెప్పినా ఎవరు నమ్ముతారు. 

సత్య ఎంత చెప్పినా సంధ్య వినదు. సంజయ్‌ని పెళ్లి చేసుకొని తీరుతానని ఎవరూ అడ్డుపడినా ఆగను అని తండ్రితో చెప్తుంది. దాంతో విశాలాక్షి కాళ్లు విరగ్గొడతానని రేపు సంబంధానికి ఒకే చేయాలని అంటుంది. ఇక సంజయ్ స్వీట్స్ తీసుకొని మహదేవయ్య దగ్గరకు వెళ్తాడు. సత్య ఎలక్షన్లో పోటీ పడదని సంధ్య అడ్డుకుంటుందని అక్కడ మంట పెట్టానని చెప్తాడు. ఇద్దరూ హ్యాపీగా స్వీట్స్ తింటారు. ఇంతలో ఇంటిళ్లపాది అక్కడికి వస్తారు. ఏంటి స్పెషల్ అని అడుగుతారు. దాంతో ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. మహదేవయ్య అందరితో సంజయ్ ప్రేమలో పడ్డాడని చెప్తాడు. అందరూ సంతోషిస్తారు. ఎవరు అమ్మాయి అని అడిగితే సత్య చెల్లి సంధ్య అని చెప్తే అందరూ షాక్ అవుతారు.

భైరవి సంజయ్‌ని తిడుతుంది. సత్యకి విషయం తెలుసా అని క్రిష్ అడిగితే మా పెళ్లి విషయం మాట్లాడటానికి వెళ్లిందని చెప్తాడు. ఇంతలో సత్య వస్తే క్రిష్ వెళ్లి స్వీట్ ఇవ్వమని చెప్తాడు. సంజయ్ సత్యకి స్వీట్ ఇస్తే సత్య దాన్ని విసిరి కింద కొడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఓడిన వాడు మళ్లీ గెలవొచ్చు కానీ దిగజారిన వాడు ఎందుకూ పనికి రాడని నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమవుతుందని సంజయ్‌తో అంటుంది. సంధ్యతో నీ పెళ్లి జరగదు అని సంధ్యని మర్చిపో అని వార్నింగ్ ఇస్తుంది. సంజయ్ తమని విడదీయొద్దని అంటాడు. నీ పెళ్లాం మన ఫ్యామిలీనే అవమానించిందని రుద్ర క్రిష్‌తో అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సంధ్య ఫోన్ కాల్ వినేసిన సత్య.. సంజయ్‌కి వార్నింగ్.. కోడలికి ఉచ్చు బిగించిన మామ!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 22th: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ
జగద్ధాత్రి సీరియల్: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
Godavari Serial Today July 22nd: 'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
Jabardasth Latest Promo: 'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget