తెలుగులో పూజా హెగ్డే సినిమాలకు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే
ఒక లైలాకోసం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది పూజా. నాగ చైతన్యతో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 40 కోట్లు కలెక్ట్ చేసింది.
ఒక లైలా కోసం సినిమా కంటే ముందే ఈ సినిమా ప్రారంభమైనా.. ఆ సినిమా ముందు రిలీజ్ కావడంతో ముకుంద సెకండ్ ఫిల్మ్‌గా వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 12 కోట్లు కలెక్ట్ చేసింది.
దువ్వాడ జగన్నాథంతో హిట్‌ని అందుకుంది పూజా. బన్నీతో చేసిన ఈ సినిమా 150 కోట్లు కలెక్ట్ చేసింది.
అరవింద సమేతతో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం కొట్టేసింది పూజా. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 136.5 కొల్లగొట్టింది.
మహర్షి సినిమాలో మహేశ్ బాబు సరసన నటించింది పూజా. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 130 కోట్లు సంపాదించింది.
గద్దలకొండ గణేష్ సినిమాతో వరుణ్‌తో మరోసారి జతకట్టింది పూజా. ఫుల్ రన్ పూర్తయ్యే సరికి ఈ సినిమా 25.15 కోట్లు మాత్రమే రాబట్టింది.
అల వైకుంఠపురంలో 262 కోట్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో పూజా హెగ్డేకు దేశవ్యాప్తంగా ఫేమ్ పెరిగింది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచెలర్ సినిమాతో అఖిల్ సరసన నటించి మెప్పించింది పూజా. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 24.14 కోట్లు కలెక్షన్స్ అందించింది.
పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య సినిమాలు హిట్ టాక్ సంపాదించుకోలేకపోయాయి. రాధే శ్యామ్ 202.80 కోట్లు రాబట్టగా.. ఆచార్య 47.82 కోట్లతో ఫ్లాప్‌గా నిలిచింది.