Satyabhama Serial Today December 12th: సత్యభామ సీరియల్: సత్య పుట్టింటికి వచ్చి రచ్చ చేసిన భైరవి.. సత్యకి మహదేవయ్య మాస్ వార్నింగ్!
Satyabhama Today Episode క్రిష్ తన కన్న కొడుకు కాదనే నిజం క్రిష్‌కి చెప్పే ప్రయత్నం మానుకుంటే అన్ని ఇక్కడితో ఆపేస్తా అని మహదేవయ్య సత్యకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode విశ్వనాథం బాధలో విశాలాక్షిని తిట్టేస్తాడు. తర్వాత క్షమాపణ చెప్పి ఆమె కాలు పట్టుకుంటాడు. ఏం చేస్తున్నారని ఆమె ఏడుస్తుంది. నీకు ఏం ఇవ్వలేకపోయినా ప్రశాంతమైన జీవితం ఇస్తాను అనుకున్నా కానీ ఇప్పుడు ఇవ్వలేకపోయానని ఏడుస్తాడు. ఇద్దరి మాటలు సత్య వింటుంది. కష్టాలలోనే మనం ఇంకా ఒకరికి ఒకరు అండగా ఉండాలి అని సత్యలా ధైర్యంగా ఉండాలని చెప్తుంది. సత్య ఏడుస్తూ బయటకు వెళ్లిపోతుంది. అప్పుడే మహదేవయ్య కాల్ చేస్తాడు.
మహదేవయ్య: ఫోనులో పెద్దగా నవ్వుతూ.. ఏం చేస్తున్నావ్ కోడలి కాని కోడలా ఏడుస్తున్నావా. ఆ బ్రహ్మ ఏం చేయాలో నుదిటి మీద రాస్తాడు. ఈ మహదేవయ్య ఏం చేస్తాడో చెప్పకుండా చేస్తాడు. ఈడ ఉంటే నా మీషాలు గుంజుతూ చెప్పులో రాయిలా గుచ్చుకుంటూ ఉండేదానివి ఒక్కసారి ఈ మహదేవయ్య ప్రతాపం చూపించే సరికి గుండెలు బాధుతూ పుట్టింటికి వెళ్లిపోయావ్. నా దెబ్బకు నీ వాళ్లు ఏడుస్తున్నారు కదా. ఇది ఆట ప్రారంభం మాత్రమే. ఓపినింగే ఇలా ఉంటే ముందు ముందు ట్విస్ట్‌లు ఎలా ఉంటాయో చూసుకో. తలచుకుంటేనే చెమటలు పడుతున్నాయా. ఇదంతా నువ్వు నన్ను రెచ్చగొట్టి చేస్తున్నావ్. ఇంతకీ నేను ఎందుకు కాల్ చేశాను అంటే డీల్ మాట్లాడుదాం అని.
సత్య: ఏం చెప్పాలి అనుకుంటున్నారు.
మహదేవయ్య: చూడు ఇక నుంచి తిక్క వేషాలు మానేసి బుద్ధిగా పడుంటాను అని మాటివ్వు. ఆ క్రిష్ గాడికి తండ్రి ఎవరో తెలుసుకుందామని ఉద్యమాలు మానేయ్. నా చిన్న కోడలు అనే ముసుగులో బుద్ధిగా పడుండు. లేదంటే నీ పుట్టింటి వాళ్లకి నా ఇంటర్వెల్ సినిమా ఎలా ఉంటుందో చేస్తా. దెబ్బకి రోడ్డున పడతారు. తర్వాత అప్పులోలు వచ్చి ఒంటి మీద బట్టలు లాగేస్తారు.
సత్య: నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో మహదేవయ్య. నా భర్తని మోసం చేసి పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు నా పుట్టింటి జోలికి వచ్చి ఇంకా పెద్ద తప్పు చేశారు. నీ కొడుకు కాని కొడుకు మందు తల దించుకునేలా చేస్తా చూస్తూ ఉండు.
మహదేవయ్య: అదీ చూస్తా.
సత్య తండ్రితో పాటు అందరికి కాఫీ ఇస్తుంది. ఇంతలో భైరవి అక్కడికి వస్తుంది. మీరేంటి ఇలా వచ్చారని సత్య అడిగితే ఇంట్లో టీ పెట్టే దిక్కులేదు అందుకే తాగి పోదాం అని వచ్చానంటుంది. ఎందుకు వచ్చుంటుందని సత్య అనుకుంటుంది. వెళ్లిపోదాం తయారవు అని భైరవి అంటే సత్య ఇక్కడ కొంచెం పని ఉంది రాను అంటుంది. దానిక భైరవి రావాల్సిందే అంటుంది. సత్య ఇక్కడ నా పనులు అయితే వస్తాను అంటుంది. దాంతో భైరవి విశాలాక్షి మీద సీరియస్ అవుతుంది. ఇక్కడ అందరూ పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని తోడుగా ఉండాలి అని వచ్చానని మీ మాటలతో మా వాళ్లని మరింత బాధ పెట్టొద్దని అంటుంది.
ఇక నందిని మాట్లాడితే భైరవి నువ్వు మాట్లాడకు అని అంటుంది. దానికి భైరవి విశాలాక్షితో నా కోడలికి ఇక్కడి సమస్యలతో ఏం సంబంధం లేదు నాతో పంపండి అని అంటుంది. అందరూ సత్యని పంపించడానికి ఒప్పిస్తారు. ఇక సత్య భైరవితో నేను రాను అంటే రాను మీరు వెళ్లిపోండి అని అంటుంది. నన్ను ఎట్లా తీసిపారేస్తుందో చూడండి అని భైరవి చెప్తుంది. ఇంతలో క్రిష్ వస్తాడు. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావ్ అని అడుగుతాడు. సత్యని తీసుకెళ్లడానికి అమ్మ వచ్చిందని నందిని చెప్తుంది. నాతో చెప్పాల్సింది అమ్మ వద్దని చెప్పేవాడిని అని అంటాడు. అది బయల్దేరింది నువ్వు అడ్డు పడకు అని భైరవి అంటే నేను బయల్దేరలేదు అని చెప్తుంది. ఇక సత్య తాంబూలం పెట్టి అత్తయ్యని గౌరవంగా ఇంటి నుంచి పంపేస్తుంది.
సత్య, క్రిష్‌లు కరెంట్ ఆఫీస్‌కి వెళ్తారు. కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు బిల్ 2 లక్షలు అంటున్నారని చెప్తాడు. దాంతో ఆయన చూసి 2 లక్షలు పెండింగ్ ఉందని అంటాడు. అలా కుదరదు అని చెప్తాడు. అదంతా పాత బిల్లు అని ఆయన అంటే చాలా చెక్ చేయాలని 3, 4 రోజులు పడుతుందని ఆయన అంటారు. అప్పటి వరకు మేం చీకటిలో దోమలు కొట్టుకోవాలా అని క్రిష్ కోప్పడతాడు. నేను ఎవరో తెలుసా పవర్ ఇవ్వకపోతే నేనేంటో చూపిస్తా అని అంటాడు. మీరు ఇంటికి వెళ్లేలోపు పవర్ వస్తుందని ఆయన చెప్పగానే లేదంటే నా పవర్ చూపిస్తా అని క్రిష్ అంటాడు. తర్వాత ఆయన మహదేవయ్యకి కాల్ చేసి ఒకే ఇంటి నుంచి రెండు బెదిరింపులు వస్తే ఎలా అని అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఒకే చోట కనకం, విహారి.. వెనకాలే సహస్ర.. యమునకు ఘోర అవమానం!