అన్వేషించండి

Satyabhama Serial August 14th: సత్యభామ సీరియల్:  భైరవి మీద విరుచుకుపడ్డ నందిని.. సత్య చేయి వదలనన్న క్రిష్, రేణుక జస్ట్ మిస్! 

Satyabhama Today Episode రేణుక ఆయిల్ మీద కాలు వేసి జారిపడిపోవడం సత్య కాపాడే టైంలో తన బోనం కుండ పగిలిపోవడంతో భైరవి సత్యని నిందించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode రుద్ర తన భార్యని అడ్డు వస్తే మామని చంపేయ్‌మని అంటాడు. పెద్దయ్య జోలికి పోవడం మా వల్ల కాదని రౌడీలు భయపడతారు. పెద్దయ్య, చిన్నబాబు ఇద్దరూ మా జోలికి రాకుండా చూసుకో అని రుద్రతో చెప్తారు. మరోవైపు మహాదేవయ్య ఫ్యామిలీ సత్య కోసం ఎదురు చూస్తుంటారు. సత్య భయంతో రావడం లేదని అంటారు. ఇంతలో సత్య ఫ్యామిలీతో వస్తుంది.  

సత్య: పారిపోయాం అనుకున్నారా అత్తయ్య.
జయమ్మ: సంబరాలు కూడా చేసేసుకుంటున్నారు. కొంచెం లేట్ అయింటే మీ అత్తయ్య తీన్మార్ డ్యాన్స్ కూడా చేసేది. 
సత్య: అత్తయ్య ఒకసారి మీరు మామయ్య పక్కపక్కన నిల్చొంటారా మీ దీవెనలు తీసుకుంటాం. క్రిష్‌ రా. విజయోస్తు అని దీవించండి అత్తయ్య. అమ్మవారికి దండం పెట్టుకుంటూ.. ఇది గెలుపు ఓటముల సమస్య కాదు అమ్మ. నా చావు బతుకుల సమస్య. నాది న్యాయపోరాటం నా వెనక అధర్మ యుద్ధం జరుగుతుంటే నేనేం చేయలేను.
క్రిష్: అమ్మా నా కోసం నేను ఏం కోరుకోవడం లేదు. కోరుకోవడానికి ఏం మిగల్లేదు. దాదాపు రెండు నెలల మిగిలున్న బంధం మాది. నా దగ్గర నుంచి పోయే అంత వరకు సత్యకి ఏ ఇబ్బంది రాకుండా చూడు తల్లీ. నా నుంచి విడిపోయేటప్పుడు కూడా సత్య నవ్వుతూ సంతోషంగా ఉండాలి. 
పంతులు: కంకణం క్రిష్ చేతికి కట్టమని సత్యకి ఇచ్చి. ఆ కంకణం భార్యభర్తల బంధాన్ని మరింత గట్టిపడేలా చేస్తుంది. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో కలిసి మెలసి ఉండేలా చేస్తుంది. ఎంత పెద్ద సునామి వచ్చినా ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని చెదిరిపోకుండా చేస్తుంది. 
జయమ్మ: ఎందుకురా చేయి వెనక్కి తీసుకున్నావ్.
క్రిష్: నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదమ్మా.
జయమ్మ: నీకు కంకణం మీద నమ్మకం లేదా సత్య మీద లేదా. 
సత్య: ఇష్టం  లేనప్పుడు వద్దులే అమ్మమ్మ ఈ కంకణం తన దగ్గరే ఉంచుకోనివ్వండి. తనకి నమ్మకం కుదిరితే నాకు ఇస్తే అప్పుడు కడతా. 
జయమ్మ: ఆగరా నీ చేతికి కంకణం కట్టించుకోకపోతే సత్య బోనం ఎత్తదు. నువ్వే మీ బంధానికి విలువ ఇవ్వకపోతే అమ్మవారు ఎలా ఇస్తుంది. సత్య బయల్దేరు.

క్రిష్ గుడి గంట నాన్ స్టాప్‌గా కొడతాడు. సత్య, జయమ్మ ఆగుతారు. సత్య క్రిష్ దగ్గరకు వెళ్తుంది. క్రిష్ కంకణం సత్యకి ఇస్తాడు. సత్య క్రిష్ చేతికి కంకణం కడుతుంది. నువ్వు ఓడిపోకూడదు సత్య నీ ఓటమికి నేను కారణం కాకూడదు దగ్గరుండి గెలిపించుకుంటానని అంటాడు. సత్య చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. సత్య చాలా సంతోషిస్తుంది. మరోవైపు నందిని బోనం ఎత్తనని అంటే భైరవి కోప్పడుతుంది. అమ్మపిలిచిందని వచ్చావ్ బోనం కూడా ఎత్తితే సంతోషం అని అంటుంది.

నందిని: హలో నువ్వు పిలిచావని రాలే మా వాళ్లతో కలిసి వచ్చా. వాళ్ల కోసం వచ్చిన. మా వదిన బోనం ఎత్తుతుంటే అంతా మంచే జరగాలి అని కోరుకోవడానికి వచ్చా.
మహదేవయ్య: అంటే ఏంటి అమ్మా మేం నీకు ఏంకామా.
నందిని: అది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు. మీరు మీరు ప్రశ్నించుకోండి.
విశ్వనాథం: అమ్మ తప్పు అమ్మ పెద్దవాళ్ల మనసు అలా బాధ పెట్టకూడదు.
నందిని: ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. నేను వాళ్ల మనసుని బాధ పెడుతున్నానేమో వాళ్ల నా మనసు చంపేశారు.
రుద్ర: ఏందే ఊరుకుంటుంటే అంత రెచ్చిపోతున్నావ్.
రేణుక: ఏమయ్యా ఆడపిల్ల మీద అలా అరవకూడదయ్యా. 
రుద్ర: అది అనే మాటలు బాగున్నాయా.
హర్ష: నందిని మాటలు నచ్చకపోతే నచ్చజెప్పుకోవాలి దౌర్జన్యం చేస్తే బాగుంటుందా.
నందిని: అయినా పుట్టింటితో సంబంధం లేదన్నోడివి ఎందుకురా పుట్టింటి తరఫున నాతో మాట్లాడుతున్నావ్ నువ్వు ఏం అన్నా పడటానికి నేను పెద్దొదినలా కాదు. నీలో నాలో ఒకటే రక్తం నేను ఏమైనా చేస్తా. 
విశాలాక్షి: అమ్మా నందిని రామ్మా అని తీసుకెళ్లిపోతుంది.

క్రిష్‌ సత్య చేయి పట్టుకొని రావడం చూసిన భైరవి కోపంతో రగిలిపోతుంది. భర్తకి చూపిస్తుంది. వాళ్ల బతుకులు విడదీద్దాం అనుకుంటే వాళ్లేంటని అంటుంది. దానికి మహదేవయ్య దాని ముఖంలో భయం కనిపించడం లేదు వాడి ముఖంలో బెరుకు కనిపించడం లేదని అంటాడు. సత్య క్రిష్‌ చేయి విడిపించుకోవాలని చూస్తే క్రిష్‌ వదలడు. మీరు త్వరలో విడిపోయే జంట అని అంటుంది.  

భైరవి: నువ్వు వచ్చింది మొగుడి వెనక చేయి పట్టుకొని తిరగడానికి కాదు నీ పవిత్రత రుజువు చేయడానికి మర్చిపోయావా.
క్రిష్: మేం మర్చిపోయినా గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావ్ కదమ్మా.
భైరవి: గుర్తు చేసినా మాయ చేయడానికి పక్కన నీ పెండ్లాం ఉంది కదరా.
క్రిష్: అవునమ్మ నువ్వు బాపుని ఏం మాయ చేశావ్. బాపు నోరు నువ్వు నొక్కేసి మొత్తం నువ్వే కథలు నడుపుతున్నావ్. 
భైరవి: ఏం మాట్లాడుతున్నావ్‌రా తమాషాలు నేను మాయ చేయడం ఏంటి.
క్రిష్: అహా.. కోడలు చేస్తే మాయలా అదే పని అత్త చేస్తే అమాయకురాలా. అంతేనా.

సత్య నవ్వుకుంటుంది. దానికి భైరవి నీ మొగుడు మాట్లాడుతుంటే మురిసి పోవడం కాదు. వెళ్లి బోనం ఎత్తు పద. ఇక రేణుకని సత్య కోనేటి వరకు పిలిస్తే వెళ్లమని రుద్ర చెప్తాడు. రేణుక ఒంటరిగా దొరికితేనే నా పని ఈజీ అవుతుందని అంటాడు. రేణుక వెనక్కి తిరిగి చూస్తే రుద్ర ఎవరికీ తెలీకుండా బాయ్ చెప్తాడు. రేణుక సంతోష పడుతూనే అనుమానంగా చూస్తుంది. రౌడీలు రేణుక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సత్య, రేణుకలు కుండలు పట్టుకొని వస్తుంటారు. దగ్గరకు రాగానే పొడిచేద్దాం అని రౌడీలు అనుకుంటే క్రిష్ వెనకాలే వస్తాడు దాంతో రౌడీలు భయపడతారు. ఇంతలో రుద్ర వచ్చి క్రిష్‌ని తీసుకెళ్లిపోతాడు. తీన్మార్ డ్యాన్స్ చేయిస్తాడు. ఇక ఓ పిల్లడు అటుగా వెళ్తూ ఆయిల్ కింద పడేస్తాడు. రేణుకని పొడవడానికి వెనకాలే వస్తాడు. రౌడీ రేణుకని పొడిచే టైంకి రేణుక ఆయిల్ మీద కాలు వేసి జారిపోతుంటే సత్య పట్టుకుంటుంది. అందరూ అక్కడికి కంగారుగా వస్తారు. ఇక సత్య కుండ పగిలిపోవడంతో భైరవి సత్యని తిడుతుంది. అరిష్టం అని తిడుతుంది. సత్య బోనం ఎత్తడం అమ్మవారికి ఇష్టం లేదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప కార్తీక్‌లను అలా చూసి మండిపోతున్న జ్యోత్స్న.. ఎంట్రీ ఇచ్చిన జ్యోత్స్న కన్న తండ్రి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget