అన్వేషించండి

Satyabhama Serial Today September 28th: సత్యభామ సీరియల్: రౌడీని చంపేసి సత్యకు ట్విస్ట్ ఇచ్చిన మహదేవయ్య.. అదిరిపోతున్న మామకోడలి చదరంగం!

Satyabhama Today Episode మైత్రి ఇంటి నుంచి వెళ్లిపోతానని చెప్పడం హర్ష ఆపడం అది నందిని విని హర్షతో గొడవ పెట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode మైత్రి వెళ్లిపోవాలని బ్యాగ్ సర్దుకుంటుంది. హర్ష ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఇక నందిని గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు. నందిని చాటుగా వింటుంది. నందిని కంటే నేనే మెచ్చూర్డ్ అని నందిని, నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే నేనే ఇంటి నుంచి వెళ్లిపోవాలని తనని ఆపోద్దని అంటుంది. 

హర్ష: మైత్రి ఆగు నువ్వు ఒకసారి నీ గురించి ఆలోచించు. నువ్వు ఇంకా రికవరీ అవ్వలేదు. నేను నీ ఫ్రెండ్ నీ గురించి ఆలోచిస్తున్నా.
మైత్రి: నేను కూడా నీ వెల్ విషర్‌నే అందుకే నీ గురించి ఆలోచిస్తున్నాను. 
హర్ష: నేను వెళ్లనివ్వను నువ్వు వెళ్తే మీద ఒట్టు. 
మైత్రి: చిన్నపిల్లల్లా ఒట్టు ఏంటి ఒట్టు. నా మీద ఒట్టు అంటే నువ్వు ఊరుకుంటావా. ఏదైనా ఎమోషనల్‌గా కాదు ప్రాక్టికల్‌గా చూడు.
హర్ష: చివరిసారి అడుగుతున్నా మైత్రి నువ్వు ఇక్కడ ఉండాలి అంటే నేను ఏం చేయాలి. 
మైత్రి: సరే నందినిని బాధ పెట్టకూడదు. తనని సంతోషంగా చూసుకోవాలి తను ఏమన్నా సరే. ఇంకోసారి ఇలాంటి పరిస్థితి ఎదురైతే వెళ్లిపోతా.
హర్ష: సరే..

సత్య బయట నిల్చొని ఆలోచిస్తూ ఉంటే క్రిష్ వచ్చి హగ్ చేసుకుంటాడు. సత్య షాక్ అయిపోతుంది. ఏంటి క్రిష్ ఇది  అంటే ప్రేమ అని అంటాడు. రాత్రి నా పీక పట్టుకొని ఇప్పుడు హగ్ చేసుకుంటే ఏంటి అర్థం అని సత్య అడుగుతుంది. హగ్ అంటే సారీ అని క్రిష్ అంటాడు. సత్య కూడా సారీ అని చెప్తే సారీ వద్దు నువ్వు కూడా హగ్ ఇవ్వఅని అడుగుతాడు. 

సత్య: నీ విషయంలో నాకు నచ్చినట్లు ఉండు అని హక్కు నాకు లేదు క్రిష్‌ అందుకే నన్ను నీకు నచ్చినట్లు మార్చుకోవాలి అనుకుంటున్నావ్. మీ బాపు అంటే నీకు పిచ్చి ఇష్టం అందుకే నేను అనవసరంగా ఆవేశ పడ్డా.
క్రిష్: నేను చిన్నగా చెప్పాల్సింది అనవసరంగా ఆవేశపడ్డా. అన్ని మర్చిపోదాం దోస్త్‌.
సత్య: ఓకే ఫ్రెండ్స్.. దేవుడు మనకు ఏదైనా ఇచ్చేటప్పుడు ఆలస్యం చేస్తాడంట ఎందుకంటే మనకు వాటి విలువ తెలియాలని. అందుకే ఇప్పటికి మనం పూర్తిగా ఒకరికి ఒకరు సొంతం అయ్యాం. ఇక ఈ రోజు నుంచి నేను కూడా మామయ్య గారిని పూర్తిగా సపోర్ట్‌గా ఉండాలా అనుకుంటున్నా. అందుకే రంగంలోకి దిగాను పద నీకు ఒకటి చూపిస్తా. అని గదిలో ఉన్న స్కెచ్ చూపించి మామయ్య గారిని అటాక్ చేసిన వారిలో ఒకరితను ముఖం గుర్తొచ్చి డ్రాయింగ్ వేశా.
క్రిష్: సూపర్ ఇప్పుడు వాళ్లని కచ్చితంగా కనిపెడతా. ఇప్పుడే బాపునకి ఇది చూపిస్తా.
సత్య: తనలో తాను నాకు కావాల్సింది ఇదే వీడు దొరికితే అటాక్ చేసింది ఎవరో తెలుస్తుంది అప్పుడు ఈజీగా మీ బాపు ఏంటో నీకు అర్థం అవుతుంది. తర్వాత నీకు బాపు సొంత తండ్రి కాదని నిజం చెప్తా.
క్రిష్: బాపు ఒకసారి ఈ బొమ్మ చూడు. సత్య వేసింది. 
మహదేవయ్య: కోడలికి ఈ విద్య కూడా ఉందా. అయితే కాంపిటేషన్‌కి పంపిద్దాం.
సత్య: కాదు మామయ్య పోలీస్ స్టేషన్‌కి పంపాను.
క్రిష్: ఈ ఫొటో ఎవరిదో తెలుసా నీ మీద అటాక్ చేసిన వారిలో ఒకరిది. వీడిని పట్టుకుంటే అటాక్ చేయించింది ఎవరో  తెలిసిపోతుంది. 
సత్య: ఆల్రడీ ఈ ఫొటో పోలీసులకు పంపాను. వాడు దొరికేశాడంట కూడా కాసేపట్లో ఇక్కడికి తీసుకొస్తారు. (రుద్ర, మహదేవయ్య భయపడతారు) ఇంత మంచి విషయం చెప్తే టెన్షన్ పడతారేంటి మామయ్య.
మహదేవయ్య: కోడలు కానీ కోడలు తెలివిగా నన్ను ఇరికించాలని చూస్తుందన్న మాట. 

పోలీసులు ఇంటికి వస్తారు. ఎస్‌ఐని రౌడీ గురించి సత్య అడిగితే అతను యాక్సిడెంట్‌లో చనిపోయాడని చెప్తారు. మహదేవయ్య, రుద్ర ఊపిరి పీల్చుకుంటారు. సత్యకు మామ మీద అనుమానం వస్తుంది. కోపంగా చూస్తుంది. పోలీస్‌ జీప్‌కి యాక్సిడెంట్ అవ్వడం ఏంటని క్రిష్ అడిగితే దోషికి మన ప్లాన్ లీక్ అయినట్లు ఉందని సత్య అంటుంది.  

మహదేవయ్య: చిన్న కోడలా ఇక్కడ మహదేవయ్య నా హైట్‌కి తగ్గట్టు ఆలోచించు నీ హైట్‌కి తగ్గట్టు కాదు. నాతో ఛాలెంజ్స్‌ వద్దు కోడలు కానీ కోడలా.

హర్ష, నందిని దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతాడు. నందిని చిరాకుగా వెళ్లిపోతుంది. హర్ష నందినిని ఆపి నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చా ఇస్తాడు. నందిని నాకు నచ్చడం లేదని విసిరేస్తుంది. ఎవరో చెప్తే నువ్వు నాతో ప్రేమగా ఉండటం నాకు దగ్గరవ్వడం ఇష్టం లేదని మైత్రి నువ్వు మాట్లాడుకోవడం నేను విన్నానని అంటుంది. 

హర్ష: నీ మీద ప్రేమ లేదనుకుంటున్నావా. అంతులేని ప్రేమ ఉంది. ఎప్పుడైతే అత్తింటి కోసం పుట్టింటి వాళ్లకి దూరం అయ్యావో అప్పుడే నీ మీద గౌరవం పెరిగింది. మా అందరి కోసం మారిపోయి ప్రేమగా ఉన్నావో అప్పుడే నీ మీద అంతులేని ప్రేమ పుట్టింది. మైత్రి ఈ రోజు ఉంటుంది లేపు ఉండదు. కానీ మన జీవితం మనం డిజైన్ చేసుకోవాలి. 

నందిని హర్షని ఆపి చీర బాగుందని అంటుంది. మరోవైపు మహదేవయ్య సత్య దగ్గరకు వచ్చి నా గురించి నీకు ఇంకా అర్థం కావడం లేదా అని అంటాడు. ఈ మహదేవయ్య నీ చేతికి అందడని అంటాడు. ఆట ఇప్పుడే మొదలైంది కదా కొంచెం చేయి తిరగడం లేదని సత్య అంటుంది. మామయ్య అని పిలవడం బంద్ చేశావా అని మహదేవయ్య అడిగితే పిలిపించుకోవాలని సరదాగా ఉందా అని సత్య అడుగుతుంది. దానికి మహదేవయ్య నేను గెలవకా తప్పదు నువ్వు పిలవకా తప్పదని అంటాడు. నిజం నాకు తెలుసు కదా ఇప్పుడు అందరీకీ అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్యని నిలదీయనున్న విరూపాక్షి.. ముత్యాలుని రెచ్చగొట్టిన జీవన్, రాఘవని చంపే పనిలో దీపక్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget