Ammayi garu Serial Today September 27th: అమ్మాయి గారు సీరియల్: సూర్యని నిలదీయనున్న విరూపాక్షి.. ముత్యాలుని రెచ్చగొట్టిన జీవన్, రాఘవని చంపే పనిలో దీపక్!
Ammayi garu Today Episode ఆర్ ఆర్ కంపెనీనీ కూల్చి వేయించిన సీఎం సూర్యప్రతాప్‌ని నిలదీయడాని విరూపాక్షి కూతురు అల్లుడిని తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode సీఎం సూర్య ప్రతాప్ అక్రమ కట్టాడాలను కూల్చి వేసే పనిలో ఉంటారు. రాజు, సూర్యప్రతాప్‌లను శత్రువులుగా మార్చడానికి జీవన్ రాజుకి చెందిన ఆర్ ఆర్ కంపెనీ కూడా అక్రమ కట్టడం అనేలా అందుకు సంబంధించిన అధికారులతో మాట్లాడి మొత్తం సెట్ చేస్తాడు. సూర్య ప్రతాప్ మీడియాతో మాట్లాడుతుంటే ఓ వ్యక్తి మీ అల్లుడికి సంబంధించిన ఆర్ ఆర్ కంపెనీ కూడా బఫర్ జోన్‌లో ఉంది కదా ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నిస్తాడు. దాంతో సీఎం సంబంధిత అధికారులకు ఆ కంపెనీ మీ సర్వేలో అక్రమ కట్టడం అని తేలిందా అని అడుగుతాడు.
జీవన్‌కి అమ్ముడైపోయిన ఆ ఆఫీసర్ అవునని చెప్తాడు. సూర్య ప్రతాప్ ఆ నిర్మాణాన్ని కూడా కూల్చేమని చెప్తాడు. ఇక హాస్పిటల్‌లో ఉన్న రాజుకి ఆఫీస్ కూలగొట్టడం గురించి చెప్తాడు. రాజు షాక్ అయిపోతాడు. రూప, విరూపాక్షిలకు విషయం చెప్తాడు. ఇద్దరూ షాక్ అయిపోతారు. నోటీస్ కూడా పంపలేదని రాజు అంటాడు.
రూప: ఏదో పొరపాటు జరిగుంటుంది రాజు.
విరూపాక్షి: పొరపాటు కాదు రూప నా మీద కోపాన్ని మీ నాన్న ఇలా చూపిస్తున్నారు. నిన్ను ఆ కంపెనీ సీఈఓగా చూడటం ఇష్టం లేక ఇదంతా చేస్తున్నారు.
రూప: నాన్నకి నీ మీద కోపం నిజమే కానీ నాన్న ఇలాంటి పనులు చేయరు.
రాజు: అసలేం జరిగిందో తెలుసుకోవాలి అంటే మనం ఆఫీస్ దగ్గరకు వెళ్లాలి.
మరోవైపు దీపక్, హారతిని తీసుకొని హాస్పిటల్‌కి తీసుకొస్తుంటాడు. పెళ్లి కాకుండా ఇలా తల్లి అయ్యానని ఎవరు ఏమనుకుంటారో పెళ్లి చేసుకుందామని హారతి అంటే రాజకీయ పరంగా ఇప్పుడున్న పరిస్థితులో ఈ విషయం బయట పడకూడదని దీపక్ హారతిని ఒప్పిస్తాడు. రాజు వాళ్లు వెళ్లగానే దీపక్ హారతిని తీసుకొని ఆ హాస్పిటల్‌కి వస్తాడు. మందారం రాఘవ దగ్గర కాపలాగా ఉంటుంది. రాజు వాళ్లు వచ్చి తమ కంపెనీని ఎందుకు కూల్చుతున్నారని ఎమ్మార్వోని విరూపాక్షి అడుగుతుంది. ఆర్ ఆర్ కంపెనీ నిబంధనల ప్రకారమే ఉందని అంటుంది. కోర్టులోనే విషయం తేల్చుకుంటామని విరూపాక్షి అంటుంది. ఇక అక్కడ పడిన బోర్డు చూసి రూప, రాజు చాలా ఎమోషనల్‌గా ఫీలవుతారు. అది చూసి జీవన్, శ్వేతలు నవ్వుకుంటారు. త్వరలోనే రాజు, రూపల బంధం కూడా విడిపోయేలా చేస్తానని జీవన్ చెల్లితో అంటాడు.
శ్వేత, జీవన్ అక్కడికి వచ్చి వారికి కూడా షేర్ ఉండటంతో తాము కూడా ప్రశ్నిస్తారు. నోటీసులు రాలేదని చెప్తారు. ఎమ్మార్వో మాత్రం నోటీసులు డైలీ పంపామని చెప్తాడు. ఇక విరూపాక్షి రాజు, రూపలకు ధైర్యం చెప్తుంది. జీవన్ రాజుకి రెచ్చగొట్టేలా సీఎంని ఎదురించాలని తాడో పేడో తేల్చుకుందామని అంటాడు. రాజు మాత్రం ఆయనకు ఏదో తప్పుడు సమాధానం వల్ల ఇలా అయింటుందని అంటాడు. అది తప్పుడు సమాచారం అని మనం నిలదీస్తే ఆయన పరువు పోతుందని అంటాడు. విరూపాక్షి కూడా భర్తని నిలదీయాలనే అంటుంది. రాజు జీవనాధారం పోయింది అడుగుదామని అంటుంది. ఇక జీవన్ ముత్యాలుకు విషయం చెప్పి రెచ్చగొట్టాలని అంటాడు.
మరోవైపు హాస్పిటల్‌లో మందారం మందులు కోసం వెళ్తుంది. దీపక్ హారతి కోసం అపాయింట్ మెంట్ తీసుకుంటాడు. జీవన్ ముత్యాలుతో విషయం చెప్తాడు. ఇక శ్వేత వాళ్లు సీఎం ఆఫీస్‌కి వెళ్లి గొడవ చేస్తారు. సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తారు. ఇంటికి వెళ్లి అడుగుదామని రాజు అంటే విరూపాక్షి ఒప్పుకోదు. ఇంటికి వెళ్తే విజయాంబిక తప్పు తన మీద తిప్పేస్తుందని ఇక్కడే అడిగి తేల్చుకుందామని అంటుంది. కంపెనీ కూల్చే సీన్ అటు ముత్యాలు ఫ్యామిలీ ఇటు సూర్యప్రతాప్ ఫ్యామిలీ చూసి షాక్ అయిపోతారు. ఇక విజయాంబిక దీపక్కి కాల్ చేసి విషయం చెప్తుంది. ఆర్ ఆర్ కంపెనీ కూలిపోవడంతో అందరూ సూర్యప్రతాప్ దగ్గర గొడవ చేయడానికి వచ్చారని ఇప్పుడే రాఘవని చంపేయ్ మని అంటుంది. ఇక జీవన్ ముత్యాలును పూర్తిగా రెచ్చగొడతాడు. దాంతో ముత్యాలు సూర్య ప్రతాప్ మీద యుద్ధానికి బయల్దేరుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.