అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today September 27th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవినే సుమతి: మహాలక్ష్మీ.. రికార్డ్ విని షాకైన సీత, టీచర్ గుట్టు రట్టు ఖాయం!

Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవిక రౌడీ బ్లాక్‌ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం సీత టీచర్‌ గురించి ఆలోచించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవి గురించి తెలుసుకోవడానికి సీత ఆమెకు ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చి అందులో కాల్స్ రికార్డ్ అయ్యే ఆప్షన్ పెడుతుంది. అవన్నీ తర్వాత తాను వినేలా ఏర్పాటు చేసుకుంటుంది. విద్యాదేవి మొదట ఆ ఫోన్‌తో శివకృష్ణకు కాల్ చేసి మాట్లాడుతుంది. సీత చాటుగా వింటుంది. ఆ కాల్ ద్వారా తనకు ఏం అనుమానం రాలేదని సీత అనుకుంటుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

సీత: నిజాన్ని ఎలా అయినా తెలుసుకుంటాను ఇలా ప్రతీ రోజు టీచర్ మాట్లాడే మాటలు వింటాను. ఏదో ఒక రోజు నా అనుమానం నిజం అవ్వొచ్చు. అప్పటి వరకు కాల్ రికార్డుల గురించి ఎవరికీ తెలీకూడదు.

రాత్రి రామ్ గదిలో ఉంటే సీత పాలు తీసుకొని వస్తుంది. అందరికీ గిఫ్ట్‌లు ఇచ్చి ఇవ్వలేదని నేను అలిగానని రామ్ అంటాడు. దాంతో సీత అందరకీ ఇచ్చి నీకు ఇవ్వకుండా ఉంటానా అని బంగారం బ్రేస్‌లెట్ అందులో RS అనే అక్షరాలు రాయించి గిఫ్ట్ ఇస్తుంది. రామ్ చాలా సంతోషిస్తాడు. అంత ఖరీదైన గిఫ్ట్ అందరి ముందు ఇచ్చుంటే బాగుండేది అని రామ్ అంటాడు. బ్రేస్‌లెటే ఎందుకు ఇచ్చావ్ అని రామ్ అడిగితే మీ అమ్మ సుమతి మీ నాన్నకి ఇదే గిఫ్ట్ ఇచ్చిందని అది గుర్తొచ్చి నేను మీకు ఇచ్చానని అంటుంది. తానే రామ్ చేతికి బ్రేస్ లెట్ కడుతుంది. సీత రిటర్న్ గిఫ్ట్ అడిగితే రామ్ హగ్ చేసుకొని ముద్దు పెడతాడు.

ఉదయం మహాలక్ష్మీ, జనార్థన్‌లు పేపర్ చదువుతుంటారు. బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు. ఇక మూర్తి ఆఫీస్ నుంచి వచ్చి జనార్థన్ సంతకాలు కోసం వచ్చానని అంటాడు. మహాలక్ష్మీ సీతని పిలిచి కాఫీ అడుగుతుంది. జనార్థన్ సంతకాలు పెడతాడు. మూర్తి సుమతిని పొడుగుతుంది. మహాలక్ష్మీ రగిలిపోతుంది. సీత వచ్చి మీకు చిన్న ఉద్యోగం ఇచ్చిన సుమతి అత్తమ్మని పొడుగుతున్నారని కొంత మందికి జీవితం ఇచ్చినా సుమతిని తిడుతున్నారని మహాలక్ష్మీకి చురకలు పెడుతుంది. ఇక మహాలక్ష్మీ మూర్తితో ఇంకెప్పుడు సంతకాలు కోసం ఇంటికి రావొద్దని మేమే ఆఫీస్‌కి వస్తామని చెప్తుంది. 

విద్యాదేవి: ఏంటి మూర్తి గారు బాగున్నారా. మీ పిల్లలు బాగున్నారా ఇప్పుడేం చేస్తున్నారు. అమ్మాయి పెళ్లి చేసేశారా. ఆఫీస్‌లో బాగా పని చేస్తున్నారా ఇంకా పని టైంలో నిద్ర పోతున్నారా. 
మూర్తి: మీరు ఎవరమ్మా అచ్చం మా సుమతి మేడంలా మాట్లాడుతున్నారు. మీకు నేను తెలుసా. నేను మిమల్ని ఎప్పుడూ చూడలేదు. సుమతి మేడం నన్ను అలా ఆటపట్టించినట్లు మీకు ఎలా తెలుసు. మీరు ఎవరు మీకు మా సుమతి మేడంకి ఏంటి సంబంధం.
విద్యాదేవి: అయ్యో కంగారులో మాట్లాడేశానే.. ఇప్పుడెలా.. మీరు లింగ మూర్తి కాదా నాకు తెలిసిన ఒకాయన మీలా ఉంటే మాట్లాడేశాను.
మూర్తి: మీరు మాట్లాడుతుంటే అచ్చం మా సుమతి మేడం మాట్లాడినట్లే ఉంది.
విద్యాదేవి: ఆ సుమతి ఎవరో నాకు తెలీదు. ఆవిడకు నాకు ఏ సంబంధం లేదు.

మహాలక్ష్మీ: మాటలన్నీ విన్న మహాలక్ష్మీ అర్చనతో ఆ విద్యాదేవినే సుమతి అని నాకు కచ్చితంగా అనిపిస్తుందని విద్యాదేవి మాటలు గురించి చెప్తుంది. ఇక విద్యాదేవి సుమతి అని నిరూపిస్తానని ఓ రౌడీకి కాల్ చేసి తాను ఓ నెంబరు ఇస్తానని దానికి తాను చెప్పినట్లు మాట్లాడమని అంటుంది. మహాలక్ష్మీ చెప్పిన రౌడీ విద్యాదేవికి కాల్ చేసి మహా చెప్పినట్లు మాట్లాడుతాడు. అప్పుడే సీత అక్కడికి వస్తుంది. మీరు సుమతి అని నాకు తెలుసని రౌడీ అంటాడు. నువ్వు సుమతి అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటాడు.

రెండు లక్షల రూపాయలు తీసుకురమ్మని లేదంటే అందరి ముందు నా సాక్ష్యాలు చూపిస్తాను అని అంటాడు. విద్యాదేవి సరే వస్తానని అంటుంది. సీత అంతా చూసి షాక్ అయిపోతుంది. విద్యాదేవి డబ్బు బ్యాగ్‌లో వేసుకొని ఎవరూ చూడకుండా బయటకు వెళ్తే సీత టీచర్‌ని ఫాలో అవ్వాలి అనుకుంటుంది. ఇక అర్చన, మహాలక్ష్మీ హాలో ఉండి తానే సుమతి అని అందుకే టెన్షన్‌గా వెళ్తుందని అనుకుంటారు. టీచర్‌ని హాల్‌లో ఆపి మాట్లాడుతారు. ఇక రామ్ ఎదురైతే చిన్న పని ఉందని రామ్‌ని పంపేస్తుంది. మహాలక్ష్మీ, అర్చన కూడా వెళ్తారు. సీత టీచర్ ఫోన్ తీసుకొని కాల్ రికార్డ్ వింటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ, అర్జున్‌ల కొడుకే జున్ను.. డీఎన్ఏ పరీక్షకు ఒప్పుకున్న లక్ష్మీ, మిత్ర ఫైర్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Embed widget