అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today September 27th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ, అర్జున్‌ల కొడుకే జున్ను.. డీఎన్ఏ పరీక్షకు ఒప్పుకున్న లక్ష్మీ, మిత్ర ఫైర్! 

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode జున్ను మిత్రకు పుట్టలేదు అర్జున్‌కి పుట్టాడని మనీషా, దేవయాని అనడం లక్ష్మీ డీఎన్‌ఏ టెస్ట్‌కి ఓకే చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

 

భాస్కర్ పారిపోయాడని మనీషా దేవయానితో చెప్తుంది. ఇక మనీషా పుట్టిన రోజు దగ్గరకు వెళ్తుంది. అరవింద మనీషాకి పిల్లలకు కేక్ తినిపించమని అంటుంది. దాంతో మనీషా అర్జున్‌గారు ఫస్ట్ తినిపించాలని అంటుంది. ఇంతలో లక్ష్మీ అవును అర్జున్ గారు మీరు దూరంగా నిల్చొన్నారేంటి రండి పిల్లలకు కేక్ తినిపించండని అంటుంది.  

అర్జున్: అందరిదీ అయ్యాక తినిపిద్దామని ఆగాను.
మనీషా: చివరకు తినిపించాలని ఆగారా లేదా స్పెషల్‌గా తినిపించాలని ఆగారా. 
అర్జున్: వాట్ డూ యూ మీన్.
మనీషా:  చెప్పా ముందు కేక్ తినిపించండి. 
దేవయాని: పిల్లలు మీరు ఇక ఆడుకోండి. మీరంతా రండి డిన్నర్ చేద్దురు.
మనీషా: మిత్ర నువ్వు ఆగు. జున్నుకి కేక్ తినిపించావు. లక్ష్మీతో పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఫొటో కూడా దిగావు. ఇప్పుడు కేక్ కూడా తినిపించావ్ దానర్థం ఏంటి లక్ష్మీని భార్యగా ఒప్పుకొని జున్నుని కొడుకుగా ఒప్పుకున్నట్లేనా. 
అరవింద: ఇప్పుడు కొత్తగా అంగీకరించడం ఏంటి తను మిత్ర భార్యనే కదా.
మనీషా: మరి జున్ను. జున్ను మిత్ర కొడుకేనా అని అడుగుతున్నాను. 
అరవింద: జున్ను లక్ష్మీ కొడుకు అయితే మిత్రకి కొడుకే కదా.
మనీషా: కాదు అని నా అనుమానం. 
జయదేవ్: ఏం మాట్లాడుతున్నావ్ మనీషా.
మనీషా: ఎమోషనల్ అవ్వొద్దు అంకుల్ ప్రాక్టికల్‌గా ఆలోచించండి. మిత్ర, లక్ష్మీ విడిపోయి చాలా ఏళ్లు అయిపోయింది. వాళ్లిద్దరూ కలిసి ఉన్నది లేదు కలిసి కాపురం చేసింది లేదు. లక్ష్మీ ఇప్పుడు వచ్చి జున్ను మిత్ర బిడ్డ అనడం ఏంటి.
అరవింద: ఇప్పుడు నువ్వేమంటావ్ మనీషా.
మనీషా: మిత్ర, లక్ష్మీలకు జున్ను ఎప్పుడు పుట్టాడు ఆంటీ. అసలు జున్ను మిత్ర కొడుకేనా. 
జయదేవ్: మనీషా నోటికొచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదు.
దేవయాని: మనీషా అన్నదాంట్లో తప్పేముంది బావగారు. మిత్ర, లక్ష్మీలు కలిసి ఉన్నదే లేదు ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉన్నారు. లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు కూడా మిత్రతో సఖ్యతగా లేదు.  
అరవింద: లక్ష్మీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు తెలీదా మనీషా. మిత్రకు అన్నీ చెప్పమంటావా.
లక్ష్మీ: అత్తయ్యా.
అరవింద: లక్ష్మీ వాళ్లు నీ మీద నిందలు వేస్తున్నారు నీకు ఇంకా అర్థం కావడం లేదా. 
మనీషా: నిందలు కాదు ఆంటీ నిజం మాట్లాడుతున్నాను. జున్ను మిత్ర కొడుకు కాదు అన్నది నిజం. నీ కొడుకుగా ఒప్పుకోకు మిత్ర. 
జయదేవ్: వాళ్లు నీ భార్య మీద నిందలు వేస్తున్నారురా మీ బంధాన్ని అవమానిస్తున్నారు.
మిత్ర: అంతవరకు తెచ్చింది లక్ష్మీనే కదా. తాళిని ఎగతాళి చేసింది. నాకు అన్ని విధాలుగా నష్ట పరిచి బాధ పెట్టిన తను నాకు భార్య ఎలా అవుతుంది. తన కొడుకు నా కొడుకు ఎలా అవుతాడు. నాకు మరో వారసుడు అవసరం లేదు.
మనీషా: విన్నావు కదా లక్ష్మీ నిన్ను మిత్ర భార్యగా అంగీకరించడం లేదు. నీ కొడుకుని తను కొడుకులా అంగీకరించడం లేదు. ఇప్పుటికైనా నీ స్థానం తెలుసుకో.
అరవింద: మరి జున్ను ఎవరి కొడుకు.
మనీషా: అర్జున్ కొడుకు.  
అర్జున్: మనీషా జున్ను నా కొడుకేంటి. లక్ష్మీ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. తన మీద నిందలేస్తే ఊరుకోను.. 
దేవయాని: ఫ్రెండో లవరో లేక తాళి కట్టని భర్తో ఎవరికి తెలుసు మీ మధ్య జరిగింది మేం చూశామా. 
మనీషా: జున్ను మీకు పుట్టలేదా జున్ను మీ కొడుకు కాదా.
లక్ష్మీ: కాదు జున్ను నా కొడుకు నాకు మిత్రకు పుట్టిన కొడుకు ఈ నందన్ వారసుడు.
మనీషా: అందుకు సాక్ష్యం ఏంటి.
లక్ష్మీ: నేనే సాక్ష్యం.
దేవయాని: నువ్వు చెప్తే నిజం అయిపోతుందా. 
మనీషా: జున్ను మిత్రకు పుట్టాడని నిరూపించు జున్నుకి డీఎన్ఏ టెస్ట్  చేయించాలి. 

లక్ష్మీ దానికి ఒప్పుకోదని అరవింద అంటుంది. కానీ లక్ష్మీ మాత్రం డీఎన్ఏ టెస్ట్‌కి ఒప్పుకుంటుంది. అర్జున్‌తో పాటు ఎవరూ వద్దని లక్ష్మీ నిప్పు అని అంటారు. రేపే DNA టెస్ట్ అని రెడీగా ఉండమని మనీషా చెప్తుంది. మరోవైపు మిత్ర మనిసా మాటలు తలచుకొని ఆలోచిస్తుంటారు. మనీషా మిత్ర దగ్గరకు వచ్చి ఎందుకు మధ్యలో వచ్చేశావ్ అంటే నేను నీ మాటలన్ని సమర్దించలేమని అంటాడు. దాంతో మనీషా నీకు జున్ను కొడుకు అని నమ్ముతున్నావా అడుగుతుంది. ఇక మనీషా మిత్రకు డీఎన్ఏ టెస్ట్ గురించి చెప్తుంది. మిత్ర షాక్ అయిపోతాడు. ఆ టెస్ట్ నువ్వు అడిగావా నీకు ఏంటి అవసరం అని మనీషా మీద సీరియస్ అవుతాడు. మనీషా ఏడుస్తూ నటిస్తుంది. దాంతో మిత్ర నీకు నచ్చింది చేసుకో అనేసి వెళ్లిపోతాడు. లక్ష్మీ అర్జున్‌ని డ్రాప్ చేస్తూ ఏం అనుకోవద్దని అంటుంది. మనీషా వాళ్లు తనని ఇంటి నుంచి పంపాలని ఇలా చేస్తున్నారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: ఒళ్లంతా రక్తం.. తండ్రి చేతికి గన్ ఇచ్చి తనని చంపేయ్‌మన్న క్రిష్.. సత్య మీద ఫైర్!

టాప్ హెడ్ లైన్స్

Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 18th: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
నువ్వులేక నేను లేను: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
Podarillu Serial Today August 18th:పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
పొదరిల్లు: పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget