Priyanka Nalkari Wedding: అందుకే మలేషియా గుడిలో పెళ్లి చేసుకోవల్సి వచ్చింది - అసలు విషయం చెప్పిన ప్రియాంక నల్కారి
తెలుగులో పలు సినిమాలు, సీరియళ్లు, టీవీ షోస్‌లో కనిపించిన ప్రియాంక నల్కరీ పెళ్లి చేసుకుంది. మలేషియాలో సింపుల్‌గా పెళ్లి చేసుకోవడం వెనుక కారణాలు తెలిపింది.
తెలుగులో పలు టీవీ సీరియళ్లు, టీవీ షోస్‌లో నటించిన ప్రియాంక నల్కారి గురువారం (మార్చి 23న) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన వ్యక్తితో ఎలాంటి ఆడంబరం లేకుండా మలేషియాలోని మురుగన్ ఆలయంలో సింపుల్‌గా ప్రియాంక తాళి కట్టించుకుంది. #JustMarried అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసి అభిమానులకు షాకిచ్చింది. అయితే, ప్రియాంక తన కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక ఎట్టకేలకు.. అసలు విషయం చెప్పింది. తనది రహస్య వివాహం కాదని, పెద్దల అంగీకారంతోనే చేసుకున్నానని వెల్లడించింది.
2018లోనే ఎంగేజ్మెంట్
View this post on Instagram
ప్రియాంక పెళ్లి చేసుకున్న వ్యక్తి రాహుల్ వర్మ అనే ఓ వ్యాపారవేత్త అని తెలిసింది. ఇతడు కూడా తెలుగులో పలు సీరియల్స్‌లో నటించాడని, అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలిసింది. అయితే, వీరికి 2018లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. అదే సమయంలో ప్రియాంక టీవీ సీరియళ్లలో బిజీగా ఉండటంతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో రాహుల్ ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుని మలేషియా వెళ్లిపోయాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ప్రియాంక తన పెళ్లితో వదంతులకు పుల్‌స్టాప్ పెట్టింది. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన ప్రియాంక అసలు విషయం చెప్పింది. ‘‘రాహుల్, నేను.. మలేషియాలో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం. పాస్‌పోర్ట్ సమస్యల వల్ల కుటుంబ సభ్యులు రాలేకపోయారు. మా ఇంట్లోవారంతా చాలా హ్యాపీ. త్వరలోనే చిన్న పార్టీ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం రాహుల్ మలేషియాలో బిజీగా ఉన్నారు. ‘సీతారామన్’ సీరియల్ షెడ్యూల్ వల్ల నేను హైదరాబాద్‌కు వచ్చాను’’ అని తెలిపింది.
తెలుగులో ఫలించని ప్రయత్నాలు
View this post on Instagram
ప్రియాంక తెలుగులో కూడా పలు సీరియళ్లలో నటించింది. అయితే, తమిళనాడులో వచ్చినంత గుర్తింపు ఇక్కడ లభించలేదు. తెలుగులో ‘జబర్దస్త్’ గెటప్ శ్రీనుతో కలిసి ‘ఈటీవీ ప్లస్’లో ప్రసారమైన ‘సినిమా చూపిస్తా మామ’లో యాంకర్‌గా మెప్పించింది. అయితే, ఆ షో అంతగా క్లిక్ కాకపోవడంతో ప్రియాంకకు అవకాశాలు కూడా దక్కలేదు. చివరికి ఆమెకు తమిళ సీరియల్‌లో అవకాశం లభించింది. ‘రోజా’ (సన్ టీవీ) సీరియల్‌కు మంచి టీఆర్పీ లభించడంతో ప్రియాంకకు పాపులారిటీ సంపాదించింది. అలాగే జీ-తమిళ్‌లో ప్రసారమయ్యే ‘సీతారామన్’ సీరియల్‌లో కూడా నటిస్తోంది. దీంతో ఆమె తెలుగు షోస్, సీరియళ్లలో కనిపించడం లేదు. ప్రియాంక స్వస్థలం హైదరాబాద్. 2010లో విడుదలైన ‘అందరి బంధువయా’ మూవీలో నటిగా పరిచయమైంది. తమిళంలో ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లో నటించింది.
Read Also: బేబీ జాక్వెలిన్, నిన్నుచాలా మిస్ అవుతున్నా! జైలు నుంచి సుకేష్ మరో ప్రేమలేఖ!
View this post on Instagram
1