అన్వేషించండి

Gemini TV New Serial: ఇవాళ్టి నుంచి జెమినీ టీవీలో రెండు కొత్త సీరియళ్లు... పేర్లు, టెలికాస్ట్ టైమింగ్స్ తెలుసా?

జెమినీ టీవీ ఇవాళ్టి నుంచి రెండు కొత్త సీరియళ్లను టెలికాస్ట్ చేయడం మొదలు పెడుతోంది. ఆ రెండిటి పేర్లు ఏంటి? టెలికాస్ట్ టైమింగ్స్ ఏంటి? అనేది ఒక్కసారి చూడండి.

తెలుగు బుల్లితెర వీక్షకులకు ప్రతి రోజూ అనేక టీవీ సీరియళ్లను అందిస్తున్న టీవీ ఛానళ్లల్లో సన్ నెట్వర్క్ గ్రూప్ ఛానల్ జెమిని (Gemini TV) ఒకటి. జెమిని టీవీలో ఇప్పటికే పలు సీరియళ్లు టెలికాస్ట్ ఉన్నాయి. ఇవాళ్టి నుంచి రెండు కొత్త సీరియళ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. ఆ రెండు సీరియళ్ల పేర్లు ఏమిటి? అవి ఏయే సమయాల్లో టెలికాస్ట్ అవుతాయి? అనేది చూస్తే... 

రాత్రి 8.30 గంటలకు జెమిని టీవీలో 'రాధ'
Radha Telugu TV Serial On Gemini TV: ప్రతి చిన్నారికి బాల్యంలో అమ్మ ఎంతో ప్రేమతో తినిపించే గోరుముద్దలు, 'చందమామ రావే జాబిల్లి రావే' అంటూ పాడే జోల పాటలు ఎప్పటికీ మధుర స్మృతులు, తీపి జ్ఞాపకాలు. 

అటువంటి మధుర స్మృతులు, జ్ఞాపకాలు ఏవీ ఖుషికి ఉండవు. అయితే... అమ్మను, అమ్మ ప్రేమను పొందాలని ఆరాటపడే ఖుషికి రాధ ఎదురు పడుతుంది. ఆమె మనసును ఆమె ప్రేమ తాకుతుంది. అమ్మను తలపించింది. దాంతో తనకు రాధే అమ్మలా రావాలని పట్టు పడుతుంది ఖుషి. మరి, అప్పుడు రాధ ఏమని చెప్పింది? ఖుషికి అమ్మ కాగలిగిందా? లేదా? రాధ జీవితంలో ఏం జరుగుతుంది? ఆమె ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది? దైవం ఇచ్చిన బాధ్యతను ఎలా నిర్వర్తించింది? ఆమె జీవితం ఎలా సాగింది? అనేది తెలియాలంటే... జెమినీ టీవీలో ఈ నెల 30 (స్టెప్టెంబర్ 30) నుంచి టెలికాస్ట్ అయ్యే సరికొత్త డైలీ సీరియల్ 'రాధ' చూడాలి. 

సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 8:30 గంటలకు 'రాధ' టెలికాస్ట్ కానుందని 'జెమిని టీవీ' వర్గాలు చెప్పాయి. మరి, ఈ సీరియల్ వీక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుంది? అనేది చూడాలి.

Also Read: పదికి పైగా సినిమాలు... వెబ్ సిరీస్‌లకు లెక్క లేదు - ఈ వారంలో ఏ ఓటీటీలో ఏవేవి స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?


మూడు ముళ్ళు... రాత్రి 9 గంటలకు!
Moodu Mullu New Serials On Gemini TV: జెమినీ టీవీలో  ఈ నెల (సెప్టెంబర్) 30వ తేదీన మొదలైన మరో సీరియల్ 'మూడు ముళ్ళు'. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి తొమ్మిది గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది.

'మూడు ముళ్ళు' సీరియల్ కథకు వస్తే... పల్లెపాలెం అనే ఒక చిన్న ఊరిలో ఇద్దరు చెల్లెళ్లే తన ప్రపంచంగా బతుకుతుంటుంది నీలవేణి. ఒకవేళ ఎవరినైనా పెళ్లి చేసుకుంటే... మూడు ముళ్ళు వేసి, ఏడు అడుగులు నడిచి తన జీవితంలోకి ఓ మగతోడు వస్తే... తన చెల్లెళ్లు ఇద్దరి జీవితాలు ఏమైపోతాయో? అనుకుని అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకుంటుంది నీలవేణి. 

అటువంటి అమ్మాయి నీలవేణి జీవితంలోకి ఆమె ప్రమేయం లేకుండా ఓ వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడు ఆమె మెడలో మూడు ముళ్ళు వేస్తే? తనది కాని ప్రపంచంలో ఏడు అడుగులు వేసి నీలవేణికి అడుగడుగునా సమస్యలు ఎదురైతే, వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది? అనేది సీరియల్ చూసి తెలుసుకోవాలి.

Also Readథియేటర్లలోకి ఈ వారం సందడి - ఒక్క శుక్రవారమే 8 తెలుగు సినిమాలు, ఇంకా...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Vivo X200: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Vivo X200: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Crime News: కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Embed widget