Prema Entha Madhuram Serial January 9th: మాన్సీ వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అను.. అయోమయ స్థితిలో పిల్లలు!
Prema Entha Madhuram Serial Today Episode: రౌడీలు తమ కోసమే వెతుకుతున్నారని తెలుసుకున్న పిల్లలు ఆందోళన పడతారు. నెక్స్ట్ కారు ఆపినప్పుడు దిగిపోదాం అని పిల్లలు అనుకోవటంతో పిల్లలు రౌడీలకి దొరక్కుండా దిగిపోతారా, లేకపోతే వాళ్ళ చేతికి చిక్కుతారా అనే క్యూరియాసిటీ కథలో ఏర్పడుతుంది.
Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో రౌడీల కారు అని తెలియక వాళ్ల కారు డిక్కీలో దాక్కుంటారు పిల్లలు ఇద్దరు. రౌడీలు మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వస్తున్న ఆర్యని చూసి మనం ఇక్కడ ఉంటే డౌట్ వస్తుంది. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఆ తరువాత పిల్లలు కనిపించక ఏడుస్తున్న అనుని చూసి నవ్వుకుంటారు మాన్సీ,ఛాయాదేవి.
మాన్సీ: ఎవరైనా ఏడుస్తుంటే బాధనిపిస్తుంది కానీ అను ఏడుస్తుంటే మాత్రం తృప్తిగా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ ని ఏమంటారు అని వెటకారంగా ఉంటుంది.
ఛాయాదేవి : ఇగో సాటిస్ఫాక్షన్ అవ్వడం అంటారు దూరం నుంచి ఎంజాయ్ చేయటం ఎందుకు పదా వెళ్లి ఆమెను డిస్టర్బ్ చేసి మరింత ఎంజాయ్ చేద్దాం అనే కారు దిగి అను దగ్గరికి వెళ్ళబోతారు.
ఇంతలో జోగమ్మ అను దగ్గరికి వెళ్ళటం గమనించి ఆగిపోతారు. అను జోగమ్మతో తన గురించి ఏదో చెప్పుకోబోతుంది.
జోగమ్మ : దూరమైన నీ పిల్లల గురించే కదా బాధపడుతున్నావు, వాళ్లు అడిగిన కోరిక తీర్చు అప్పుడు నీ పిల్లలు నీకు దగ్గరవుతారు అని చెప్తుంది.
అను: అలా జరగకూడదు మేము ఆయనకి దగ్గర అయితే ఆయన ప్రాణానికి ప్రమాదం కదా అంటుంది.
జోగమ్మ : కళ్ళకి ఉన్న మాయాపొర ని తొలగించు, సంశయాన్ని వదిలిపెట్టు నేను చెప్పినట్లు చేయు నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది.
ఇదంతా వింటున్న మాన్సీ కోపంతో రగిలిపోతుంది నేను కష్టపడి అను మనసుని డిస్టర్బ్ చేస్తే మళ్లీ ఈ జోగమ్మ వాళ్ళిద్దర్నీ కలిపేలాగా ఉంది అంటుంది.
ఛాయాదేవి : అను ఒక నిర్ణయం తీసుకునే లోపు తన మనసుని డిస్టర్బ్ చేద్దాం పద అని చెప్పి అను దగ్గరికి వెళ్తారు. అను మనసు కస్టపెట్టేలాగా మాట్లాడతారు. పిల్లల గురించి ఆర్య గురించి కూడా తప్పుగా మాట్లాడుతారు.
అను : నా పిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదు, నేను నా భర్త దూరంగా ఉన్నాం కానీ మా మనసులు ఇప్పటికీ కలిసే ఉన్నాయి. భర్తల్ని వదిలేసిన మీలాంటి వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
అను మాటలకి కోపంతో రగిలిపోతారు మాన్సీ, ఛాయదేవి.
మరోవైపు సుబ్బు కంగారుగా అటు ఇటు తిరగడాన్ని చూస్తుంది పద్దు ఎందుకలా తిరుగుతున్నావు అని అడుగుతుంది.
సుబ్బు: రోజూ లంచ్ టైం లో వచ్చే పిల్లలు ఈరోజు రాలేదు. ఎందుకో వాళ్ళు తక్కువ టైంలోనే బాగా దగ్గర అయిపోయారు.
పద్దు: నాక్కూడా అలాగే ఉంది ఏదో పండగకి ఇంటికి వచ్చి కూతురు మనవళ్ళు తిరిగి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అని బాధగా అంటుంది.
అందరి ఇళ్ళకి పిల్లలు పండగలకు వచ్చి వెళ్ళిపోతుంటే బాధగా అనిపిస్తుంది మనకి అదృష్టం లేదు అని బాధపడతారు సుబ్బు దంపతులు.
మరోవైపు కారు దిగిన రౌడీలు షాప్ దగ్గరికి వెళ్లి వస్తారు. ఈ లోపు పిల్లలు దాహంగా ఉండటంతో కారులో ఉన్న వాటర్ తాగుతారు. ఇంతలో రౌడీలు డిక్కీ దగ్గరికి వచ్చి మాట్లాడుకోవడం వింటారు.
రౌడీ: ఈ పిల్లలు ఏంటి మనల్ని ఇంతలా తిప్పిస్తున్నారు. అన్ని చోట్ల వెతికాము ఎక్కడా దొరకలేదుఅని మరొక రౌడీతో అంటాడు.
ఈ మాటలు విన్న అక్కి, అమ్ము ఇద్దరూ షాక్ అవుతారు. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడతారు.
అక్కి : ఈ అంకుల్స్ బ్యాడ్ అంకుల్స్ లాగా ఉన్నారు వాళ్లు మనకోసమే వెతుకుతున్నట్లు ఉన్నారు దిగిపోదామా అంటుంది.
అభయ్ : వద్దు మనం ఇక్కడ ఉండటమే సేఫ్, మళ్లీ కారు ఎక్కడైనా ఆపుతారు కదా అప్పుడు దిగిపోదాం అంటాడు.
రౌడీలు కారు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: Jagadhatri Serial January 9th: నిషికకి ఘోర అవమానం.. సాక్ష్యాలు దొంగలించడానికి ప్లాన్ చేసిన వైజయంతి!
Also Read: Trinayani Serial Today Episode అనాథ అయిన గాయత్రీ పాప గత జన్మలో ఏం చేసిందని సుమన డమ్మక్కని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.!
Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్ : రాజ్ పై స్వీట్ రివెంజ్ తీర్చుకున్న కావ్య – కళ్యాణ్ ను మార్చిన అనామిక