Prema Entha Madhuram Serial Today September 26th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరి పెళ్లికి ముహూర్తం పెట్టించిన బాబాయ్ - పెళ్లి ఆపేందుకు అకి ప్రయత్నం.
Prema Entha Madhuram Today Episode: మీ అమ్మకు వేరే వాళ్లతో పెళ్లి దశమిలోపు అవుతుందని అది అమ్మ ఆజ్ఞ అని జోగమ్మ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Prema Entha Madhuram Serial Today September 26th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరి పెళ్లికి ముహూర్తం పెట్టించిన బాబాయ్ - పెళ్లి ఆపేందుకు అకి ప్రయత్నం. prema Entha Madhuram serial today episode September 26th written update Prema Entha Madhuram Serial Today September 26th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరి పెళ్లికి ముహూర్తం పెట్టించిన బాబాయ్ - పెళ్లి ఆపేందుకు అకి ప్రయత్నం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/26/d6a5422fe2a6fb014549071c3a3e5cf31727310091444879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prema Entha Madhuram Serial Today Episode: గౌరిని చూడటానికి రాకేష్ ఫ్రెండ్ వినయ్ ఎన్నారైలా వస్తాడు. వినయ్ ని చూసిన గౌరి వాళ్ల బాబాయ్ వినయ్ కు వెళ్లి స్వాగతం చెప్తాడు. వినయ్ ని బాబాయ్ కాళ్లు మొక్కమని పాండు చెప్పగానే ఆయన కాళ్లు మొక్కుతాడు. ఇదంతా పై నుంచి చూస్తున్న శంకర్ కు వినిపించేలా.. ఈ కాలంలో కూడా కాళ్లు మొక్కే అబ్బాయి. కొందరుంటారు పెద్దలు అని కూడా చూడకుండా భయపెడుతుంటారు అంటాడు. వినయ్ ను తీసుకుని లోపలికి వెళ్తాడు. మరోవైపు అకి జోగమ్మ దగ్గరే నిలబడి నువ్వు మా అమ్మా నాన్నలను కలిపే మార్గం చెప్పేవరకు ఇక్కడి నుంచి కదలను అంటూ ఏడుస్తుంది. జోగమ్మ లేచి వెళ్లిపోతుంటే..
అకి: జోగమ్మా నీకు నా బాధ ఎందుకు అర్థం కావడం లేదు. అవతల మా అమ్మకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఆ పెళ్లి జరిగితే మా అమ్మా నాన్నా ప్రేమ చనిపోయినట్టే అది జరగకూడదు.
జోగమ్మ: చెప్పాను కదా? అమ్మ ఆజ్ఞ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. అది నేను కాదు కదా? ఎవ్వరూ ఆపలేరు. దశమి, శుక్రవారం, సూర్యోదయ గడియల్లో అతడితో పాటుగా మీ అమ్మ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం. ఇది విధి లికితం.
అని చెప్పి జోగమ్మా వెళ్లిపోతుంది. దీంతో అలా జరగడానికి వీళ్లేదు అని అకి ఏడుస్తూ..రవిని హగ్ చేసుకుంటుంది. రవి, అకిని ఓదారుస్తుంటాడు. మరోవైపు గౌరి పెళ్లి చూపులకు రెడీ అవుతుంటుంది.
శ్రావణి: అక్కా అబ్బాయి చాలా బాగున్నాడు. నువ్వు కూడా ఏంజెల్ లా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. అబ్బాయి నిన్ను ఇలా చూస్తే ప్లాట్ అయిపోతాడు.
బాబాయ్: అమ్మా గౌరి రెడీ అయిపోయావా? అక్కను త్వరగా తీసుకురండమ్మా.. అవతల అబ్బాయి వచ్చేశాడు.
గౌరి: శంకర్ గారు వచ్చేశారా? బాబాయ్. నన్ను కాదన్న అతనికి నాకు అతని కంటే బెటర్ అబ్బాయి దొరికాడని తెలియాలి కదా?
బాబాయ్: నాకు తెలియక అడుగుతున్నాను అమ్మా ఈ పెళ్లి ఇష్టంతో చేసుకుంటున్నావా? లేక శంకర్ మీద కోపంతో చేసుకుంటున్నావా?
అని అడుగుతాడు. కానీ గౌరి అసలు పలకదు. తర్వాత గౌరిని తీసుకుని బయటకు వస్తారు శ్రావణి, సంధ్య. గౌరిని చూసిన వినయ్ ఎంత బాగుంది. రాకేష్ చెప్తే ఏదో డీల్ కోసం ఒప్పుకున్నాను. కానీ ఈ పిల్లను చూస్తుంటే ఇప్పుడే పెళ్లి చేసుకుని సొంతం చేసుకోవాలని ఉంది అని మనసులో అనుకుంటాడు వినయ్. శ్రావణి, సంధ్యలను చూసి వన్ ప్లస్ టూ ఆఫర్ లా ఉంది అనుకుంటాడు. తనకు గౌరి నచ్చింది అని చెప్తాడు. దీంతో పాండు, బాబాయ్ గౌరి అభిప్రాయం అడుగుతారు. గౌరి ఆలోచనలో పడిపోతుంది.
వినయ్: మీరు మీ చెల్లెల్ల గురించి ఏమీ ఆశించకండి. అంకుల్ అంతా చెప్పారు. మనతో పాటు వీళ్లను కూడా అమెరికా తీసుకెళదాం. మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో మంచి అబ్బాయిలను చూసి పెళ్లి కూడా మనమే చేద్దాం. ఇప్పటి వరకు వాళ్ల బాధ్యత మీది ఇక మీదట మనది. అది మీరు ఒప్పుకుంటే
గౌరి: నాకు ఇష్టమే..
పాండు: అబ్బాయికి అమ్మాయికి ఓకే ఆలస్యం అమృతం విషం అన్నారు. వెంటనే ముహూర్తాలు పెట్టేయండి. అబ్బాయి రెండు వారాలు సెలవు మీద వచ్చారు. అందుకే పది రోజుల్లో పెళ్లి అయిపోవాలి.
బాబాయ్: మరీ అంత హడావిడిగా అంటే
పాండు: అదృష్టం తలుపు తడుతుంటే మీరేంటండి ఆలోచిస్తారు.
వినయ్: మీరు ఉండండి. పెళ్లి ఏమీ ఘనంగా చేయక్కర్లేదు. సింపుల్ గా చేస్తే చాలు. నేను అసలే బెయిల్ మీద…
అంటూ ఆగిపోయి మళ్లీ నేను రెండు వారాలు మాత్రమే ఉంటాను అంటాడు. దీంతో శంకర్ షాక్ అవుతాడు. బాబాయ్ మాత్రం గౌరి ఏమంటావు అని అడుగుతాడు. నన్ను చూసి తక్కువ టైం లోనే బాగా అర్థం చేసుకున్నారు ముహూర్తం పెట్టించండి బాబాయ్ అంటుంది గౌరి. శంకర్, చిన్నొడు, పెద్దొడు ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడి చూస్తుంటారు. ఇంతలో పెళ్లి అయ్యే వరకు అబ్బాయి ఇక్కడే ఉంటారని పాండు చెప్పగానే బాబాయ్ అది పద్దతి కాదు కదా అంటాడు. శంకర్ కూడా ఆయన చెప్పేది నిజమే కదా? అంటాడు. దీంతో గౌరి, శంకర్ ను తిడుతుంది. ఇది మా ఫ్యామిలీ మాటర్ అని చెప్తుంది. తర్వాత రాకేష్, వినయ్, పాండు మందు తాగుతుంటారు. తనకు ఆ అమ్మాయి పిచ్చిగా నచిందని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)