Prema Entha Madhuram Serial Today September 17th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: అకికి పర్సనల్ అసిస్టెంట్ గా రవి – గౌరిని రాకేష్ దగ్గరకు పంపిన పాండు
Prema Entha Madhuram Today Episode: గౌరికి జాబ్ ఆశ చూపించి రాకేష్ దగ్గరకు వెళ్లేలా చేస్తాడు. పాండు అయితే శంకర్ అంతా గమనించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: గౌరిని కిడ్నాప్ చేసేందుకు వచ్చిన ఇంటి ఓనరును చూసి చూడనట్లు శంకర్ ఎవడో అడుక్కుతినేవాడు వచ్చాడు అని తన తమ్ముళ్లకు చెప్తాడు. అడుక్కునే వాళ్లు కూడా కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు అంటాడు. వాడికి ఏదో ఒకటి వేయండిరా అనగానే వచ్చింది ముష్టివాడు కాదన్నయ్య ఇంటి ఓనరు అని చెప్పగానే అయినా వాడికి వీడికి పెద్ద తేడా లేదులే అంటూ లోపలకి వెళ్లిపోతాడు. తర్వాత పాండు గౌరి దగ్గరకు వెళ్లి నాకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి కలువు నీ చెల్లెళ్లకు జాబ్ ఇస్తాడు అని చెప్పడంతో గౌరి సరే ఇప్పుడే వెళ్తాను అని వెళ్లిపోతుంది. నా ప్లాన్ సక్సెస్ అని పాండు హ్యాపీగా ఫీలవుతాడు. మరోవైపు తన కొడుకు రవిని తీసుకుని అకి ఇంటికి వెళ్లబోతుంది జ్యోతి.
జ్యోతి: ఇదిగో నాన్నా రవి జెండే సారు ముందు చాలా వినయంగా ఉండాలి. ఆయన ఏమి అడిగినా సరే నువ్వు ఓపిగ్గా సమాధానం చెప్పాలి. ముఖ్యంగా అకి పాపతో నువ్వు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. నేను చెప్పినట్టు నడుచుకోవాలి. సరేనా..?
రవి: సరే అమ్మా…
యాదగిరి: అమ్మా కొడుకులు ఇద్దరు ఎక్కడికో బయలుదేరారు. అయినా నువ్వేంటి వాణ్నేదో స్కూల్ లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నట్లు ఇలా ఉండాలి అలా ఉండాలి అని మంచి మాటలు చెప్పి మరీ తీసుకెళ్తున్నావు.
జ్యోతి: విషయం లేదు. విశేషం లేదు. మీకు నిన్ననే చెప్పాను కదా? జెండే సార్ దగ్గరకు వెళ్లి మనోడికి ఉద్యోగం అడుగుతానని.
యాదగిరి: అయినా నాకు ఒక మాట చెప్పాలి కదా? అయినా వీడికెవడు ఉద్యోగం ఇచ్చేది. జెండే సారు ఆవలిస్తే పేగులు లెక్కపెట్టేస్తాడు.
రవి: అమ్మ నాకు ఈ ఉద్యోగం రాదు. ఈయన ఇక్కడ దీవెనలు ఇచ్చేస్తున్నాడు. ఇక వెళ్లినా లాభం ఉండదు వదిలేయ్.
అనగానే జ్యోతి బలవంగా జెండే దగ్గరకు వెళ్తున్నాము అని చెప్పగానే యాదగిరి కూడా వాళ్లతో పాటు వెళ్తుంటాడు. ఇంతలో జోగమ్మ ఎదురు వస్తుంది. రవిని చూసి భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్తున్నావు. నువ్వే ఒకరి భవిష్యత్తు కాబోతున్నావు. పరుల మాట నమ్మావో నిన్ను నమ్ముకున్నవాళ్లు నీ జీవితంలోకి వచ్చిన వాళ్లు కష్టాల పాలు కావాల్సి వస్తుందని చెప్పి వెళ్లిపోతుంది.
జ్యోతి: ఏవండి.. ఏంటండి జోగమ్మ చెప్పింది. నాకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ నా మనసులో ఏదో కంగారుగా ఉంది.
యాదగిరి: ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది. మంచి మార్గంలో బుద్దిగా నడుచుకోమంది. చెడు స్నేహాలు చేయోద్దంది. గుర్తుంచుకుని మసలుకుంటే వాడికే మంచిది
అంటూ యాదగిరి చెప్పి పదండి పోదాం అని వెళ్లిపోతారు. మరోవైపు పాండు ఇంటి ముందు గౌరి కోసం ఎదురుచూస్తుంటాడు. గౌరి బయటకు రాగానే గేటు దగ్గరకు వెళ్లి ఆటో వాడికి సైగ చేస్తాడు. గౌరి ఆటో పిలుచుకుని వెళ్లిపోతుంది. పైనుంచి అంతా గమనిస్తున్న శంకర్, గౌరి ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకుని పాండును పిలిచి అడుగుతాడు. పాండు తనకు తెలియదు అంటాడు. తర్వాత పాండు, రాకేష్ ఫోన్ చేసి గౌరి వచ్చిందని చెప్తాడు. గౌరి రావడం శంకర్ చూశాడని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు.
మరోవైపు జ్యోతి, రవి, యాదగిరి వెళ్లి జెండేను కలుస్తారు. అక్కడే అకి, అభయ్ ఉంటారు. అకి, రవి ఇద్దరూ వరసకి బావామరదళ్లు అవుతారు. అని చెప్పగానే రాకేష్ షాక్ అవుతాడు. జ్యోతి రవికి జాబ్ కావాలని అడగ్గానే జెండే ఇప్పుడైతే ఏమీ లేవని చెప్తాడు. ఇంతలో రాకేష్. రవిని అకికి హెల్ప్ చేయడానికి అపాయింట్ చేస్తే బాగుంటుంది కదా అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: డార్జిలింగ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ టైం అస్సలు మిస్ అవ్వద్దు