అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today October 9th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: పెళ్లి ఆపేందుకు రంగంలోకి దిగిన శంకర్‌ – అమ్మకు నిజం చెప్తానన్న అకి

Prema Entha Madhuram  Today Episode:  జెండే మాటలతో కన్వీన్స్‌ అయిన శంకర్‌, గౌరి పెళ్లి ఆపేందుకు యాదగిరికి ప్లాన్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  రాకేష్‌, పాండుకు ఫోన్‌ చేసి ఏ అడ్డంకి లేకుండా పెళ్లి జరిగిపోవాలని వార్నింగ్‌ ఇస్తాడు. అలాగేనని ఫోన్‌ కట్‌ చేస్తాడు పాండు. మరోవైపు అకి, రవి శంకర్‌ ఇంటికి వస్తుంటారు. ఇంకోవైపు పాండు వెళ్లి శంకర్‌ వాళ్లను ఇంకా లేట్‌ ఏంటని అడుగుతాడు. యాదగిరి వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆగకుండా సామాన్లు వేసుకుని వెళ్లిపోతాడు శంకర్‌. పాండు ఇంటి గేటుకు టూలెట్‌ బోర్డు పెడతాడు. యాదగిరి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అకి వచ్చి నాన్నా ఎక్కడ అని అడగ్గానే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారమ్మా అని చెప్తాడు యాదగిరి. మేడం కూడా పెళ్లి మంటపానికి వెళ్లిపోయారు అని చెప్తాడు. అంటే ఇక అమ్మా నాన్నా కలవరా? అంటూ ఏడుస్తూ కూలబడిపోతుంది అకి. మరోవైపు అందరూ పెళ్లి మంటపానికి వెళ్లిపోతారు.

పాండు: రండమ్మా రండి.. ముహూర్తానికి టైం అవుతుంది. అమ్మా గౌరి నువ్వు పెళ్లి కూతురు గదిలోకి వెళ్లు. అమ్మా అక్కను తీసుకెళ్లండి. రేయ్‌ పెళ్లి కొడకా.. నువ్వు నీ గదిలోకి వెళ్లు ముహూర్తం టైంకు బయటకు రా..

వినయ్‌: థాంక్స్‌ అంకుల్‌ ఈ గ్యాప్‌లో ఒక దమ్ము కొట్టేసి వస్తా..

పాండు: నీ బొందరా.. నీ బొంద గుడిలో ఎవరైనా చూస్తే నీ దుమ్ము దులుపుతారు. దాంతో నీ పెళ్లి ఆగిపోతుంది. సత్యం ఎవరో సరైన టైంకి తుమ్మాడు. ఏమైనా కానీ అబ్బాయి నీ టైం చాలా బాగుంది. మీ అమ్మా నాన్నలుగా ఎవరిని సెట్‌ చేయాలని నేను టెన్షన్‌ పడుతుంటే వాళ్లలో వాళ్లే గొడవ పడి నీ పెళ్లిని ముందుకు జరిపారు.

వినయ్: మీరు చాలా తెలివైన వారండి.

పాండు: నా తెలివి ఇప్పుడేం చూశావురా? ముందు ముందు ఇంకా చూస్తావు.

నువ్వు లోపలికి వెళ్లు నేను హడావిడి చేసి పెళ్లి మరింత ముందే జరిపిస్తాను. ఇదిగో పంతులుగారు. రావాల్సిన సామాగ్రి అంతా వచ్చేసినట్టే కదా?

పంతులు: అన్ని ఉన్నాయి లేండి? ఇంతకీ మీరెవరు?

పాండు: నిన్ను ఈ పెళ్లి చూపులకు తీసుకెళ్లింది. ముహూర్తం పెట్టించింది. మంచి సంబావన ఇప్పించాను.

పంతులు: క్షమించాలి మిమ్మల్ని ఈ గెటప్‌ లో చూసి గుర్తు పట్టలేదు.

పాండు: అంత బాగుందా? ఈ గెటప్పు..

పంతులు: పంచెలో చించారు.

 అని పంతులు చెప్పగానే పాండు గాలిలో తేలిపోతాడు. ఇంతలో రాకేష్‌ ఫోన్‌ చేస్తాడు. పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అని అడుగుతాడు. అన్ని ఏర్పాట్లు రెడీ అయ్యాయి. ఇంకొద్ది సేపట్లో పెళ్లి జరిగిపోతుంది అని పాండు చెప్తాడు. మరోవైపు శంకర్‌ సామాన్లు వేసుకుని వెళ్లిపోతుంటాడు. ఎదురుగా జెండే వస్తాడు.

శంకర్‌: జెండే సార్‌ మీరేంటి నా దారికి అడ్డొచ్చారు.

జెండే: నిన్ను కరెక్టు దారిలో నడిపించడానికే నేను అడ్డొచ్చాను శంకర్‌. ఏంటి శంకర్‌ నువ్వు చేస్తున్న పని.  నమ్మిన వాళ్లకోసం ప్రాణాలైన అడ్డేసి నిలబడతావు అనుకున్నాను. ఇలా అర్దాంతరంగా వెళ్లిపోతావు అనుకోలేదు.

శంకర్: మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్‌.

జెండే: గౌరి పెళ్లి గురించి గౌరి ఒక మోసగాణ్ణి పెళ్లి చేసుకోబోతుంది అని తెలిసి కూడా తన జీవితాన్ని కాపాడకుండా నీదారి నువ్వు చూసుకుంటావా? ఇదేనా నువ్వు స్నేహానికి ఇచ్చే విలువ.

శంకర్‌: మీరు పొరబడుతున్నారు సార్‌. మా స్నేహానికి నేను విలవు గౌరవం ఎప్పుడూ ఇచ్చాను. కానీ ఆవిడే అది నిలబెట్టుకోలేదు.

అనగానే జెండే స్నేహం అంటే ఏంటో తెలుసా? అంటూ శంకర్‌ ను కన్వీన్స్‌ చేస్తాడు. నువ్వు తప్పా ఈ ప్రపంచంలో గౌరిని ఎవ్వరూ కాపాడలేరు అని జెండే చెప్పగానే ఈ టైంలో ఎలా సార్‌ అంటాడు శంకర్‌. దీంతో ఆలోచించు శంకర్ నువ్వు అనుకుంటే తప్పకుండా చేయగలవు అంటాడు జెండే. మరోవైపు పెళ్లి జరగుతున్న గుడి దగ్గరకు అకి వస్తుంది. ఈ పెళ్లి ఆపాలంటే తను ఎవరో తనకు తెలియాలి. నిజం చెప్పేస్తాను అంటుంది. అమ్మను నిజం చేస్తేస్తాను అంటూ లోపలికి వెళ్తుంటే ఇంతలో శంకర్‌ ఫోన్‌ చేస్తాడు. ఆ పెళ్లి జరగదు అంటూ యాదగిరి తన ప్లాన్‌ చెప్తాడు శంకర్‌. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘జగధాత్రి’ సీరియల్‌: కేదార్‌ మాల విరమించేందుకు నిషిక  ప్లాన్  – నిషిక ప్లాన్‌ ను ప్లాప్‌ చేసిన ధాత్రి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget