Prema Entha Madhuram Serial Today March 22nd: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: అనును అవమానించిన మీరా ఫ్రెండ్స్ - నీరజ్ స్ట్రాంగ్ వార్నింగ్
Prema Entha Madhuram Today Episode: మీరా ఫ్రెండ్స్ తో ఇంట్లో తాగుతూ డాన్సులు చేస్తుంటే అను వెళ్లి తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: అజయ్, మీరా, నీరజ్, అను అందరూ లోపలికి వెళ్లిపోయాక ఆర్య హాల్‌లో అలాగే నిలబడిచూస్తుంటాడు. శారదాదేవి ఏడుస్తూ ఉండిపోతుంది.
శారద: ఆర్య నా నిర్ణయం నీకు బాధ కలిగించిందా?
ఆర్య: నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావని నాకు తెలుసమ్మా అయినా అమ్మను మించిన నమ్మకం ఏముంటుందమ్మా..
అని చెప్పి ఆర్య పైకి వెళ్లిపోతాడు. శారదాదేవి ఏడుస్తూ అలాగే కూలబడిపోతుంది. కేశవ దగ్గరకు వెళ్లి అమ్మా ఆర్యకు మీరంటే ప్రాణం అని తెలుసు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ భవిష్యత్తులో పశ్చాతాప పడే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు రూంలోకి వెళ్లిన ఆర్య, శారదాదేవి గుడిలో అజయ్‌కు చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ బాధపడుతుంటాడు. ఇంతలో అను లోపలికి వస్తుంది.
అను: సార్ ప్లీజ్ బాధపడకండి సార్
ఆర్య: అమ్మ నిజమైతే నాన్న నమ్మకం అంటారు. నాకు మాత్రం నిజం, నమ్మకం, అమ్మనాన్న అన్నీ అమ్మే అను. ఇన్నేళ్ల నిజం నేను ఒక అబద్దం అంటేనే నమ్మలేకపోతున్నాను అను. అమ్మను అమ్మా అని పిలవాలంటే కూడా ఎవరో నా గొంతు పట్టి బలవంతంగా ఆపేసిసట్టుంది. అమ్మ నాకు దూరం అయినట్టు ఉంది అను.
అను: సార్ ఊరుకోండి.. అలా ఆలోచించకండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎప్పుడూ గొప్పది అంటారు. మీ మీద అంత ప్రేమ ఉండబట్టే కదా మీ కొసం అజయ్ తన కొడుకు అని తెలిసి కూడా ఎదురించింది.
అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా పిల్లలు వచ్చి నాన్నమ్మంటే ఇష్టం లేదని చెప్పడంతో పిల్లలను మోడీఫై చేస్తుంది అను. మరోవైపు మీరా ఫ్రెండ్స్ తో డ్రింకింగ్ పార్టీ చేసుకుంటుంది. ఫ్రెండ్స్ అందరూ వర్థన్ ఫ్యామిలీలో చేరిపోయావు నెక్ట్స్ ఏంటి అని అడుగుతారు. ఈ ఆస్థి మొత్తం చేజికించుకోవడం అని చెప్తుంది. తర్వాత డీజే సాంగ్స్ వేసుకుని డాన్సులు చేస్తూ తాగుతుంటారు. ఇంతలో అను వస్తుంది.
అను: మీరా మేడం ఏం చేస్తున్నారు. ఏం జరుగుతుందిక్క
మీరా: కనిపించడం లేదా? ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్నాం..
అను: మీరు చిల్ గా ఇక్కడ గోల చేయడానికి ఇది పబ్బో, క్లబ్బో కాదు. ఇల్లు, వర్థన్ కుంటుంబం. ఈ ఇంటికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వర్థన్ కుంటుంబం కోడలు అని చెప్పుకోవడం కాదు.
మీరా: ఏం చేయాలో ఏం చేయకూడదో ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. నీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. బీ యువర్స్ లిమిట్స్
అను: నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు మీరు మీ లిమిట్స్ లో ఉండటం తెలుసుకోండి. ముందు వీళ్లందర్నీ ఇక్కడి నుంచి పంపించేయండి.
అంటూ అను చెప్పడంతో మీరా ఫ్రెండ్స్ ఫీలవుతారు. మమ్మల్ని నీ ముందే ఇన్‌సల్ట్ చేస్తుంటే కామ్‌గా ఉన్నావేంటి మీరా అంటూ కోప్పడతారు. అసలు తనకు మన ముందు నిలబడే అర్హత ఉందా పూర్ బస్తీ గర్ల్ అంటూ తిడుతుంటే నీరజ్, ఆర్యవర్ధన్ వస్తారు. మీరా ఫ్రెండ్స్ ను అనుకు సారీ చెప్పమని నీరజ్, ఆర్య చెప్తారు. ఇంతలో అజయ్ వచ్చి ఎందుకు చెప్పాలి సారీ అని అడుగుతాడు. ఇంతలో నీరజ్ కోపంగా మర్యాదగా సారీ చెప్పండి అనడంతో మీరా ఫ్రెండ్స్ సారీ చెప్పి వెళ్లిపోతారు. నీరజ్ .. అజయ్, మీరాకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
మీరా: ఆర్యవర్థన్ గారి స్థానంలో నువ్వుండాలి. వర్థన్ కుటుంబ అధికారం మొత్తం నీ చేతుల్లో ఉండాలి.
అజయ్: ఐ నో మీరా అంతా నువ్వనుకున్నట్లే జరుగుతుంది. జరిపించడానికి మా అమ్మ ఉంది కదా? కొడుకు మీద ప్రేమ లేకపోయినా కన్నకొడుకు అనే సెంటిమెంట్ ఉంది కదా.. ఇంటి నుంచి ఆర్యవర్ధన్ ఫ్యామిలీని గెంటివేసి టోటల్ గ్రిప్ ను మన చేతుల్లోకి తీసుకోవడానికి
అని చెప్తుండగానే ఆనంది వస్తుంది. తనకు రూం బాగాలేదని ఇంట్లో ప్రీడమ్ కూడా లేదని.. అక్కి, అభయ్ నన్ను కొపంగా చూస్తున్నారు అంటూ చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఓం భీమ్ బుష్ రివ్యూ: బ్యాంగ్ బ్రోస్ మేజిక్ ఎలా ఉందంటే - శ్రీవిష్ణు సినిమా హిట్టా? ఫట్టా?