అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today March 19th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: కలిసిపోయిన తల్లికొడుకులు – ఒంటరైన ఆర్యవర్ధన్‌

Prema Entha Madhuram Today Episode: జలంధర్ గుడికి శారదాదేవిని కూడా తీసుకెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  అజయ్‌ని చూసి నువ్వు వసుంధరాదేవి కొడుకువి కాదు శారదాదేవి మొదటి కొడుకువి.. శారదాదేవి సూర్యవర్ధన్‌ రెండవ భార్య. ఆయనకు మొదటి భార్యకు పుట్టిన కొడుకు ఆర్యవర్ధన్‌, రెండో భార్య అయిన శారదాదేవికి పుట్టిన మొదటి కొడుకువి నువ్వే అని లక్ష్మీ నిజం చెప్పడంతో అజయ్ షాక్ అవుతాడు. అయితే ఆర్యవర్ధన్‌ స్థానంలో నేను ఉండాల్సింది అని బాధపడతాడు. దీంతో నీకు అంత అన్యాయం జరుగుతుంటే శారద ఎందుకు ఊరుకుందో నాకు అర్థం కావడం లేదు. దాని అతి మంచితనమే దానికి శత్రువు. అజయ్‌ నువ్వున్నా నీ హక్కును దక్కించుకో అంటుంది లక్ష్మీ.

జలంధర్‌: దక్కించుకుంటాడండి అజయ్‌ మేడం చెప్పింది అర్థం అయ్యింది కదా వర్ధన్‌ కుటుంబంలో నీ స్థానం ఏంటో తెలిసింది కదా? నీకు దక్కాల్సిన ప్రేమ గౌరవం అధికారం అన్నీ దక్కించుకోవాలి.

అజయ్‌: దక్కించుకుంటా? నా గతాన్ని ప్రశ్నిచిన అందరికీ నేను సమాధానం చెబుతా.. అన్నింటికంటే మించి మా అమ్మ ప్రేమని నేనే దక్కించుకోవాలి. మీరు నాకు చేసిన ఈ హెల్ప్‌ కు ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను.

 అనగానే ఇందులో నేను చేసిందేమీ లేదని నిజం ఎప్పటికైనా ఎవరిద్వారానైనా తెలియాల్సిందే కదా అది ఇవాళ నా ద్వారా తెలిసింది అటుంది లక్ష్మీ. ఇంతలో జలంధర్‌ శారదాదేవిని కూడా ఇక్కడికే తీసుకొస్తాను అని వెళ్ళి శారదాదేవిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తుంటాడు. సెక్యూరిటీ వచ్చి పెద్ద మేడం ను  ఎవరో కిడ్నాప్‌ చేశారని చెప్పడంతో అను ఆ కారు వెనకాల పరుగెడుతుంది. ఇంతలో ఆర్య వచ్చి అనును ఏమైందని అడుగుతే అత్తమ్మను జలంధర్‌ కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తున్నాడని చెప్పడంతో అను, ఆర్య కారును ఫాలో అవుతారు. శాదరాదేవిని గుడిలోకి తీసుకెళ్లిన జలంధర్‌, లక్ష్మీని చూపిస్తాడు. ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకుంటారు.

శారదాదేవి: లక్ష్మీ ఎన్ని ఏళ్లయిందే నిన్ను చూసి .. ఎలా ఉన్నావు లక్ష్మీ..

లక్ష్మీ: నేను చాలా బాగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు.

శారద: నేను బాగున్నాను. కానీ నువ్వు ఇండియా ఎప్పుడొచ్చావు.

లక్ష్మీ: రెండు వారాలైంది వచ్చాకా నిన్ను కాంటాక్ట్‌ చేయాలని ట్రై చేశాను. మేడం గారి నెంబర్‌ దొరికితే కదా  లక్కీగా వశిష్ట గారు కలిశారు. తన దగ్గరే నీ నెంబర్‌ తీసుకున్నాను. నిన్ను సర్‌ప్రైజ్‌గా కలవాలనుకునాను. అంతకంటే ముందు నీ కన్నకొడుకును కలిశాను.

శారద: అంటే నువ్వు ఆర్యని కలిశావా?

లక్ష్మీ: నేను నీ కన్నకొడుకు అజయ్‌ వర్ధన్‌ గురించి మాట్లాడుతున్నాను.

  అనగానే శారదాదేవి షాక్‌ అవుతుంది. నేనే తన కన్నతల్లిని అన్న విషయం చెప్పేశావా అని అడుగుతే చెప్పానని ఇది ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అనడంతో లేదు లక్ష్మీ ఇది ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నాను. అనడంతో పక్క నుంచి అజయ్‌ ఎందుకు తెలియకూడదు అమ్మా అని అడుగుతాడు. ఇంతలో ఆర్య, అను గుడిలోకి వస్తారు. అజయ్‌, శారదా, లక్ష్మీ మాట్లాడుకోవడం వింటారు. నీ కన్న బిడ్డకంటే పెంచిన బిడ్డే నీకు ఎక్కువయ్యాడా అని అజయ్‌ ప్రశ్నించడంతో శారదాదేవి ఏడుస్తూ ఉంటుంది. ఆర్య,అను షాక్‌ అవుతారు.

లక్ష్మీ: పిల్లలు లేరని చెప్పి భూపతి వర్థన్‌ గారికి అజయ్‌ని దత్తత ఇచ్చినంత మాత్రాన తనకి నీకు పేగు బంధం లేకుండా పోతుందా శారదా.  అసలు నువ్వు అజయ్‌ గురించి పట్టించుకోకుండా ఇన్ని రోజులు ఎలా  ఉండిపోయావు.

అజయ్‌: ఎందుకమ్మ ఇలా చేశావు. నేను పుట్టగానే నీ పొత్తిల్ల నుంచే దూరం చేశావు. పెంచిన అమ్మానాన్నలను పొగొట్టుకుని నేను ఒంటిరవాణ్ని అయినప్పుడన్నా నన్ను తిరిగి దగ్గరకు తీసుకోవాలని నీకు అనిపించలేదా?

అంటూ అజయ్‌ ఏడుస్తూ ప్రశ్నిస్తుంటే... శారదాదేవి ఏడుస్తుంది. దూరం నుంచి చూస్తున్న ఆర్య, అను కూడా ఏడుస్తుంటారు.

శారదాదేవి: నిన్ను దూరం చేసుకోవడం నా తప్పే.. ఏ తల్లైనా కన్నబిడ్డని గొప్ప గుణాలతో  విజేతగా చూడాలనుకుంటుంది. నేను కూడా నిన్ను అలాగే చూడాలనుకున్నాను. కానీ నువ్వు ఆ భూపతి పెంపకంలో అతని లాగే ఆస్థి అధికారం అనే వ్యామోహంతో పెరిగావు. కానీ నువ్వు ఆప్యాయత కోసం నా దగ్గరకు వచ్చి ఉంటే.. ఈ అమ్మ ఈ చేతులతో నిన్ను ప్రేమగా చేరదీసేది.

అంటూ నువ్వు ఆస్థికోసం ఆర్య మీద కుట్రలు చేశావు అందుకే నేను నిన్ను ఎలా దగ్గరకు తీసుకోగలను అనడంతో అజయ్‌ కూడా ఏడుస్తూ నువ్వే అన్నావు కదా నా పెంపకం సరిగ్గా లేదని మరి దారి తప్పిన కొడుకుని ఇప్పటికైనా క్షమించు అమ్మా అనగానే శారదాదేవి, అజయ్‌ని దగ్గరకు తీసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read:  'దిల్' రాజు సేఫ్ - ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ క్లోజ్, థియేట్రికల్ బ్యాలన్స్ అంతే!

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Embed widget