Prema Entha Madhuram Serial Today March 14th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: అజయ్ కి సపోర్టుగా సంతకాలు చేసిన బోర్డు మెంబర్స్ – కొత్త ప్లాన్ వేసిన ఆర్య
Prema Entha Madhuram Today Episode: అజయ్ వర్దన్ కు సపోర్టుగా బోర్డు మెంబర్స్ సంతకాలు చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: ఆర్య దగ్గరకు వెళ్లిన అను, శారదాదేవికి వీడియో కాల్ చేస్తుంది. దీంతో ఆర్య శారదాదేవితో పాటు పిల్లలతో మాట్లాడతాడు. ఆర్యను చూసిన పిల్లల ఏడుస్తూ ఎమోషన్ అవుతారు. ఇంటికి ఎప్పుడొస్తారని అడుగుతారు. అయితే రెండు రోజుల్లో వస్తానన్న ఆర్య పిల్లలకు అల్లరి చేయకుండా ఏడవకుండా ఉండాలని చెప్తాడు. ఆర్య కూడా ఎమోషన్ అవుతాడు. ఇంతలో అను ఫోన్ తీసుకుని పిల్లలకు జాగ్రత్తలు చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో కేశవ వస్తాడు.
కేశవ: ఆర్య.. అనును ఫాలో చేస్తూ నీ వరకు రావాలనుకున్నారంటే రేపు నువ్వు ఆఫీసుకు రాకుండా కచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు.
అను: అవును సార్ కంపెనీ దక్కించుకోవడం కోసం వాళ్లు ఎంత దూరం అయినా వెళ్తారనిపిస్తుంది.
ఆర్య: వాళ్ల ప్రయత్నాలను వాళ్లను చెయ్యనియ్ మనం చేయాల్సింది చేసి చూపిద్దాం.
మరోవైపు అజయ్ ఆఫీసుకు బయలుదేరుతుంటే మీరా వస్తుంది.
మీరా: ఆర్యవర్ధన్ ను తక్కువ అంచనా వేయటానికి లేదు అజయ్. మీటింగ్ టైంకి ఎలాగైనా ఆఫీసుకు రీచ్ అవుతారు.
అజయ్: నో వే దేర్
మీరా: ఏ వే లేనిచోటే ఆర్యవర్ధన్ గారు తన ఓన్ వేను క్రియేట్ చేసుకుంటారు.
అజయ్: ఆ చాన్స్ ఇవ్వను
అంటూ కిరాయి రౌడీలకు ఫోన్ చేసి ఆర్యవర్ధన్ ఆఫీసుకు వచ్చే అన్ని దారులు బ్లాక్ చేయండి. ఏం చేసైనా వాణ్ని ఆఫీసుకు రాకుండా చేయండి అని చెప్తాడు. తర్వాత అజయ్, మీరా, బోర్డు మెంబర్స్ మీటింగ్ హాల్‌లో వెయిట్ చేస్తుంటారు. తనకు అనుకూలంగా లేని వాళ్లకు అజయ్ ఇన్‌డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు. నాకు సపోర్ట్ చేయకపోతే మీ పరిస్థితి ఎంటో అర్థం చేసుకోండి అంటాడు. మీరా కూడా ఆర్య వస్తాడు మీకు సపోర్టుగా ఉంటాడని అనుకుంటున్నారా? అయన ఇక్కడకి రారు.. రావడం ఇంపాజిబుల్ అంటూ వార్నింగ్ ఇస్తూ.. అజయ్ వర్ధన్ ను చైర్మన్ గా ఒప్పుకుంటున్నట్లు సంతకాలు చేయండి అంటూ చెప్తుంది. దీంతో బోర్డు మెంబర్స్ ఒక్కొక్కరుగా సంతకాలు చేస్తుంటారు. మరోవైపు ఆర్య వస్తున్న రోడ్లన్నీ అజయ్ మనుషులు బ్లాక్ చేస్తారు. దీంతో ఆర్య కారు దిగి నడుచుకుంటూ వెళ్లిపోతాడు. ఇంతలో అటెండర్ వచ్చి ఆర్య సార్ వచ్చారు అని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు.
నీరజ్: మా దాదా టైమ్ ను టైమింగ్‌ను ఎవ్వరూ చేంజ్ చెయ్యలేరు.
ఆర్య: ప్లీజ్ బీ సీటెడ్ హాయ్ అజయ్, హలో మీరా ఏంటి నా కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేసినట్టుంది. సంతకాలు కూడా చేసేశారా?
నీరజ్: దాదా మీరు వస్తారని తెలియక యునానమస్‌గా చైర్మన్ అయిపోదామనుకున్నారు. అది అసాధ్యమని తెలియదు కదా పాపం.
మీరా: మీ దాదా వచ్చినంత మాత్రాన ఇక్కడేం అద్భుతం జరిగిపోదు. బోర్డు మెంబర్స్ అందరూ మాకే సపోర్టుగా ఉన్నారు. కమాన్ చెప్పండి.
బోర్డు మెంబర్: అంటే సార్ అది మీ హెల్త్ కండిషన్ చూసి.. మీరు చైర్మన్‌గా రిజైన్ చేయడంతో బెస్ట్ ఆప్షన్ కోసం
అర్య: మనకు అనీ ఆప్షన్స్ ఫేవర్‌గానే కనిపిస్తాయి. మిస్టర్ మదుకర్. సుధాకర్ గారు మనలో ఎంత మంచితనం ఉన్నా ఒక్కోసారి మనలోని భయం బలహీనతలు మనల్ని కట్టిపడేస్తాయి. మీ అబ్బాయి టూర్ నుంచి సేఫ్ గా ఇంటికి వచ్చేస్తాడు. డోంట్ వర్రీ
అజయ్: నైస్ నేను విన్నదానికంటే కూడా మించిన జీనియస్ నువ్వు మిస్టర్ ఆర్యవర్దన్. బట్ నీకు సపోర్టుగా ఉన్న బోర్డు మెంబర్స్ షేర్స్ కంటే నాకు సపోర్టుగా ఉన్న బోర్డు మెంబర్స్ షేర్సే ఎక్కువ.
అంటూ చైర్మన్‌కు అవ్వడానికి నేను మాత్రమే అర్హుడిని అంటాడు. మరోవైపు అను శర్మ గారిని తీసుకుని ఆఫీసుకు వస్తుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: రజాకార్ ప్రీరిలీజ్ లో MLA రాకేశ్ రెడ్డి, నారాయణమూర్తి వాగ్వాదం