Prema Entha Madhuram Serial Today December 28th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: రంగంలోకి దిగిన మాయ – ఆలోచనలో పడిపోయిన శంకర్
Prema Entha Madhuram Today Episode: కథ సుఖాంతం అయిందనుకున్న టైంలో రివేంజ్ కోసం మాయ రావడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: శంకర్‌కు తన రహాస్యాలు చెప్పాడని ఓనరును టార్చర్ చేస్తుంటాడు రాకేష్. గన్ తీసుకుని చంపేయనా..? అంటూ భయపెడుతుంటాడు. ఇంతలో లాయర్‌కు ఎవరో ఫోన్ చేసి శంకర్, గౌరిని కాపాడేశాడంట అని చెప్పగానే రాకేష్ కోపంగా వాడు కాపాడేస్తాడని ఎందుకంటే వాళ్లు అనురాధ, ఆర్యవర్థన్ లు వాళ్ల ప్రేమకు చావు ఉండదు అందుకే వాళ్లనే చంపేస్తా.. అంటాడు. దీంతో లాయర్ వాళ్లు సైన్ పెట్టిన పేపర్స్ నీకు ఆయుధం లాంటివి ఆ పేపర్స్ అడ్డుపెట్టుకుని నువ్వు జలంధర్ కొడుకుగా వాళ్లను టార్చర్ చేయోచ్చు అని చెప్తాడు. అవునని రాకేష్ అంటాడు. మరోవైపు సంధ్య, శ్రావణి అకి వాళ్ల ఇంటికి వస్తారు. ఆ వెనకాలే చిన్నొడు, పెద్దొడు వస్తారు.
చిన్నొడు: సంధ్య ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి సంధ్య..
సంధ్య: ఏంటో త్వరగా చెప్పు.. నేను మా అక్కను చూడాలి..
చిన్నొడు: అంటే సమస్యలన్నీ తీరిపోయాయి. గౌరి గారు కూడా సేఫ్‌గా తిరిగి వచ్చారు. అందుకే మన ప్రేమ విషయం మా అన్నయ్యతో చెబుదాం అనుకుంటున్న..
సంధ్య: కొంచెమైనా బుద్ది ఉందా నీకు.. మా అక్క ప్రమాదం నుంచి ఇప్పుడే బయట పడింది. మేమంతా సంతోషంగా ఉన్నాం. ఈ టైములో ఇదంతా అవసరమా..?
శ్రావణి: ఏంటో ఎందుకు అతని మీద అంత సీరియస్ అవుతున్నావు. ఎమంటున్నాడు.
సంధ్య: పెళ్లి కావాలంట పెళ్లి
శ్రావణి: ఏంటి పెళ్లా.. నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడా..?
చిన్నొడు: అయ్యో అలా కాదండి. అందరం కలిసిపోయాం కదా..?
అని చిన్నొడు చెప్తుంటే.. సంధ్య, శ్రావణి తిడతారు. మరోవైపు ఇంట్లో గౌరికి జ్యూస్ ఇచ్చి అకి ఎమోషనల్ అవుతుంది. ఇంతలో శంకర్ వస్తాడు. గౌరిని వెటకారంగా మాట్లాడతాడు. శ్రావణి, సంధ్య లోపలికి వచ్చి గౌరిని చూసి ఏడుస్తారు.
గౌరి: అన్ని రుణబంధాలే ఉండవు సార్ కొన్ని ప్రేమ బంధాలు కూడా ఉంటాయి.
శంకర్: అబ్బా అలా పిలవకండి ఏదోలా ఉంది.
గౌరి: మీకు నచ్చినా నచ్చకపోయినా సార్ అనే పిలుస్తాను.
శ్రావణి: చూశారా మీరంటే మా అక్కకు ఎంత రెస్పెక్టో..
సంధ్య: అది మా అక్క సంస్కారం అండి.
శంకర్: ఒకరిని ఒకరు ఎంత వేనకేసుకుంటున్నారో.. అసలు మీ సిస్టర్స్ ను ఎవరు చేసుకుంటారో ఆ త్రిమూర్తులు ఎవరుంటారో వాళ్లకు బాగా రాసి పెట్టి ఉండాలి. మీతో వేగడానికి
పెద్దొడు: ఊరుకో అన్నయ్యా నువ్వు మరీ త్రిమూర్తులతో పోల్చకు.
చిన్నొడు: అయినా ఇష్టమైన వాళ్లను ఎంత కష్టమైన భరించొచ్చు అన్నయ్యా
శంకర్: అరేయ్ ఏమైందిరా మీకు నేను వాళ్లకు కాబాయే భర్తల గురించి మాట్లాడుతుంటే మీరెందుకురా మెలికలు తిరుగుతున్నారు.
గౌరి: సరే మీకు ట్రైనింగ్ అయిపోయినట్టే కదా..? అయితే వెంటనే మీరు హాస్టల్‌కు సిఫ్ట్ అయిపోండి.
అని చెప్పగానే.. చిన్నొడు, పెద్దొడు కంగారుగా వద్దని అంటారు. వాళ్లు హాస్టల్‌కు వెళితే మీకేంట్రా ఇబ్బంది అంటాడు. ఇంతలో అభయ్ నిన్నటి వరకు గౌరి గారి కోసం వెతికాము ఇప్పుడేమో గొడవ పడుతున్నారు. అనగానే రోజుకు ఒక్కసారైనా ఈవిడతో గొడవ పడకపోతే ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు చూడు టిఫిన్ కూడా తినకుండా గొడవ పడ్డానా..? కడుపు నిండిపోయింది. అని చెప్తాడు. ఇంతలో జెండే, యాదగిరి వచ్చి శంకర్‌ను నీతో మాట్లాడాలి అని బయటకు తీసుకెళ్తారు. అందరూ కంగారు పడుతుంటారు. రాకేష్ చెల్లెలు ఇండియాకు వస్తుందని తను జలంధర్ కంటే రాకేష్ కంటే డేంజర్ అని చెప్తాడు. కుట్రలు చేయడంలో తను మహా డేంజర్ అని చెప్పగానే శంకర్ ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు రాకేష్ కూడా తన చెల్లి వస్తుందని టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో కారు దిగి ఇంట్లోకి వస్తుంది మాయ. రాగానే రాకేష్‌ను కొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!