![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Prema Entha Madhuram Serial Today August 29th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: కిడ్నాపర్లను పట్టుకోవడానికి శంకర్ ప్లాన్ - రాకేష్ ముందే కిడ్నాపర్లను ఉరి తీయాలన్న అభయ్
Prema Entha Madhuram Today Episode: కిడ్నాపర్లను పట్టుకోవడానికి శంకర్, జెండేతో కలిసి ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలాఆసక్తికరంగా జరిగింది.
![Prema Entha Madhuram Serial Today August 29th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: కిడ్నాపర్లను పట్టుకోవడానికి శంకర్ ప్లాన్ - రాకేష్ ముందే కిడ్నాపర్లను ఉరి తీయాలన్న అభయ్ prema Entha Madhuram serial today episode August 29th written update Prema Entha Madhuram Serial Today August 29th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: కిడ్నాపర్లను పట్టుకోవడానికి శంకర్ ప్లాన్ - రాకేష్ ముందే కిడ్నాపర్లను ఉరి తీయాలన్న అభయ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/5ae3ca19bb1c6fb6f4215f1cc94adf051724896104569879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prema Entha Madhuram Serial Today Episode: స్టేషన్ కు వచ్చిన శంకర్ ను గౌరి హగ్ చేసుకుంటుంది. దీంతో శంకర్ షాక్ అవుతాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఎస్సై దగ్గరకు వెళ్తారు. తాను కూడా కిడ్నాపర్లను వెతుకుతామని శంకర్ ఎస్సైకి చెప్పి అందుకు సంబంధించిన ఫైల్ తీసుకుని వెళ్లిపోతాడు. మరోవైపు శ్రావణి ఏడుస్తుంటే పెద్దొడు, చిన్నోడు ఓదారుస్తుంటాడు. ఇంతలో యాదగిరి వస్తాడు. ఏం జరిగిందని అడుగుతాడు. పెద్దొడు జరిగిన విషయం మొత్తం చెప్తాడు. దీంతో యాదగిరి కూడా శ్రావణిని ఓదార్చి జెండేకు ఫోన్ చేసి కిడ్నాప్ గురించి చెప్తాడు. జెండే షాక్ అవుతాడు. నేను కూడా ఆ గ్యాంగ్ అరాచకాల గురించి తెలుసుకున్నాను. నువ్వు అక్కడే ఉండి వాళ్లకు ధైర్యం చెప్పు యాదగిరి నేను డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడతాను. అని చెప్తాడు జెండే. మరోవైపు రాకేష్ సిటీ బ్లూ ప్రింట్ తీసుకుని అమ్మాయిల్ని ఎలా తీసుకెళ్లాలో చెప్తుంటాడు.
రాకేష్: ఇది మీరు ఎస్కేప్ అవడానికి బెస్ట్ రూట్. కిడ్నాప్ ఇష్యూ స్ప్రెడ్ అవడం వల్ల అన్ని రూట్లలో పోలీస్ నిఘా ఉంటుంది. అంతే కాదు మీరు ఈ రోజు రాత్రికే అమ్మాయిల్ని సిటీ దాటిస్తారని గెస్ చేసి ఉండొచ్చు. ఇంత గోలలో మీరు తప్పించుకోవాలంటే ఒకే ఒక ఐడియా ఉంది.
జగ్గుభాయ్: ఏంటది త్వరగా చెప్పు రాకేష్.
రాకేష్: ట్రాన్స్ ఫోర్ట్ వెహికిల్స్.
జగ్గుభాయ్: ట్రాన్స్ ఫోర్ట్ వెహికిల్సా..?
రాకేష్: అవును లోకల్ ట్రాన్స్ ఫోర్ట్ వెహికిల్ ఒకటి మాట్లాడుకుని ఏం ట్రాన్స్ ఫోర్ట్ చేయాలని అడిగితే పర్నీచర్ ఇక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్లాలలని చెప్పండి. అవి రెగ్యులర్‌గా అరూట్లలో తిరిగే వెహికిల్స్ కాబట్టి పోలీసులు పట్టించుకోరు.
జగ్గుభాయ్: అరేయ్ విన్నారుగా ఒక వెహికిల్ ని బుక్ చేయండి.
రాకేష్: ఏ వెహికిల్ బుక్ చేయాలో నేనే చెప్తాను.
అని రాకేష్, శంకర్ వెహికిల్ బుక్ చేయండని రౌడీలకు చెప్తాడు. శంకర్ చెల్లి కిడ్నాప్ అయి ఆ గౌరి, కిడ్నాప్ కేసులో ఇరుక్కుని నువ్వు నా దారికి అడ్డు రాకుండా కావాలి. అని మనసులో అనుకుంటాడు రాకేష్. మరోవైపు శ్రావణి ఏడుస్తుంది. ఇంతలో ఇంటికి గౌరి, శంకర్ లు వస్తారు. సంధ్య ఎక్కడఅని శ్రావణి అడుగుతుంది. చిన్నొడు కూడా అన్నయ్య తనకు ఏం కాదు కదా అంటాడు.
శంకర్: ఏమో తెలియదురా? సంధ్యతో పాటు ఇంకా చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. పోలీస్ డిపార్ట్ మెంట్ మొత్తం వాళ్లను వెతికే పనిలో ఉంది.
శ్రావణి: అయ్యోతప్పంతా నాదే అది వెళ్లను అంటున్నా.. నేనే బలవంతం చేసి షాపుకు పంపించాను.
అని ఏడుస్తేంటే శంకర్ ఏడవద్దని లోపలికి వెళ్లమని చెప్తాడు. తర్వాత తన తమ్ముళ్లతో కిడ్నాప్ గురించి మాట్లాడుతుంటాడు. ఇంతలోశీను వచ్చి పెద్ద శంకర్‌ను వెహికిల్ ఇవ్వమని వైజాగ్ పోవాలని పర్నీచర్ తీసుకెళ్లాలట అని చెప్పి వెహికిల్ తీసుకుని వెళ్తాడు. మరోవైపు జెండే.. సంధ్య కిడ్నాప్ గురించి అభయ్, అకిలకు చెప్తాడు. పక్కనే ఉన్న రాకేష్ అనుమానంగా చూస్తుంటాడు. ఇంతలో అకి బాధగా అమ్మ ఎంత బాధపడుతుందో అని వెంటనే అదే ఆ అమ్మాయి వాళ్ల అమ్మ ఎంత బాధపడుతుందో అంటుంది.
జెండే నేను వెళ్తున్నాను. అనగానే అకి కూడా నేను వస్తాను అనగానే అభయ్ వద్దంటాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. తర్వాత జెండే, అకి వెళ్లిపోతారు. అభయ్ కిడ్నాపర్ల ను తిడుతాడు. అటువంటి వాళ్లను పట్టుకుని ఉరి తీయాలి అంటాడు. దీంతో రాకేష్ బయపడతాడు. నా మీద అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి అని మనసులో అనుకుంటాడు. తర్వాత శంకర్, జెండే కిడ్నాపర్లను ఎలా పట్టుకోవాలో ప్లాన్ చేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: అసలైన రంగాను చూసిన శైలేంద్ర – జగతి లెటర్ గురించి ఆరా తీసిన మహేంద్ర
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)