అన్వేషించండి

Guppedanta Manasu Serial Today August 28th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: అసలైన రంగాను చూసిన శైలేంద్ర – జగతి లెటర్ గురించి ఆరా తీసిన మహేంద్ర

Guppedanta Manasu Today Episode: చక్రపాణి ఇంటికి వెళ్లి అసలైన రంగాను శైలేంద్ర చూడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode:  తాను రంగా కాదని రిషినే అని రాధమ్మకు చెప్తాడు రిషి. నేను మీ మనవడిని కాదు. వసుధార భర్త రిషిని అంటాడు. దీంతో రాధమ్మ, సరోజ షాక్‌ అవుతారు. ఇంతలో తేరుకున్న సరోజ   లేదు బావ నువ్వు అబద్ధం చెబుతున్నావు అంటుంది. నిన్ను వీళ్లేదో మాయ చేసినట్లున్నారు అంటుంది. రాధమ్మ కూడా వసుధారను  నిన్ను నా సొంత బిడ్డలా చూసుకున్నాను . కానీ సరోజ ముందు నుంచి చెప్పిందే నువ్వు నిజం చేసేలా ఉన్నావు అంటుంది.

వసుధార: బామ్మా ఒక్కసారి రిషి సార్ చెప్పేది  వినండి

రిషి: నేను మీ రంగాను కాదు నాన్నమ్మ.

రాధమ్మ:  అయితే ఇన్నాళ్లు మా దగ్గర రంగాగా ఎందుకు ఉన్నావ్. మా రంగా ఎక్కడ?

రిషి: నాతో రండి నిజమైన రంగాను చూపిస్తాను.

రాధమ్మ: ఎక్కడికి రావాలి నాన్నా. నువ్వే మా రంగావి

రిషి: అయ్యో నానమ్మా నాతో రండి. అప్పుడు కూడా మీకు నేను మీ రంగానే అనిపిస్తే మీతోనే ఉంటాను.

 అని రిషి చెప్పడంతో రాధమ్మ సరే అంటుంది. బయటకు వెళ్లిన సరోజ, శైలేంద్రకు కాల్‌ చేస్తుంది. నువ్వు వసుధార ఒక్కటేనని ఇద్దరూ కలిసి మా బావను మార్చేశారని మీలాంటి వాళ్లను నేను ఎక్కడ చూడలేదని తిడుతుంది.

శైలేంద్ర: ఎహే.. ఏదేదో వాగకు. సరిగా చెప్పు

సరోజ: వసుధార రిషి సార్ రిషి సార్ అంది. నువ్వు డబ్బులిచ్చి రిషిలా మార్చావు. మీ ఇద్దరు ఒక్కటే

శైలేంద్ర: మేము ఇద్దరం ఒక్కటికాదు సరోజ

సరోజ: మీ ప్లాన్ నాకు అర్థమైంది. ఇప్పుడు మా బావ అసలైన రంగాను చూపిస్తాడట. మా ఇద్దరిని అక్కడికే తీసుకెళ్తాడట.

అని సరోజ చెప్పగానే శైలేంద్ర షాక్ అవుతాడు. వెంటనే మిమ్మల్ని మీ బావ ఎక్కడికి తీసుకెళ్తాడో ఆ లోకేషన్‌ నాకు పెట్టు నేను వస్తాను అని శైలేంద్ర చెప్పడంతో సరే నువ్వు రా నీ పని చెప్తాను అని సరోజ ఫోన్‌ కట్‌ చేస్తుంది. సరోజ మాటలకు శైలేంద్ర భయపడిపోతుంటాడు. ముందు వాడు రంగానా, రిషినా క్లారిటీ రావాలంటే సరోజ పెట్టే లొకేషన్‌ కు వెళ్లాలి అనుకుంటాడు శైలేంద్ర. రాధమ్మ, సరోజను రిషి తీసుకెళ్లిపోతాడు. ఏంటమ్మా ఇది అని మహేంద్ర అడిగితే.. వసుధార జరిగిందా మహేంద్రకు చెప్తుంది.  వసుధార ఇంటికి రాధమ్మ వాళ్లను తీసుకెళ్తాడు రిషి. రంగాను వసుధార తండ్రి తీసుకొస్తాడు. అదంతా కిటికి నుంచి చాటుగా శైలేంద్ర గమనిస్తుంటాడు. నానమ్మ అంటూ అసలు రంగా రాధమ్మ దగ్గరకు వెళ్లి   హగ్ చేసుకుంటాడు.

రంగ: ఎలా ఉన్నావు నాన్నమ్మ... ఏంటీ ముసలి అలా నోరెళ్లిబెట్టి చూస్తున్నావు. ముందే వద్దామనుకున్నానే. కానీ, ఇలా జరగడంతో ఆగాల్సి వచ్చింది.

రాధమ్మ: ఏం జరిగింది నాన్నా..

రంగ: అదంతా ఇంటికెళ్లాక మాట్లాడుకోవచ్చు పద వెళ్దాం.

సరోజ: ఏంటీ మాట్లాడుకునేది నువ్వు రంగావో.. దొంగవో. నువ్వు రంగావి అయితే అతనెందుకు వచ్చాడు.

రంగ: నానమ్మ కన్నీళ్లు తుడవడానికి, మీ నాన్న అప్పు తీర్చడానికి వచ్చాడు.

 అని జరిగింది మొత్తం చెప్తాడు రంగ. దీంతో సరోజ సడెన్‌ గా కొత్త వ్యక్తి మా బావ అంటే నమ్మలేకపోతున్నాను అనగానే కొత్త వ్యక్తి ఏంటే.. పద కొట్టుకు వెళ్లి కొబ్బరి బొండాలు కొట్టుకుందాం అని రంగా అనగానే సరోజ నీకది ఇంకా గుర్తుందా? అంటూ ప్రేమగా దగ్గరకు వెళ్తుంది. తర్వాత సరోజ, రాధమ్మ, రంగ వెళ్లిపోతారు. శైలేంద్ర సరోజకు ఎదురెళ్లి నువ్వు నిజంగా రంగావా? అని అడుగుతాడు. అవును ఇతనే నిజమైన రంగ అని సరోజ చెప్పి వెళ్లిపోతుంది. శైలేంద్ర భయంతో వణికిపోతుంటాడు. మరోవైపు ఇంటికి వచ్చిన రిషికి మహేంద్రకు జరిగిన విషయం చెప్పానంటుంది వసుధార. తర్వాత జగతి రాసిన లెటర్‌ గురించి మహేంద్ర, రిషిని అడుగుతాడు. అది నేను చూడొచ్చా అని అడుగుతాడు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరెస్ట్ చేసే టైమ్‌లో కాఫీ తాగుతూ కూల్‌గా అల్లు అర్జున్అల్లు అర్జున్‌కి పదేళ్ల జైలు తప్పదా..?అల్లు అర్జున్ అరెస్ట్, FIR కాపీలో ఏముంది?అల్లు అర్జున్‌ కేసు FIRలో అసలేముంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
One Nation One Election: జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
Look Back 2024: ఈ ఏడాది UPIలో వచ్చిన కీలక మార్పులు, ఆశ్చర్యపరిచే ఫీచర్‌లు ఇవీ
ఈ ఏడాది UPIలో వచ్చిన కీలక మార్పులు, ఆశ్చర్యపరిచే ఫీచర్‌లు ఇవీ
Embed widget