Poonam: రియాలిటీ షోలో కెమెరా ముందు షర్ట్ తీసేసిన పూనమ్
గతవారం పూనమ్ పాండే ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తనను ఈ వారం నామినేషన్స్ నుంచి కాపాడితే లైవ్ లో వేసుకున్న షర్ట్ ను తీసేస్తానని చెప్పింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా 'లాకప్' అనే రియాలిటీ షోను టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ షోలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలంటే కంటెస్టెంట్స్ ఓ పెద్ద సీక్రెట్ ను బయటపెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ నుంచి సంచలన రహస్యాలు బయటకు వస్తున్నాయి. ఈ రియాలిటీ షోలో బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె ఈ షోలో తన వ్యక్తిగత, వైవాహిక జీవితానికి సంబంధించిన చేదు అనుభవాలను బయటపెట్టింది.
ఇదిలా ఉండగా.. గతవారం ఈ బ్యూటీ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తనను ఈ వారం నామినేషన్స్ నుంచి కాపాడితే లైవ్ లో వేసుకున్న షర్ట్ ను తీసేస్తానని చెప్పింది. ఆ సమయంలో హౌస్ మేట్స్ ఆమెని విమర్శించారు. ఆమె చెప్పేవన్నీ ఒట్టిమాటలే అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈసారి నామినేషన్స్ లో ఆమె సేవ్ అవ్వడంతో అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.
హౌస్ మేట్స్ ఎవరూ తనను చూడని సమయంలో కెమెరా ముందుకొచ్చి తను వేసుకున్న టాప్ తీసేసింది. కేవలం ఇన్నర్ తో నిలబడింది. అంతకుమించి తను లిమిట్స్ క్రాస్ చేయలేనని.. ఈ షోని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చూస్తారని చెప్పుకొచ్చింది. తను హౌస్ నుంచి బయటకొచ్చిన తరువాత చెప్పిన పని కచ్చితంగా చేస్తానని చెప్పింది. హౌస్ లో ఉన్నంతకాలం కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తానని తెలిపింది.
Also Read: మొన్న శ్రీవల్లి ఇప్పుడు అఫ్రీన్ - రష్మిక వేరియేషన్స్ మాములుగా లేవు
Also Read: RRRలో 'కొమ్మ ఉయ్యాలా, కోనా జంపాలా' పాట పాడింది ఈ పాపే, వీడియో వైరల్
View this post on Instagram