Rashmika: మొన్న శ్రీవల్లి ఇప్పుడు అఫ్రీన్ - రష్మిక వేరియేషన్స్ మాములుగా లేవు
'పుష్ప' సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు అఫ్రీన్ పాత్రతో మెప్పించనుంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఈరోజు రష్మిక పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తోన్న కొత్త సినిమా నుంచి రష్మిక క్యారెక్టర్ కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
ఈరోజు రష్మిక పుట్టినరోజు కానుకగా చిత్రబృందం ఆమెకి విషెస్ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో గన్ కాల్పులు వినిపిస్తుండగా.. నిప్పు అంటుకున్న కారు పక్క నుంచి రష్మిక వస్తూ కనిపించింది. ముస్లిం యువతి గెటప్ లో ఆమె కనిపించింది. కథ ప్రకారం ఆమె అఫ్రీన్ అనే పాత్రలో నటిస్తోంది. నటిగా రష్మిక తన సినిమా సినిమాకి వేరియేషన్ చూపించాలనుకుంటోంది. అందుకే సరికొత్త కథలను ఎన్నుకుంటోంది.
'పుష్ప' సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు అఫ్రీన్ పాత్రతో మెప్పించనుంది. ఈ వీడియోకి 'యుద్ధంతో రాసిన ప్రేమ కథ' అనే క్యాప్షన్ ఇచ్చారు. దీన్ని బట్టి ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇక రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తుంది. అలానే తెలుగులో 'పుష్ప 2' సినిమా షూటింగ్ లో పాల్గోనుంది.
Also Read: 'ఆర్ఆర్ఆర్' టీమ్ కి బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పెషల్ పార్టీ
View this post on Instagram