Podharillu Serial Today January 21th: మహాను తీసుకెళ్లడానికి వచ్చిన ఆదికి ఎలాంటి అనుభవం ఎదురైంది..? పరువు పోయిందని ప్రతాప్ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు....?
Podharillu Serial Today Episode January 21th: మహాను తీసుకెళ్లడానికి వచ్చిన ఆదికి ఎలాంటి అనుభవం ఎదురైంది..? పరువు పోయిందని ప్రతాప్ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు....?

Podharillu Serial Today Episode: చక్రిని లోపలికి తీసుకెళ్లిన మహా అతనిపై గట్టిగా అరుస్తుంది. నిజంగా నేను నీ పెళ్లాన్ని అయినట్లు అందరూ హడావుడి చేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని నిలదీస్తుంది. ఇప్పుడు నిజం చెప్పకపోతే వాళ్లంతా తర్వాత బాధపడతారని అంటుంది. రెండురోజుల్లో నేను హాస్టల్‌కు వెళ్లిపోయిన తర్వాత మీ అన్నయ్యలు ఫీల్ అవుతారని అంటుంది. కాబట్టి ఇప్పుడే నిజం చెప్పేద్దామని అంటుంది. దీనికి చక్రి హాస్టల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని....ఇక్కడే ఉంటూ చదువుకోవచ్చని, నీకు నచ్చిన ప్రాజెక్ట్ చేసుకోవచ్చని చెబుతాడు. ఆమాటలకు మహాకు ఇంకా కోపం వస్తుంది...స్టేషన్‌లో జరిపించిన ఉత్తుత్తి పెళ్లి నిజం చేద్దామనుకుంటున్నావా అని అంటుంది.
ఇంతలో మాధవ్ భోజనానికి ఏర్పాట్లు చేస్తుంటాడు. కేశవ్, కన్నా అక్కడికి వచ్చి ఈ ఇంట్లో వదిన ఎలా ఉండగలుగుతుందోనని బాధపడుతుంటారు. మన ఇంటికి కూడా ఓ మహాలక్ష్మీ వచ్చినందుకు సంతోషంగా ఉన్నా...ఇల్లు చూసి బాధగా ఉందని అంటాడు. అసలు ఈ విషయాలన్నీ ఆ అమ్మాయికి చెప్పి తీసుకొచ్చాడో లేక కోతలన్నీ కోసి అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడో తెలియడం లేదని అంటుంది. చక్రి అన్నీ చెప్పే పెళ్లి చేసుకుని ఉంటాడని మాధవ్ అనగా...ఇంటికి వచ్చినప్పటి నుంచి వదిన ముఖం చూస్తే అలా అనిపించడం లేదని, అసలే పెద్దింటి అమ్మాయి ఇక్కడ సర్దుకుపోతుందో లేదోనని అనుకుంటాడు.తనకు ఏలోటు లేకుండా మనం చూసుకోవాలని, మీరు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడటం తగ్గించాలని మాధవ్ తమ్ముళ్లకు చెబుతాడు.
ఆది తన మనుషులను తీసుకుని చక్రి ఇంటిమీదకు వస్తాడు. పోలీసులనుఅడ్డం పెట్టుకుని పెళ్లి చేసుకోవడం కాదని...ఇప్పుడు నీ దమ్ము చూపించంటూ గొడవ చేస్తాడు. వారిని నారాయణ గుమ్మం బయటే అపుతాడు.వాళ్ల గొడవ విని లోపల నుంచి అందరూ బయటకు వచ్చేస్తారు. ఆది చక్రిమీద చేయిచేసుకుంటాడు. దీంతో రౌడీలకు చక్రి అన్నదమ్ములకు పెద్ద గొడవ జరుగుతుంది. వాళ్ల కన్నాను నెట్టివేయడంతో అతని తలకు దెబ్బ తగులుతుంది. మహా వాళ్లందరినీ ఆపి ఇక్కడ నుంచి వెళ్లిపోమ్మని వాళ్ల అన్నను హెచ్చరిస్తుంది. లేకపోతే పోలీసులకు ఫోన్ చేసి చెబుతానని బెదిరించడంతో వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోతారు. చక్రి వాళ్లు కూడా లోపలికి వెళ్లిపోతారు.
మహా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందన్న బాధతో ప్రతాప్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని తీయడు. తన పరువు మొత్తం పోయిందని...నలుగురిలో ఇక తలెత్తుకుని తిరగలేనని బాధపడుతుంటాడు. తమ కులంలో ఇక తన మాట చెల్లదని మదనపడిపోతుంటాడు. రేపటి నుంచి అందరూ తనను చూసి నవ్వుతుంటే తలెత్తుకుని తిరగలేనని దానికన్నా చనిపోవడమే బెటర్ అని అనుకుంటాడు. నిద్రమాత్రలు మింగుతాడు. లోపలికి వెళ్లి భర్తతలపులు తీయకపోవడంతో భార్యతోపాటు నిహారిక భయపడతారు. చుట్టాలు తలుపులు బద్దలుకొట్టి చూడగా....లోపల బెడ్‌పై ప్రతాప్ పడిపోయి ఉంటాడు.
మహా స్నానం చేసి రెడీ అయిరాగానే మాధవ్ అందరికీ భోజనాలు వడ్డిస్తాడు. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదని చెప్పడంతో మహా కూడా అందరితోపాటే కిందే కూర్చుని అన్నం తింటుంది. చక్రికి తెలియకుండా మాధవ్, కేశవ్ అతనికి ఫస్ట్‌నైట్ ఏర్పాట్లు చేస్తారు. గది అందంగా ముస్తాబు చేసి మంచంపై పూలు చల్లి, పండ్లు పెడతారు. చక్రి కళ్లు మూసి ఆ గదిలోకి తీసుకెళ్లి చూపిస్తారు.





















