అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today  September 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును కాపాడిన అమర్‌ – చిక్కుల్లో పడ్డ రాథోడ్‌

Nindu Noorella Saavasam Today Episode:   గన్‌ పేలకపోవడంతో అరవింద్‌ కత్తితో భాగీ మీద దాడి చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:   నిజం తెలుసుకున్న భాగీ అమర్‌ దగ్గరకు వచ్చి గుర్రుగా చూస్తుంటుంది. ఎంటి అలా చూస్తున్నావు అని అమర్‌ అడగుతాడు. నీ గురించి ఇప్పుడే నిజం తెలిసింది. నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ నన్ను చుడిదార్‌ వేసుకోమని ఎందుకు చెప్పారు అని అడుగుతుది. దీంతో అమర్‌ తడబడుతూ రన్నింగ్‌, జంపింగ్‌ అన్నింటికి కంపర్ట్‌ గా ఉంటుందని అమర్‌ అనడంతో భాగీ నేనేమైనా ఒలంపిక్స్‌ కు వెళ్తున్నానా? అవన్నీ ప్రాక్టీస్‌ చేయడానికి అంటుంది. మరోవైపు భాగీకి ఎయిమ్‌ చేసిన అరవింద్‌ గన్‌ స్టక్‌ అవుతుంది. దీంతో షాక్‌ అవుతాడు.

భాగీ: ఇన్ని రోజులు లూజు లూజు అంటుంటే ఏమో అనుకున్న కానీ నిజంగా నేను లూజే.

ఆరు: నిజం తెలిస్తే   నిదానంగా ఉటుందనుకుంటే ఇలా కారాలు మిరియాలు నూరుతుందేంటి?

భాగీ: మీకు చాలా పనులు ఉన్నట్లు న్నాయి. మీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చేయండి. నేను వెళ్తున్నా..

అమర్: మిస్సమ్మ.. మిస్సమ్మ ఆగు..

భాగీ: సారీ చెప్పండి..

అని అడగ్గానే అమర్‌ సారీ చెప్పబోతుంటే అరవింద్‌ వచ్చి కత్తితో భాగీ మెడకు పెట్టి దగ్గరకు వస్తే దీన్ని చంపేస్తా.. అని బెదిరిస్తాడు.

అమర్: రేయ్‌ నీకు కావాల్సింది నేను కదా? నేను వచ్చేస్తాను. మిస్సమ్మను వదిలిపెట్టు.

అరవింద్‌: నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు. నువ్వు ఏడవడం. నీ ఓటమి కావాలి.

అమర్: మిస్సమ్మ నీకేం కాదు నేనున్నాను.

అరవింద్‌: నీ భార్యకు ఏమైనా చెప్పాలనుకుంటే ఆఖరిగా చెప్పు.

అమర్‌: చెప్పాల్సింది నేను కాదురా.. నీవాళ్లకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పుకో.. ఈరోజు నువ్వు చచ్చిపోతావు.

   అని పక్కనే ఉన్న బకెట్‌ను తన్నగానే అది అరవింద్‌ కు తగులుతుంది. అరవింద్‌ కిందపడిపోతాడు. ఇంతలో అమర్‌, అరవింద్‌ ను అతడి అనుచరుడిని కొడతాడు. ఇంతలో అరవింద్‌ రాథోడ్‌ను బందీగా చేసుకుని పారిపోతాడు. రాథోడ్‌ను విడిచిపెడతాడు. ఇంట్లో అందరూ చూస్తుంటే భాగీ నెత్తిన దుప్పటి కప్పుకుని కూర్చుని ఉంటుంది.

అంజు: ఏయ్‌ ఎవ్వరూ నవ్వకండి. ఇది చాలా సీరియస్‌ మాటర్‌. ఇలాంటి విషయాల్లో ఎవరైనా నవ్వుతారా? పాపం మిస్సమ్మ ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది.

అమ్ము: పాపాత్మురాలా? నువ్వే నవ్వుతూ మళ్లీ నువ్వే నవ్వొద్దని చెప్తావా? చూశావా మిస్సమ్మ దీని డబుల్‌ యాక్షన్‌.

భాగీ: మీ అందరికీ నేను లోకువై పోయాను కదా? ఆయనేమో నా ప్రాణాన్ని పణంగా పెట్టారు. అంజుకేమో నన్ను చూస్తే జోకర్ లా అనిపిస్తుంది. అంతే కదా?

అంజు: మిస్సమ్మ ప్లీజ్‌ మిస్సమ్మా నీ ఫేస్‌ కాస్త వేరే సైడుకు తిప్పుకోవా? నాకు నవ్వు ఆగడం లేదు. అడగకుండా డాడ్‌ నిన్ను బయటకు తీసుకెళ్తా అన్నప్పుడే నీకు డౌట్‌ రాలేదా.

మనోహరి: బయటకు వెళ్దాం. చుడీదార్‌ వేసుకో అనగానే భూమ్మీద ఆగావా మిస్సమ్మ. ఎంత బిల్డప్‌ ఇచ్చావు. ఎన్ని మాటలు మాట్లాడావు.

అంజు: మిస్సమ్మ మా డాడ్‌ ఓవర్‌ టైం డ్యూటీ చేస్తారు కానీ ఆఫీస్‌ వదిలేసి ఔటింగ్‌ కు వెళ్లరమ్మా.. ముందు అది తెలుసుకో అమ్మా..

శివరాం: చాల్లే ఆపండి పాపం మిస్సమ్మ అసలే హడలిపోయి ఉంటే మీ మాటలతో ఇంకా బాధపెడుతున్నారు.

నిర్మల: ఏయ్‌ పొట్టి నువ్వు మిస్సమ్మను ఓదార్చకపోయినా పర్వాలేదు. బాధపెట్టకుండా ఉండు చాలు. ముందు నువ్వు లోపలకి వెళ్లు.

అంజు: ఓ ఇది ఓదార్పు యాత్రా నాకు తెలియక జాయిన్‌ అయిపోయానే..

ఆరు: అయ్యో అప్పటికీ అందరూ అన్నారు. అంజలిని నెత్తిన ఎక్కించుకోవద్దని. కోతిలా తయారవుతుందని.

రాథోడ్‌: అంజు పాప దయచేసి నువ్వు లోపలికి వెళ్లవా? ఇవాళ జరిగింది నువ్వు చూసి ఉంటే ఇలా మాట్లాడి ఉండేదానివి కాదు. మిస్సమ్మ దేశం కోసం దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసేందుకు కూడా సిద్దపడింది. మీరందరూ తనని చూసి గర్వపడాలి.

అమ్ము: రాథోడ్‌ మిస్సమ్మ ప్రాణ త్యాగం చేయాలనుకోలేదు. మీరు బలవంతంవగా లాక్కోవాలనుకున్నారు.

 అని అందరూ నవ్వుకుంటారు. మిస్సమ్మ చాలెంజ్ చేసి అమర్‌ రూంలోకి వెళ్తుంది. కోపంలో స్పీడుగా వస్తున్న మిస్సమ్మ జారి కిందపడబోతుంటే అమర్‌ పట్టుకుంటాడు. ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఇంతలో ఆరు వచ్చి చూసి సిగ్గుపడుతుంది. భాగీ మాత్రం అమర్‌ మీద నుంచి లేచి తిడుతూ అక్కలా నేను చనిపోతే అని అంటుండగానే అమర్‌ భాగీ నోరు మూస్తాడు. పక్కనే ఉండి చూస్తున్న ఆరు ఎమోషన్‌ అవుతుంది. మాట వరసకు కూడా ఇంకోసారి ఆ మాట అనకు మిస్సమ్మ. నీకేం కాదు కాకూడదు. కానివ్వను అంటాడు అమర్‌  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీ ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే భయంకరమైన వాస్తు దోషం ఉన్నట్లే

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
Podarillu Serial Today August 6th:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget