Nindu Noorella Saavasam Serial Today October 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీకి నిజం చెప్పిన ఆరు – ఆరు సలహాతో అమర్ ను ప్రేమలో దింపిన భాగీ
Nindu Noorella Saavasam Today Episode: ఇంట్లోకి వచ్చిన ఆరు, భాగీని చూసి బయటకు వెళ్లిపోవడంతో వెనకాలే వెళ్లిన భాగీ, ఈ టైంలో మా ఇంట్లో ఉన్నావేంటని నిలదీస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు భాగీ వస్తుంది నన్ను చూస్తుంది వదలండి అంటూ ప్రాధేయపడుతుంది. భాగీ వచ్చి అక్కా అంటూ పిలుస్తూ కోపంగా చూస్తుంది. గుప్త సంతోషంగా రమ్ము బాలిక రమ్ము నీ ప్రశ్నలతో ఆ బాలికను ఇక్కడ ఉండకుండా వెళ్లేటట్లు చేయుము అంటూ చెప్తుంటాడు. భాగీ కోపంగా వచ్చి ఈ టైంలో ఎందుకు మీరు మా ఇంటికి వచ్చారు. ఎప్పుడు చూసినా మీరు మా ఇంట్లోనే కనబడుతున్నారు మీ ఇంట్లో వాళ్లు ఏమీ అనరా? నిన్ను అని అడుగుతుంది.
భాగీ: ఏమైంది అక్కా ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు. చెప్పండి. ఎందుకు ఈ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఎప్పుడూ అందరినీ దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఎందుకు ఈ ఇంట్లో వాళ్లకు ఏమైనా అయితే బాధపడిపోతారు. నిజం చెప్పండి అక్క ఈ ఇంట్లో వాళ్లకు నీకు ఏమిటి సంబంధం.
ఆరు: చెప్తాను మిస్సమ్మ. అన్ని చెప్తాను. ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్తున్నాను. నేను ఎందుకు ఇక్కడే ఉంటున్నానో.. ఎందుకు మీ చుట్టూ తిరుగుతున్నానో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను.
గుప్త: బాలిక ఏమి మాట్లాడుతుంటివి. ఏదో ఒకటి చెప్పి తప్పించుకో.. మరోక్కసారి ఇటు రానని చెప్పు.
భాగీ: పర్వాలేదు అక్కా చెప్పండి.
ఆరు: ఇన్ని రోజుల నుంచి నీ దగ్గర ఒక నిజాన్ని దాచాను మిస్సమ్మ. ఇంకా ఎన్ని రోజులు దాచాలో తెలియదు. అందుకే నువ్వు అర్థం చేసుకుంటావనే చెప్తున్నాను.
గుప్త: బాలిక నా మాట వినుము. ఈ బాలికకు నిజం తెలిసినచో ఏమగునో నీకు తెలుయును కదా..? దయచేసి తొందరపడకుము
ఆరు: ఈ ఇంటి మొదటి కోడులు నేనే
గుప్త: బాలిక వద్దు బాలిక ఏదో ఒకటి చెప్పుము.. పరిహాసము ఆడుతిని అని చెప్పుము బాలిక.
ఆరు: ఆయన మొదటి భార్యను నేనే.. ఆ పిల్లల తల్లి కూడా నేనే యాక్సిడెంట్ లో చనిపోయింది కూడా నేనే.
భాగీ: ఏం మాట్లాడుతున్నావు అక్కా చెప్పండి అక్కా బతికి ఉన్న మీరు చనిపోయిన ఆరు అక్కా ఎలా అవ్వగలరు.
ఆరు: అవ్వలేను. నేను ఆయన వైఫ్ ఎలా అవుతాను. ఎప్పటికీ అవ్వలేను. నేనంటే నేను అని కాదు నేను అని అనుకుంటున్నాను అని
అంటూ ఆరు తాను ఒక నవల రాస్తున్నాను అని అందులో మేయిన్ క్యారెక్టర్ కూడా ఆరు అని అందుకే అలా ఫాలో అవుతున్నాను అని చెప్తుంది. దీంతో భాగీ సిగ్గుపడుతూ నాకు ఆయనకు ఏదైనా జరిగినట్టు చెప్పొచ్చు కదా అంటుంది. దీంతో ఆరు ఏదో ఒకటి చెప్పగానే భాగీ వెళ్లిపోతుంది. లోపలికి వెళ్లిన పాల గ్లాసు తీసుకుని సిగ్గుపడుతూ అమర్ దగ్గరకు వెళ్తుంది. అంతా గమనిస్తున్న ఆరు ఇబ్బందిపడుతుంది.
ఆరు: గుప్తగారు అంత ధైర్యం చెప్పుకుని లోపలికి వెళ్తుంది కదా ఏమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. నేను వెళ్తాను లేండి.
గుప్త : ఆ ఎచ్చటకు వెళ్లెదవు. ఇచటకు రమ్ము. ఉచిత సలహాలు ఇచ్చితివి కదా? తదుపరి చలనచిత్రము ఎవరు చూచెదరు.
అంటూ గుప్త, ఆరును డోర్ దగ్గరకు తీసుకెళ్తాడు. లోపల భాగీ పాలు అమర్‌కు ఇస్తుంది. అమర్ పాలు తాగుతుంటాడు. ఏవండి అందరికీ పాలు ఇచ్చాను నేను తాగడానికి పాలు కూడా లేవు అంటుంది. సరే రాథోడ్ కు చెప్పి షాపుకు వెళ్లి పాలు తీసుకురమ్మని చెప్తాను అంటాడు. వద్దని మీ గ్లాస్‌లో ఉన్న పాలు తాగుతానని అమర్ చేతిలో గ్లాస్ తీసుకుని పాలు తాగేస్తుంది భాగీ.
ఆరు: పాలు పంచేసుకున్నారు కదా? పదండి పోదాం.
గుప్త : తమరు ఇచ్చిన ఉచిత సలహానే కదా ఎచటకు వెళ్లేది. వీక్షించెదము.
అంటూ చూస్తుంటారు. భాగీ పెదవుకు పాలు అంటుకున్నాయని అమర్ చెప్తాడు. భాగీ కావాలని పక్కన తుడుచుకుని పోయిందా? అని అడుగుతుంది. దీంతో అమర్ భాగీ మూతి తుడుస్తాడు. ఆరు నాకు చాలా కంపరంగా ఉందని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లోపల బెడ్ మీదకు వెళ్లిన అమర్ దగ్గరకు వెళ్లి భాగీ థాంక్స్ చెప్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. ఇంతలో భాగీ నిద్రపోయి అమర్ మీదకు ఒరుగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం
Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్: సామంత్, అనామికల మధ్య గొడవ – రుద్రాణిని ముసుగేసి కొట్టిన స్వప్న