Nindu Noorella Saavasam Serial Today November 5th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీని తిట్టిన అమర్ - భాగీని తట్టా బుట్టా సర్దుకోమ్మన్న మనోహరి
Nindu Noorella Saavasam Today Episode: దేవుడి గుడికి ఉన్న కర్టెన్ చూసిన అమర్ కోపంగా భాగీని తిడతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంటికి వచ్చిన అమర్ అనుమానంగా దేవుడి రూం వైపు చూసి దగ్గరకు వళ్లి ఈ పని ఎవరు చేశారు. అని అడుగుతాడు. భాగీ దగ్గరకు వెళ్లి నేనే చేశానని చెప్తుంది. ఎందుకు చేశావని అమర్ అడగ్గానే పాత చీర పాడేయడం ఎందుకని కర్టెన్ గా కట్టానని చెప్పడంతో అమర్ కోపంగా భాగీని కొట్టబోయి.. ఆగి తిడతాడు. ఇది ఆరు అక్క చీర నా దగ్గర ఉన్న జ్ఞాపకం ఇది అంటూ కోప్పడతాడు. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. ఇంతలో మనోహరి వస్తుంది.
మనోహరి: అయ్యయ్యో ఏం చేశావు మిస్సమ్మ. ఆరు చీరను ఇలా మార్చడానికి నీకు మనసెలా వచ్చింది. అసలు నువ్వు ఆరు చీరను ఎందుకు ముట్టుకున్నావు. అమర్ ఆరు వస్తువుల్ని ప్రాణంగా చూసుకుంటాడు. అలాంటిది ఇవాళ నువ్వు ఆరు ప్రాణాలనే ముక్కలు చేశావు.
శివరాం: నువ్వు ఆగమ్మా.. అసలే వాడు కోపంగా ఉంటే నువ్వు ఇలా మాట్లాడి వాడి కోపాన్ని ఇంకా పెంచుతావా..? అమర్.. మిస్సమ్మ ఇది తెలియక చేసింది. నిజంగా తెలిస్తే ఇలా చేయదు.
భాగీ: సారీ అండి నిజంగా ఇది ఆరు అక్క చీర అని నాకు తెలియదు.
అమర్: మాట్లాడకు మిస్సమ్మ నువ్వు చెప్పే ఏ ఎక్సిప్లేషన్ నా బాధను, నా కోపాన్ని తగ్గించలేవు. తప్పు చేశావు మిస్సమ్మ చాలా పెద్ద తప్పు చేశావు. సరిదిద్దుకోలేని తప్పు చేశావు. ఈ బాధ విలువ నీకు చెప్పినా అర్థం చేసుకోలేవు.
అని అమర్ కోపంగా వెళ్లిపోతుంటే.. నిర్మల, శివరాం ఆగమని భాగీ చెప్పేది కూడా వినమని చెప్పినా వినకుండా అమర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
శివరాం: రాథోడ్ ముందు ఆ శారీ తీసేయ్.
రాథోడ్: అలాగే సార్..
అంటూ శారీ తీసుకుని వెళ్లిపోతాడు.
నిర్మల: మిస్సమ్మ ఆ చీర తీసుకునే ముందు ఒకసారి అడగాలి కదమ్మా..
శివరాం: సరేలేవే అయిందేదో అయిపోయింది. మిస్సమ్మ ఇదేది మనసులో పెట్టుకోకు. అమర్ కోపం నీటి మీద బుడగ లాంటిది.
అని చెప్పి ఇద్దరూ వెళ్లిపోతారు. మనోహరి హ్యాపీగా చూస్తుంటుంది.
మనోహరి: ఏంటి..? నేనే నీకు ఆ కర్టెన్ ఇచ్చానని అమర్ కు చెప్తామనుకుంటున్నావా..? చెప్తే నీ తప్పును కప్పిపుచ్చుకుంటున్నవని అనుకుంటాడు కానీ నిజం చెప్తున్నావని అసలు అనుకోడు. ఇంక నీ సామన్లు సర్దేసుకో మిస్మమ్మ. ఈ ఇంట్లో నుంచి అమర్ జీవితంలో నుంచి బయటకు వెళ్లాల్సిన టైం వచ్చింది.
అంటూ చెప్పి మనోహరి వెళ్లిపోతుంది. భాగీ ఏడుస్తూ అన్ని విషయాలు గుర్తు చేసుకుంటుంది. మరోవైపు ఆరు కోపంగా అటూ ఇటూ తిరుగుతూ గుప్త తో మాట్లాడుతుంది.
ఆరు: అసలు ఆ మనోహరి మనిషేనా గుప్త గారు. పాపం మిస్సమ్మను ఆయనతో తిటించింది. ఆయినా ఆయన్ని కాదు ముందు మిస్సమ్మను అనాలి. ఇదంతా మనోహరి పని అని ఒక్కమాట చెప్పాలి కదా..?
గుప్త: చెప్పినా నీ పతి దేవుడు నమ్మునా..? తను ప్రేమించుచున్న వారి బాధకు తనే కారణం అయినానని ఎంత బాధపడుతుందో తెలుసా..?
ఆరు: ఈ మంచోళ్లు ఉన్నారే.. వీళ్లేప్పుడు ఇంతే గుప్త గారు ముంచే వాళ్ల చేతుల్లో మోసపోతూనే ఉంటారు. ఇలా నా వల్ల కాదు. మీరు నన్ను వెంటనే పైకి తీసుకెళ్లిపోండి. నేనే చెప్తున్నాను మీరు ఈ మాట కోసమే కదా? నా చుట్టూ తిరిగారు. నేనే చెప్తున్నాను నన్ను పైకి తీసుకెళ్లండి.
గుప్త: నేను ఇప్పుడు తీసుకెళ్లలేననే కదా? నువ్వు అడిగేది. దివ్యమైన గడియల్లో తప్పా నేను నిన్ను పైకి తీసుకెళ్లలేను.
అని గుప్త చెప్పగానే ఆరు అన్ని తెలిసి కూడా ఆ మనోహరిని ఏమీ చేయలేకపోతున్నను అనుకుంటుంది. మరోవైపు స్టోర్ రూంలో ఆరు చీరను పెట్టడానికి వెళ్లిన రాథోడ్ ను ఆగమని వెళ్లి చీర తీసుకుని ఆరు బాధపడుతుంది. దీని కంతటికి మనోహరి కారణం అని జరిగింది చెప్పి.. ఎమోషనల్ అవుతుంది. మరోవైపు పిల్లలు స్కూల్ లో లంచ్ చేస్తుంటారు. రామ్మూర్తి వారి దగ్గరకు వెళ్లి పిల్లలు మీకోసం అంతా వెతుకుతున్నాను అని చెప్పగానే పిల్లలు అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. మీరే ఇక్కడ కూర్చోండి నేనే వెళ్లిపోతాను అని వెళ్లిపోతుంటే.. బంటి వచ్చి రామ్మూర్తి టిఫిన్ బాక్స్ కింద పడేలా చేస్తాడు. పిల్లలు వెళ్లి బంటిని తిడతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!