అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today May 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి నిజం చెప్పిన అమర్‌ - ప్రమాదంలో బాబ్జీ  

Nindu Noorella Saavasam serial Today Episode May 4th: కొడైకెనాల్‌లో యాక్సిడెంట్‌ అయిన బాబ్జీ మనోహరి పేరు చెప్పడాన్ని అమర్‌, భాగీకి చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు చనిపోయిన ప్లేస్‌ నిలబడి ఎమోషనల్ అవుతున్న అమర్‌కు వెంటనే అక్కడ ఇంకో యాక్సిడెంట్‌ అవ్వడం చూసి షాక్‌ అవుతాడు. వెంటనే వెళ్లి చూడగా ఆరును చంపిన బాబ్జీకి అక్కడ రక్తపుమడుగులో పడి ఉంటాడు. అమర్‌ వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే..

బాబ్జీ: సార్‌ మీరు చాలా మంచి వారు.. అరుంధతి మేడం యాక్సిడెంట్‌ లో చనిపోలేదు..

అమర్‌: బాబ్జీ ఏం చెప్తున్నావు.. యాక్సిడెంట్‌ కాదా..?

బాబ్జీ: అవును సార్‌ మేడంను మర్డర్‌ చేయించారు.. చేసింది నేనే

అమర్‌: మర్డరా..? బాబ్జీ ఎవరు చేయించారు.. చెప్పు బాబ్జీ..

బాబ్జీ: మనోహరి..

అంటూ స్పృహ కోల్పోతాడు. పైనుంచి గుప్త, నాదరుడు. కింద చెట్టు చాటు నుంచి మనోహర అంతా గమనిస్తుంటారు. బాబ్జీ మనోహరి అనే పేరు చెప్పగానే.. మనోహరి షాక్ అవుతుంది. భయంతో వణికిపోతుంది.

గుప్త: మహర్షి ఆ దుండగుడు దుష్ట బాలికి పేరు మాత్రమే చెప్పి స్పృహ కోల్పోయినాడు. అరుంధతి బాలికను హతమార్చినది ఆ మనోహరే అని అమరేంద్రకు అవగతం అయ్యేది ఎట్లా

నారదుడు: విచిత్ర గుప్త నీకు అన్నింటికీ తొందరే.. ఎప్పుడు ఏం జరగాలని ఉండునో అప్పుడు అలానే జరుగుతుంది అని నీకు మాత్రం తెలియదా ఏంటి..?

గుప్త: తెలుసును మహర్షి కానీ అమరేంద్రకు ఆ కాస్త నిజం తెలిసినచో బాగుండునని నా అభిలాష

నారదుడు: వేచి చూడుము విచిత్రగుప్త

గుప్త: ఇప్పటికే చాలా ఆలస్యం అయినది మహర్షి.. ఇంకనూ ఎన్నాళ్లు వేచి చూడవలెను..

నారదుడు: విచిత్ర గుప్త మన ఆలోచనలతో విధికి ఏమాత్రం అవసరం లేదు కాలానికి గాలము ఏమాత్రం ఎవ్వరునూ వేయలేరు. ప్రవహించే కాలాన్ని అనుసరించడమే మన గమ్యం

గుప్త: అయితే ఇంతకు ముందు మీరు చెప్పిన మలుపు ఇదేనన్నా మాట చిత్తం మహర్షి మీ వాక్కు నేను శిరసావహించెదను ఎమి జరుగునో చూచెదను

అమర్‌( మనసులో) : ఇతను ఆరు యాక్సిడెంట్‌ గురించి చెబుతూ మనోహరి పేరు చెప్పాడేంటి..? అసలు యాక్సిడెంట్‌కు మనోహరికి ఏం సంబంధం ఉంది

మనోహరి: ఆరుకు యాక్సిడెంట్ అయిన ప్లేస్‌కు అమర్‌ రావడం ఏంటి.. అదే స్పాట్‌లో ఆరును గుద్దిన రౌడీకి యాక్సిడెంట్‌  అవ్వడం ఏంటి..? వాడు నా పేరు చెప్పడం ఏంటి..? ఇదంతా కాకతాళీయమా..? లేకపోతే నా టైం దగ్గర పడిందా..?

అనుకుంటూ భయపడుతుంది మనోహరి. అమర్ బాబ్జీని కారులో హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. తర్వాత భాగీకి కాల్‌ చేస్తాడు. భాగీ కిచెన్‌ లో ఉంటుంది. బయట హాల్లో ఫోన్‌ రింగ్‌ అవుతుంది.

రాథోడ్‌: మిస్సమ్మ నీకు ఫోన్‌ వస్తుంది

భాగీ: ఎవరో చూడు రాథోడ్‌

రాథోడ్‌: నీ ఫోన్‌ నేను ఎలా చూస్తాను మిస్సమ్మ. అది నీ పర్సనల్ గదా..

భాగీ: నాకు పర్సనల్ ఏముంటాయి రాథోడ్‌.. అయినా నాకు పర్సనల్‌ గా ఎవరు చేస్తారు. చేస్తే మా నాన్న చేయాలి. లేదంటే కరుణ చేస్తుంది. అంతే కదా

రాథోడ్‌: బలే దానివి మిస్సమ్మ అప్పుడప్పుడు మా సారు కూడా చేయోచ్చు నీకు ఫోన్‌

భాగీ: ఆయన నాకెందుకు చేస్తారు.

అనుకుంటూ హాల్లోకి వచ్చి కాల్ చూసి షాక్‌ అవుతుంది. ఆశ్చర్యంగా నవ్వుతూ అమర్‌ తనకు ఫోన్‌ చేస్తున్నాడని భాగీ సంతోషిస్తుంది.

భాగీ: ఆయన నాకు ఫోన్‌ చేస్తున్నాడు రాథోడ్‌..

రాథోడ్‌: అదే కదా నేను చెప్పింది. అరుంధతి మేడం జ్ఞాపకాలను తలుచుకోవడానికి వెళ్లిన సారుకు నువ్వు గుర్తొచ్చావు అంటే అబ్బబ్బా ఇది చాలా మంచి విషయం మిస్సమ్మ ఎత్తేయ్‌ ఎత్తేయ్‌ పోన్‌ ఎత్తి మాట్లాడు

అనగానే.. భాగీ ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంది. అమర్‌ పిల్లల గురించి ఎగ్జామ్‌ గురించి అడిగి బాబ్జీకి జరిగిన యాక్సిడెంట్‌ గురించి, బాబ్జీ చెప్పిన మనోహరి పేరు గురించి చెప్పి ఆశ్చర్యపోతాడు. భాగీ కూడా ఆశ్చర్యపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget