Nindu Noorella Saavasam Serial Today August 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: యాక్టింగ్ కు ఒప్పుకున్న భాగీ – భాగీకి దిష్టి తీసిన అమర్
Nindu Noorella Saavasam serial Today Episode August 11th: యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ రిక్వెస్ట్ చేయడంతో భాగీ యాక్టింగ్‌కు ఒప్పుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆత్మ కోసం అమర్ ఇంట్లోకి వచ్చిన చంభాకు ఆత్మ కనిపించదు. తన మంత్ర శక్తితో ఆత్మ ఎక్కడుందో చూసి మనోహరి రూంలోకి వెళ్తుంది. చంభా రూం ఓపెన్ చేసుకుని లోపలి వెళ్లగానే ఆరు ఆత్మ బయటకు వెళ్లిపోతుంది. చంభా కోపంగా బయటకు వస్తుంది.
మనోహరి: ఏమైంది చంభా దొరికిందా..?
చంభా: లేదు మనోహరి తప్పించుకుంది.
పైన అమర్ ఆరు రూం ఓపెన్ చేస్తాడు. ఆ సౌండ్ విని మనోహరి భయపడుతుంది. ఇద్దరూ కలిసి పైకి వెళ్తారు. అమర్ ఆరు ఫోటో ముందు నిలబడి చూస్తుంటాడు. అప్పుడే ఆరు రూంలోకి వెళ్తుంది.
అమర్: ఆరు…
ఆరు: ఏవండి నేను ప్రమాదంలో ఉన్నానండి
అమర్: ఎందుకో తెలియదు ఆరు మనసంతా అలజడిగా ఉంది. నీకు ప్రమాదం వస్తుందేమోనని ఇబ్బందిగా ఉంది. ఆరు నువ్వు బాగానే ఉన్నావు కదా..?
ఆరు: లేదండి ఎవరో దుష్ట శక్తురాలు నా కోసం వచ్చిందండి నన్ను తీసుకెళ్లిపోతానంటుంది. ఏం చేయాలో ఏంటో అసలు తోచడం లేదు.
అమర్: నువ్వేం చెప్పినా నాకు వినిపించదు కదా ఆరు.. మన ఇంటికి ఏ స్వామిజీ వచ్చినా కూడా నువ్వు ఇక్కడే ఉన్నావని నీ ఆత్మ మన ఇంటి చుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు. వాళ్లు చెప్పిన ప్రతిసారి.. ఆ విషయం గుర్తొచ్చిన్నప్పుడల్లా మాతో సంతోషంగా గడపాల్సిన నువ్వు మమ్మల్ని దూరం నుంచి చూస్తూ ఆనంద పడుతున్నావో బాధపడుతున్నావో అసలు అర్థం కావడం లేదు ఆరు
చంభా ఆరు రూం ముందుకు వచ్చి చూస్తుంది.
ఆరు: ఏవండి ఆ చంభా వచ్చేసిందండి.. నన్ను తీసుకెళ్లిపోతుందేమోనని భయంగా ఉందండి ఏదైనా చేసి నన్ను కాపాడండి
మను వస్తుంది.
మను: ఏంటి చంభా ఏమైంది.. ఇక్కడ ఎందుకు ఆగావు..?
చంభా: అటు చూడు
మను: అమర్ ఈ టైంలో ఆరు రూం ఓపెన్ చేశాడేంటి..?
చంభా: అతనొక్కడే కాదు ఆత్మ కూడా లోపలే ఉంది..
అని చెప్పి ఆరు మీదకు మంత్రం వేస్తుంది. అది తిరిగి చంభా దగ్గరకే వస్తుంది.
చంభా: ఏదో శక్తి నా దుష్టశక్తికి అడ్డు పడుతుంది. ఆ ఆత్మ ఫోటో ముందున్న పూలు తీసేస్తే నేను ఆత్మను బంధిస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అక్కడి నుంచి అతన్ని బయటకు పంపించు. వెంటనే ఆ పూలను కూడా తీసుకెళ్లిపో
గుప్త: బాలిక వారిరువురు నీ చిత్ర పటం ముందు ఉన్న పువ్వులు తీయుటకు ప్రయత్నిస్తున్నారు. ఆ చంభా నీ పై దుష్ట శక్తిని ప్రయోగించింది. ఆ పువ్వుల సమీపంలో నువ్వు ఉన్నందునే ఆ దుష్ట శక్తి నీ సమీపమునకు రాలేదు..
మను: చంభా నువ్వు పక్కకు వెళ్లి దాక్కో నేను వెళ్లి అమర్ ను పంపిస్తాను. ( లోపలికి వెళ్తుంది.) అమర్ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు…?
అమర్: నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మనోహరి
మను: అది పడుకుంటే ఏదో సౌండ్ వచ్చింది అమర్.. ఏంటా అని చూసి వచ్చాను ఏమైంది అమర్..?
అమర్: ఏం లేదు నువ్వు వెళ్లి పడుకో..
మను: అయ్యో అమర్ ముందు నువ్వు వెళ్లి పడుకో అమర్ నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు.. అమర్ ఏమైంది.. నువ్వు వెళ్లి పడుకో
అని మనోహరి చెప్పగానే.. అమర్ వెళ్తాడు. ఆరు ఏడుస్తుంది. మనోహరి పూలు తీయడానికి వెళ్తుంది. ఇంతలో అమర వచ్చి రూం లాక్ చేద్దాం రా మనోహని అని పిలుస్తాడు. ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. చంభా కోపంగా వెళ్లిపోతుంది. తర్వాత యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో భాగీ యాక్టింగ్ చేస్తుంది. భాగీ యాక్టింగ్ చూసి అందరూ మెచ్చుకుంటారు. చిత్ర, మనోహరి ఇరిటేటింగ్ గా ఫీలవుతారు. తర్వాత భాగీని రూంలోకి తీసుకెళ్లి దిష్టి తీస్తాడు అమర్. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















