Nindu Manasulu Serial Today September 5th: నిండు మనసులు సీరియల్: మినిస్టర్‌ని టార్గెట్ చేసిన గణ.. విశ్వనాథ్ టెస్ట్‌లో ట్విస్ట్! ప్రేరణ, సిద్ధూ ఏం చెప్పారంటే!
Nindu Manasulu Serial Today Episode September 5th ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ నమ్మకం అనే విషయం గురించి విశ్వనాథ్ గారి దగ్గర చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode గణ పెళ్లి సంబంధం ప్రేరణ క్యాన్సిల్ చేసినందుకు గణ వైల్డ్‌గా రియాక్ట్ కాకపోవడంతో సుధాకర్, ఇందిర షాక్ అయిపోతారు. ఎందుకు దాన్ని వదిలేశావ్‌రా అని ఈశ్వరి అడిగితే గణ ఆలోచించి దెబ్బకొట్టమన్నావ్ కదా అలాగే చేస్తా అని అంటాడు.
ప్రేరణ బయటకు వెళ్తే అక్కడే సిద్ధూ ఉంటాడు. ప్రేరణని చూసి హాయ్ చెప్తాడు. దానికి ప్రేరణ షాక్ అయి నువ్వేంటి ఇక్కడ నాకు తెలుసు నువ్వు కావాలనే నన్ను ఫాలో అవుతున్నావ్.. కావాలనే నన్ను వెతుక్కుంటూ వస్తున్నావ్ ఏంటి నాటకాలు ఆడుతున్నావా అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నారండీ నేను మిమల్నిఎందుకు వెతుక్కుంటూ వస్తాను నాకేం పని లేదా అంటాడు. ఇద్దరూ మధ్య మాటా మాటా పెరుగుతుంది. ఊహకి హద్దు ఉండాలి ఇక్కడ ఎవరూ తమరి కోసం ఎదురు చూడటం లేదు.. నిన్ను పిక్ చేసుకోవడానికి మీ ఇంటికి వెళ్తే మీ అమ్మ గారు డ్రాప్ చేయమని అన్నారు. ఇక్కడికి తీసుకొచ్చా అంటాడు.
ప్రేరణ మనసులో అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది.. నాన్న ఇక్కడే ఉన్న సంగతి తెలిసిపోయిందా అని అనుకుంటుంది. నీతో నాకు ఏంటి అని ప్రేరణ వెళ్లిపోతుంటే సిద్ధూ బైక్ ఎక్కమని అంటాడు. ఎక్కను అని ప్రేరణ అంటే ఇంకా పావుగంటే టైం ఉంది విశ్వనాథం గారి దగ్గరకు నేను ముందు వెళ్లిపోతా అని అనడంతో ప్రేరణ ఎక్కుతుంది.
గణ, ఈశ్వరి ప్రేరణ గురించి మాట్లాడుకుంటారు. మన బలహీనతే దానికి బలం అయిపోయింది. దాన్ని దెబ్బ కొట్టాలి అంటే పవర్‌తో కొట్టాలి అని అందుకు నాకు పవర్ కావాలి ఆ ప్రయత్నంలోనే ఉన్నానని గణ అంటాడు. గణ వెంటనే మినిస్టర్ పీఏకి కాల్ చేసి గతంలో నీకు నేను సాయం చేశాను కదా ఇప్పుడు నువ్వు నాకు సాయం చేయాలి బ్రహ్మాజీ.. మినిస్టర్ నేను చెప్పే మాట వినాలి అంటే ఆయనకు చెందిన ఓ సీక్రెట్ నాకు కావాలి.. ఆ సీక్రెట్ ఎలా ఉండాలి అంటే మినిస్టర్ వణికి పోవాలి అని అంటాడు. బ్రహ్మాజీ సరే అంటాడు.
ఐశ్వర్య రంజిత్‌కి జ్యూస్ ఇస్తుంది. రంజిత్ తాగుతూ ఉంటాడు. గ్లాస్ ఇస్తా ఇక్కడే ఉండు అని ప్రేరణకి చెప్తాడు. ఇంతలో ఏసీ రిపేర్ చేసే అతను వస్తాడు. రంజిత్ ఐశ్వర్యని చూస్తే మీరు అలా చూడక్కర్లేదు మాకు ఏసీ లేదు మీకు మాత్రమే ఏసీ ఉంది అని అంటుంది. మనసులో మతి మరుపు వాడు అని రంజిత్‌ని తిట్టుకుంటుంది. అతన్ని తీసుకెళ్లి ఏసీ రిపేర్ చేయించమని ఐశ్వర్యకు చెప్తాడు. నన్నే వెళ్లమన్నారా మీ గదిలోకి ఎవరినీ వద్దు అంటారు కదా ముఖ్యంగా నన్ను వద్దు అంటారు కదా అని ఐశ్వర్య అంటుంది. నా పర్మిషన్ ఉంటే పర్లేదు అని ఐశ్వర్యని వెళ్లమంటాడు. ఐశ్వర్య వెళ్లి రంజిత్ కబోర్డ్ ఓపెన్ చేయాలి అనుకుంటుంది. తర్వాత రంజిత్, ప్రేరణల వార్నింగ్ గుర్తు చేసుకొని ఆగిపోతుంది. మనసు మాత్రం కబోర్డు ఓపెన్ చేయ్ అంటుంది.
ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ విశ్వనాథ్ గారి దగ్గరకు వెళ్తాడు. ఇద్దరికీ టెస్ట్ పెట్టిన విశ్వనాథ్ ఇద్దరినీ చూసి సిద్ధూ నీ కంటే డిటైల్‌గా టాపిక్ రాశాడని అంటారు. ప్రేరణ హర్ట్ అయిపోతుంది. దాంతో విశ్వనాథ్ ప్రేరణతో ఒక్కోక్కరికి ఒక్కో టాపిక్ మీద అవగాహన ఉంటుంది ఏం పర్లేదు అని అంటారు. తర్వాత ఇద్దరికీ నమ్మకం అనే టాపిక్ మీద డిబైట్ చేయమని అంటారు. ప్రేరణని మొదలు పెట్టమని చెప్పి స్టాప్ అన్నాక ప్రేరణ ఆపేసి సిద్ధూ చెప్పాలని తర్వాత ప్రేరణ ఇలా ఒక్కోక్కరు చెప్పాలని అంటాడు. ఇద్దరూ స్టోరీలా చెప్తారు. నమ్మకం పవర్ ఫుల్ అని మనిషి పుట్టుక నుంచి చావు వరకు నమ్మకం ముఖ్యమని ప్రేరణ తోటి మనిషిని నమ్మాలి అని చెప్తే సిద్ధూ మాత్రం మనల్ని ముఖ్యంగా మనసుని నమ్మాలి అని అని చెప్తాడు. సిద్ధూ మమల్ని మనం నమ్మాలి అని చెప్తే ప్రేరణ పక్కవారిని నమ్మాలి అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















