Nindu Manasulu Serial Today September 3rd: నిండు మనసులు సీరియల్: సిద్ధూ-ప్రేరణ మధ్య మనస్పర్థలు! ఇందిర పెళ్లి చూపులకు వెళ్తుందా? సుధాకర్ షాక్!
Nindu Manasulu Serial Today Episode September 3rd ప్రేరణ తండ్రి కోసం గణ ఇంటికి రావడం, గణకి పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం, ఇందిర అక్కడే పని మనిషిగా ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ చదువుకుంటూ ఉంటే సిద్ధూ ఫ్రెండ్ కుమార్ కాల్ చేస్తాడు. కుమార్ ప్రేరణతో మేడం నేను కుమార్ సిద్ధూ ఫ్రెండ్ అని అనగానే ఆ గొంతు వింటే తెలుస్తుంది.. డబ్బా గొంతు.. ఏంటో చెప్పు అని అంటుంది. డబ్బా గొంతా అని కుమార్ అనుకుంటాడు. నేను అన్న దానికి మీరు ఫీలయ్యారు అని మా వాడు చాలా ఫీలవుతున్నాడు అని కుమార్ అంటాడు.
ప్రేరణ కుమార్‌తో అయితే ఇప్పుడు సారీ చెప్పడానికి కాల్ చేశావా అంటే లేదు మేడం నేను అన్నది నిజమే మీ ఇద్దరి జంట చాలా బాగుంటుంది అని నవ్వుకొని ఫోన్ సిద్ధూ చేతిలో పెట్టేస్తాడు. అటు ప్రేరణ ఇటు సిద్ధూ ఇద్దరూ షాక్ అయిపోతారు. అబ్బా అనుకొని సిద్ధూ మాట్లాడుతాడు. ప్రేరణ సిద్ధూతో ఏంటి తమాషాగా ఉందా.. నువ్వేంటో నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు అని ప్రేరణ అంటుంది. ఆ సన్నాసినే అలా అన్నాడు మేడం అని సిద్ధూ అంటే నీ గురించి తెలిసి కూడా నేను నీతో మాట్లాడుతున్నా చూడు నాకు బుద్ధి లేదు.. మా ఓనర్ దగ్గర ఇరికించావ్.. అప్పుడే నాకు నీ గొప్ప తనం అర్థమైంది అని అంటుంది. సిద్ధూ ఏం చెప్పాలి అనుకున్నా ప్రేరణ వినదు.. నేను నిన్ను నమ్మను ఫోన్ పెట్టేయ్ అంటుంది.
రేయ్ కుమారా నిన్ను వదలనురా అని సిద్ధూ అనుకుంటాడు. సిద్ధూ కోచింగ్కి రెడీ అయితే కుమార్ టిఫిన్ తినమంటాడు. నాకేం అవసరం లేదు నువ్వు చేసిన పెంటకి ఆ అమ్మాయికి సారీ చెప్పాలి అని సిద్ధూ అంటే దానికి కుమార్ రాత్రి జరిగిన దానికి ఆ అమ్మాయి నీ బైక్ ఎక్కుతుందా అని నాకు డౌట్‌గా ఉందని అంటాడు. సిద్ధూ కుమార్‌ని కొట్టానంటేనా ఇప్పటికే చేసింది చాలు ఇంకా ఎక్కువ చేయకు అని అంటాడు.
ఈశ్వరి పెళ్లి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పెళ్లి వాళ్లు వచ్చే టైం అయిపోతుంది.. గణ ఇంకా రెండీ అవుతున్నాడు.. గంగ (ఇందిర) ఇంకా రాలేదని అనుకుంటుంది. ఇంతలో సుధాకర్ వస్తాడు. ఏంటి మేడం ఇంకా ఏర్పాట్లు జరగలేదు.. అని అంటాడు. దానికి ఈశ్వరి తెచ్చావ్ కదా ఓ పని మనిషిని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తదు అని అంటుంది. నేను కనుక్కుంటా అని సుధాకర్ అంటాడు.
సుధాకర్ ఇందిరకు కాల్ చేసి భర్త కోసం పని మనిషిగా చేరడం కాదు.. టైంకి రావాలి.. ఇంకా ఎప్పటికి వస్తావే.. నువ్వు వచ్చే టైంకి పెళ్లి వాళ్లు వస్తే నీ సవతి నిన్ను తొక్కి నార తీస్తుందని అంటాడు. కంగారు పెట్టకురా వచ్చేస్తా అంటుంది.
సిద్ధూ ప్రేరణ కోసం ఇంటి బయట నిల్చొంటాడు. లోపలికి వెళ్లాలా వద్దా ఏంటి ఈ మిస్ అండర్ స్టాండ్ ఇంకా రాలేదు అని అనుకొని ఫోన్ చేస్తాడు. అప్పటికే ప్రేరణ ఆటోలో ఉంటుంది. ప్రేరణ చూసి వీడికి ఇప్పుడు ఆన్సర్ చేస్తే నస పెడతాడు ఫోన్ లిప్ట్ చేయకూడదు అనుకుంటుంది. సిద్ధూ మేడం ఉందా లేదా ఎలా తెలుస్తుంది అని అనుకుంటాడు.
ఇందిర బయటకు వెళ్తుంటే ఐశ్వర్య ఎదురవుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ మళ్లీ కూరగాయాలా.. సరుకులా అంటుంది. ఇందిర ఫ్లోలో పెళ్లి చూపులు అంటుంది. ఎవరి పెళ్లి చూపులు అని ఐశ్వర్య అడిగితే మీ మామయ్య సుధాకి పెళ్లి చూపులు అంటుంది. జీవిత కాలం లేటు అయింది ఇప్పుడు పెళ్లి చూపులేంటి అని ఐశ్వర్య అంటుంది. ఇక పార్క్‌లో పెళ్లి చూపులు అని చెప్పి ఐశ్వర్య అంటుంది. ఇందిర ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని బయటకు వెళ్తుంది.. ఐశ్వర్య తల్లి తన దగ్గర ఏదో దాస్తుందని అనుకుంటుంది.
ఇందిర బయటకు వచ్చే సరికి సిద్ధూ ఉంటాడు. సిద్ధూని గుర్తు పట్టి మాట్లాడుతుంది. ప్రేరణ గురించి సిద్ధూ అడిగితే కోచింగ్‌కి వెళ్లిపోయిందని చెప్తుంది. ఇక తనని డ్రాప్ చేయమని అడుగుతుంది. సరే అంటాడు సిద్ధూ. ఇక ఈశ్వరి కాల్ చేసి కొబ్బరికాయ తీసుకురమ్మని గంగ అలియాస్ ఇందిరకు కాల్ చేసి చెప్తుంది. మేడం హర్ట్ అయిందని సిద్ధూ అనుకుంటాడు.
పెళ్లి వాళ్లు ఈశ్వరి ఇంటికి వస్తారు. ఈశ్వరి మంచి నీరు తీసుకురమ్మని సుధాకి చెప్తుంది. నేను తేవాలా అని సుధా అంటే ఆ గంగని నువ్వు తెచ్చావ్ కదా అంటుంది. సుధా నీరు తీసుకొచ్చి ఇస్తాడు. గణ వస్తాడు. పెళ్లి వాళ్లు బాబు మీ ఏరియా ఎక్కడ ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు అని అడిగితే రోడ్డు మీద అని సుధా అంటాడు. ఈశ్వరి కోపంగా చూస్తుంది. ఇక తర్వాత గాంధీనగర్ పీఎస్ అని చెప్తుంది. అందరికీ టిఫెన్స్ తీసుకురమ్మని అంటే ఇందిర కోసం ఈశ్వరి అడిగితే సుధాకర్ కాల్ చేస్తాడు. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ప్రమాదం అని ఇందిర ఫోన్ కట్ చేస్తుంది. సిద్ధూ, ఇందిర ప్రేరణ గురించి మాట్లాడుతారు.
ప్రేరణని మీరు చాలా గారాభం చేసినట్లు ఉన్నారు. ఎదుటి వాళ్లని పిండేస్తుందని అంటాడు. నేను కాదు బాబు వాళ్ల నాన్న గారు గారాబం చేశారని ఇందిర అంటుంది. దాంతో సిద్ధూ ఆంటీ అంకుల్ కనిపించడం లేదని అంటే ఆయన వైజాగ్‌లో ఉంటారని బాధ పడుతూ చెప్తుంది. ఇక బైక్ ట్రబుల్ ఇస్తుంది. మరోవైపు సుధా ఆటో సౌండ్ విని అక్క వచ్చేసింది అనుకుంటే ప్రేరణ ఎంట్రీ ఇస్తుంది. సుధాకర్ షాక్ అయిపోతాడు. వెళ్లిపోవే అని బతిమాలుతాడు. ప్రేరణ వెళ్లను అంటే వెళ్లను అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















