Nindu Manasulu Serial Today September 2nd: నిండు మనసులు సీరియల్: సిద్ధూ జీవితంలో ప్రేరణ తుఫాను: రహస్యాలు, అనుమానాలు! విజయ్‌కి కొత్త బెంగ!
Nindu Manasulu Serial Today Episode September 2nd ప్రేరణ సిద్ధూ జీవితంలోకి వచ్చిందని సిద్ధూ జీవితం మారిపోతుంది మనకు దగ్గర అయిపోతాడని సాహితి తల్లికి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూని తీసుకొని వచ్చే సరికి నైట్ అయిపోతుంది. ఇద్దరూ బైక్ మీద వస్తుంటే ప్రేరణ సైలెంట్ చూసి ఎవరి గురించో ధీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని సిద్ధూ అడిగితే ప్రేరణ నీ గురించే అని చెప్తుంది. సిద్ధూ సడెన్‌గా బైక్ ఆపేసి నా గురించి ఏంటి అండీ అని అడుగుతాడు.
ప్రేరణ: నువ్వేంటో నీ చరిత్ర ఏంటో మొత్తం తెలిసిపోయింది. చెప్తే నువ్వే షాక్ అయిపోతావ్.
సిద్ధూ: పర్లేదు తట్టుకుంటా చెప్పండి.
ప్రేరణ: నీకు ఒక అమ్మానాన్న చెల్లి. మీ నాన్నకి నీ మీద ఆశలు ఎక్కువ. మీ అమ్మకి నీ మీద ప్రేమ ఎక్కువ. నీకు మీ చెల్లికి అటాచ్ మెంట్ ఎక్కువ. అమ్మానాన్నలు నిన్ను కష్టపడి చదివిస్తే నువ్వు ఏమో అవేమీ పట్టించుకోకుండా తింటూ తిరుగుతూ పెరుగుతున్నావ్... పెరుగుతున్నావ్...పెరుగుతూనే ఉన్నావ్.
సిద్ధూ: పెరిగింది చాలండీ ఇప్పటికే 6.3 ఉన్నాను.
ప్రేరణ: హే ఆగు.. నా ఫ్లో ఆపకు. మొత్తానికి ఒక జులాయిలా పెరిగావ్.. వాళ్లు అన్ని ఆశలు పెట్టుకుంటే నువ్వు మాత్రం లవర్స్‌ని కలుపుతా పెళ్లి చేస్తా అంటూ రోడ్ల మీద తిరుగుతున్నావ్. ఒకరోజు నువ్వు చేసిన పనికి నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ కోపంతో మీ నాన్న ఇంటి నుంచి పోరా అని అనడంతో నీకు గతిలేక ఆ పొట్టోడి ఇంట్లో తలదాచుకుంటూ బైక్‌లు నడుపుతున్నావ్. కానీ నాకు ఒకటే అర్థం కావడం లేదు. ఇంత జులాయ్‌వి కదా.. రోడ్ సైడ్ రోమియోవి కదా.. మరి నువ్వు సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వడం ఏంటి.. మెయిన్స్‌కి రావడం ఏంటి. ఇదే సింక్ అవ్వడం లేదు.
సిద్దూ: ఏం టాలెంట్ అండీ బాబు. మా చెల్లిని ఇలా చూడగా అలా నా గురించి మొత్తం చెప్పేశారు. గ్రేట్ అండీ..
ప్రేరణ: అయ్యయ్యో టైం అయిపోయింది. నిమిషం లేటు అయినా మా ఓనర్ చండశాసనుడిలా బయటే ఉంచేస్తారు. పద పద..
ప్రేరణ, సిద్ధూ ఇంటికి వెళ్లే టైంకి రంజిత్ గేట్ వేస్తుంటాడు. ప్రేరణ చూసి షాక్ అయిపోతుంది. సిద్ధూతో ఓనర్ ఇక్కడే ఉన్నాడు గేటు కూడా వేసేస్తున్నాడు.. ఆయన గురించి నీకు తెలీదు వెళ్లిపో అని చెప్పి సిద్ధూకి డబ్బులు ఇస్తుంది. సిద్ధూ వెంటనే డబ్బులు ఇస్తారేంటి మన మధ్య రుణ బంధం ఉంది కదా అని అంటాడు. నీకు దండం పెడతా వెళ్లిపో అని అంటుంది. సిద్ధూ మనసులో అమ్మగారికి ఓనర్ అంటే వణుకు అన్నమాట అనుకుంటాడు. ప్రేరణని ఇరికించాలని అనుకుంటాడు. అతను ఎవరు అని రంజిత్ అడిగితే సిద్ధూ కొలిగ్ అంటాడు. ప్రేరణ బైక్ డ్రైవర్ అంటుంది. తర్వాత సిద్ధూ బైక్ డ్రైవర్ అంటే ప్రేరణ కొలిగ్ అంటుంది. ఒకరి ముఖం ఒకరు చూసుకొని కోచింగ్ కొలిగ్ అని చెప్తారు. ప్రేరణ సిద్ధూని వెళ్లిపోమని బతిమాలుతుంది కానీ సిద్ధూ వెళ్లడు.

ప్రేరణని ఇరికించాలని సార్ మీరు చూస్తే నిజం చెప్పాలి అనిపిస్తుంది. మేం కాఫీ తాగి వచ్చాం సార్ మీ ఓనర్ లేటుగా వస్తే ఊరుకోరు కదా అంటే అంత సీన్ లేదు అంది అని ఇరికిస్తాడు. ప్రేరణ మనసులో ఇలా ఇరికించేశాడు చచ్చినోడు అని తిట్టుకుంటాడు. ప్రేరణ రంజిత్‌కి సారీ చెప్తుంది. రంజిత్ ప్రేరణతో ఆడపిల్లలు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇది మీ ఊరు కాదు సిటీ టైం ఎప్పుడూ మనది కాదు.. లేటుగా వస్తే ఒప్పుకునే ఓపిక లేదు అర్థమైందా వెళ్లు అని అంటారు. ప్రేరణ వెళ్లిపోతుంది. రంజిత్ గేటు తాళం వేస్తాడు.

ఐశ్వర్య ప్రేరణతో అక్క నేను ఈ రోజు ఓ సీక్రెట్ కనిపెట్టా.. మన ఓనర్ మనం అనుకున్నంత మంచోడు కాదు అక్క.. ఆయన వెనక ఓ పెద్ద గతం ఉంది అక్క. విశ్వనాథం ఇంటికి ఫ్రూట్స్ తీసుకొని రంజిత్ వెళ్లాడని ఫ్రూట్స్ విసిరేశారని ఐశ్వర్య చెప్తుంది. ప్రేరణ మొత్తం ఆలోచించి అతనికి విశ్వనాథం గారికి సంబంధం ఏంటి అనుకుంటుంది. ఇదంతా నీకు ఎలా తెలుసు అని ప్రేరణ అడిగితే అతని కారు ఎక్కినట్లు ఐశ్వర్య మొత్తం చెప్తుంది. ప్రేరణ షాక్ అయి నీకు బుద్ధి లేదా అతని విషయాల్లో నువ్వు ఎందుకు దూరుతున్నావ్ అని తిడుతుంది. ఇంకో సారి అతని విషయాల్లో దూరొద్దని చెప్తుంది. 
విజయానంద్ ఫైల్స్ చెక్ చేస్తుంటే మంజుల సాహితి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో సాహితి ఇంటికి వస్తుంది. సాహితి అమ్మతో అన్నయ్యను కలిశాను కాఫీ తాగి వస్తున్నా అన్నయ్యా చాలా కొత్తగా కనిపించాడని చెప్తూ ఉంటుంది. మంజుల హ్యాపీగా ఫీలవుతుంది. విజయ్ మాత్రం ఏమైందా అనుకుంటాడు. ఎప్పుడూ లేని అంత కొత్తగా కనిపించాడని నవ్వుతూ సరదాగా ఉన్నాడని జోకులు వేస్తున్నాడని.. అమ్మాయిలు అంటే ఆమడ దూరంలో ఉన్న అన్నయ్య ఓ అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడని ఆ అమ్మాయి అన్నయ్య కొలిగ్ అని కలిసి కోచింగ్ తీసుకుంటున్నారని చెప్తుంది. ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ అన్నయ్యతో కలిసి ఉండేలా ఉందని అంటుంది. విజయ్ షాక్ అయితే మంజుల చాలా చాలా సంతోషిస్తుంది. అమ్మాయి ఎలా ఉంది అని మంజుల అడిగితే చాలా చాలా బాగుందని సాహితి చెప్తుంది. ఆ అమ్మాయి వల్ల అన్నయ్యలో మార్పు వస్తుందని మనల్ని అన్నయ్యకి దగ్గర చేస్తుందని అంటుంది. మంజుల చాలా హ్యాపీగా ఉంటుంది. 
మంజుల సంతోషం చూసి విజయానంద్ రగిలిపోతాడు. నాకు నచ్చలేదు విశ్వాసం మీ అమ్మగారు కొడుకు తిరిగి వస్తాడని సంతోషపడటం మంచిది కాదు.. వాడు అమ్మాయితో తిరగడం మంచిది కాదు ఎవరికీ మంచిది కాదు బాగా ఆలోచించాలని అనుకుంటాడు. సిద్ధూ ఇంటికి వస్తే ప్రేరణ గురించి కుమార్ అడుగుతాడు. నీ వల్ల ఆ అమ్మాయి నన్ను చెడుగుడు ఆడేసింది నీతో నేనే అలా చెప్పించానని అన్నానని అంటోదని అంటాడు. ఇప్పుడే ఆ అమ్మాయికి కాల్ చేసి సారీ చెప్తానని కుమార్ అంటాడు. సిద్ధూ వద్దంటాడు. అయినా కుమార్ ప్రేరణకి కాల్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 





















