Nindu Manasulu Serial Today August 30th: నిండు మనసులు సీరియల్: ప్రేరణ-సిద్ధూ మధ్య ఏం జరుగుతోంది? గణ పెళ్లి చూపులు, ఐశ్వర్యని ఇరికించేసిన రంజిత్!
Nindu Manasulu Serial Today Episode August 30th సిద్ధూ, ప్రేరణతో నన్ను ప్రేమించకపోతే నా మీద నీకు ఏం ఫీలింగ్స్ లేకపోతే నాతో బైక్ మీద రా అని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode బుక్ ఇవ్వడానికి సిద్ధూ ప్రేరణని తన ఇంటికి తీసుకెళ్తాడు. గదిలో కుమార్ టవల్ చుట్టుకొని చిందులు వేస్తూ ఉంటాడు. సిద్ధూ కుమార్‌ని తిడుతాడు. ఇక కుమార్ అయితే మీ ఇద్దరూ కలిసిపోయారా.. లవర్స్ అయిపోయారా.. అందుకే ఇద్దరూ ప్రేమగా జంటగా ఇంటి వరకు వచ్చారు అని అంటాడు.
ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ కుమార్‌ని వాయించేస్తారు. మరి ఇద్దరూ కలిసి ఒకే బైక్ మీద ఇంటి వరకు వచ్చారని కుమార్ అడుగుతాడు. దానికి ప్రేరణ ఈ మహానుభావుడు నేను చదవాల్సిన బుక్ ఇంట్లో పెట్టేశాడు దాని కోసం వచ్చానని అంటుంది. దానికి కుమార్ సారీ మేడం ఎప్పుడూ మీరు మిస్ అండర్ స్టాండ్ చేసుకుంటారు ఈసారి నేను చేసుకున్నా అంటాడు. నా బుక్ నాకు ఇస్తే నేను వెళ్లిపోతా అని ప్రేరణ అంటుంది. సిద్ధూ బుక్ ఇస్తే ప్రేరణ బయటకు వెళ్తుంది. కుమార్ సిద్ధూతో నిజంగానే ఇద్దరి మధ్య ఏం లేదా అని అడిగితే సిద్ధూ ఒక్కటిస్తాడు.
ఈశ్వరికి పంతులు ఫోన్ చేసి గణకి ఓ మంచి సంబంధం వచ్చిందని అంటాడు. అమ్మాయి తరఫు వాళ్లు ఇంటికి వస్తున్నారని చెప్తాడు. ఈశ్వరి సరే అంటుంది. ఇక ఈశ్వరి ఇందిరతో రేపు గణని చూసుకోవడానికి పెళ్లి వాళ్లు వస్తారు. అన్నీ చూసుకోవాలి త్వరగా రా అని మాట్లాడుతుంటుంది. గణ వచ్చి ఈవిడ ఎవరు ఇందిర కంగారు పడుతుంది. ఈశ్వరి పని మనిషి అని చెప్తుంది. ఈవిడ ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో అన్నీ తెలుసుకున్నావా ఆధార్ కార్డు ఫ్రూప్ తీసుకో అని కంగారు పెట్టేస్తాడు. ఈశ్వరి ఎందుకు అలా భయపెట్టేస్తావురా అని అంటుంది. ఇక గణతో పెళ్లి చూపులు అని చెప్తుంది. నువ్వు ఎలాగూ ఎక్కువ టైం ఇవ్వవు కాబట్టి వాళ్లనే మన ఇంటికి రమ్మని చెప్పానని అంటుంది.
ప్రేరణ బయట ఆటో కోసం వెయిట్ చేస్తుంటే సిద్ధూ బైక్ తీసుకొచ్చి డ్రాప్ చేస్తా అంటాడు. తన ఫ్రెండ్ మాటలు పట్టించుకోవద్దని అంటాడు. అవన్నీ నీ మాటలే నువ్వే తనతో అనిపించావని ప్రేరణ అంటుంది. నీ మనసులో అలా ఉంది అందుకే నీ ఫ్రెండ్‌తో అనిపించావ్ అంటాడు. దానికి సిద్ధూ అంత లేదమ్మా ఉంటే నీ మనసులో ఉంటుంది అంటే ప్రేరణ నవ్వి ఛీ అంత సీన్ లేదు అంటుంది. నా మీద ఏ అభిప్రాయం లేకపోతే వచ్చి నా బైక్ ఎక్కు లేదంటే మీ మనసులో ఏదో ఉందని నేను అనుకుంటానని అంటాడు. నేను ఎక్కను అని ప్రేరణ అంటే అయితే మీ మీద మీకు నమ్మకం లేదు.. నా ఫ్రెండ్ గాడితో ఆ అమ్మాయికి నా మీద ఏదో ఉందిరా అని వెళ్లి చెప్తానని అంటాడు. దాంతో ప్రేరణ సిద్ధూ బైక్ ఎక్కుతానని అంటుంది.
ఇందిర ఇంటికి వెళ్తుంది. చిన్న కూతురు ఉందేమో అని టెన్షన్‌గా వెళ్తుంది. ఇంతలో ఐశ్వర్య వచ్చి అమ్మ ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతుంది. కూరగాయలు అదీ ఇదీ అని చెప్పి ఇందిర తప్పించుకోవాలి అనుకుంటే ఎక్కడికి వెళ్లావో చెప్పు అని అడుగుతుంది. నువ్వు కూడా వెళ్లావ్ కదా ఎక్కడికి వెళ్లావ్ అని అంటుంది. తను ఎక్కడికి వెళ్లిందో అడగండి అంటూ రంజిత్ అంటాడు. ఐశ్వర్య ఇప్పుడే వచ్చిందని అంటాడు. ఇందిర ప్రశ్నిస్తుంది. ఇరికించేశాడు దుర్మార్గుడు అని ఐశ్వర్య మనసులో అనుకుంటుంది. డబ్బులు లేకుండా వెళ్లిందని నడిచి వచ్చిందని రంజిత్ చెప్తాడు. కారులో వెళ్లానని ఐశ్వర్య అంటే ఎవరి కారు అని ఇందిర అడుగుతుంది. ఇందిర వాయించేస్తుంది. ఎక్కడికి వెళ్లావో చెప్పవే అని ఇందిర అంటుంది. ఐశ్వర్య మనసులో నీకు చెప్పలేను వాడిని ఆపలేను అనుకుంటుంది. రంజిత్‌ని చూసి మనసులో ఓరేయ్ ఓనర్‌గా నా పాపం నీకు కచ్చితంగా చుట్టుకుంటుందిరా ఓనర్‌గా అనుకుంటుంది. ప్రేరణ, సిద్ధూ వెళ్తుంటే సాహితి చూస్తుంది. సిద్ధూ చెల్లిని చూసి బండి ఆపుతాడు. అన్నని చూసి సాహితి బుంగ మూతి పెట్టుకుంటుంది. కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు వీడియో కాల్ లిఫ్ట్ చేయలేదు అసలు ఏం అనుకుంటున్నావ్ నా గురించి అని సాహితి అడుగుతుంది. ఇక ప్రేరణని చూసి ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















