Nindu Noorella Saavasam Serial Today August 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: వార్డెన్‌ను చంపబోయిన మను – గణపతి పూజ ఎలాగైనా ఆపాలన్న చంభా
Nindu Noorella Saavasam serial Today Episode August 30th: షాపింగ్ మాల్ షెల్లార్ కింద సరస్వతి వార్డెన్‌ను చంపబోతుంది మను. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్, భాగీకి శారీ తీసుకుంటున్నాడని తెలిసి మనోహరి ఇరిటేటింగ్‌గా ఫీలవుతూ అమర్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడే అమర్‌కు నిజం చెప్పడానికి వెళ్తున్న సరస్వతి వార్డెన్ మనోహరి చూసి భయంగా పక్కకు వెళ్లి దాక్కుంటుంది. ఇంతలో మను మెల్లగా అమర్ ను చూస్తూ ఏమీ తెలియనట్టు నటిస్తూ..
మను: వెరీ నైస్ శారీ అమర్ చాలా బాగుంది. ఎవరికి సెలెక్ట్ చేస్తున్నావు అమర్ ఈ శారీ
అమర్: భాగీ కోసం తీసుకుంటున్నాను.
మనోహరి: అమర్ నాకు కూడా ఒక శారీ సెలెక్ట్ చేయోచ్చు కదా..?
అమర్: నీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు మనోహరి.. నువ్వు సెలెక్ట్ చేసుకో నేను బిల్ పే చేస్తాను.
అంజు: డాడ్ మాకోసం మిస్సమ్మ మంచి మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసింది తెలుసా..?
అమర్: మీకు నచ్చాయా..?
అంజు: చాలా బాగా నచ్చాయి డాడ్.. ఇంతకీ ఈ శారీ ఎవరి కోసం సెలెక్ట్ చేస్తున్నారు.. మనోహరి ఆంటీ కోసమా..?
అమర్: కాదు నాన్న భాగీకి
అంజు: అవునా.. సరే ఓకే డాడ్
మనోహరి: ( మనసులో) చిన్న పిల్ల ముందు కూడా నన్ను అవమానిస్తున్నాడు. ఏ ఆ శారీ నాకే అని చెప్తే తన సొమ్మేం పోతుంది. నేను తీసుకుంటే తను డబ్బులు పే చేస్తాడు అంట.. నా దగ్గర డబ్బులు లేవా..?
మనోహరి బాధపడుతుంది. చంభా, ఆరు కోసం షాపింగ్ మాల్ లో వెతుకుతూ ఉంటుంది. భాగీని పిల్లుల ఏవేవో బట్టలు తీసుకోమని చెప్తుంటారు. ఇంతలో అంజు వస్తుంది.
అంజు: ఆగండి.. మిస్సమ్మకు ఎవ్వరూ శారీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు.
భాగీ: ఏ అంజు నువ్వు సెలెక్ట్ చేస్తావా..?
అంజు: అయ్యో మిస్సమ్మ నేను కాదు పైన డాడ్ నీకోసం శారీ సెలెక్ట్ చేశారు.
ఆకాష్: నిజమా అంజు
అమ్ము: అప్పట్లో డాడీ.. మమ్మీకి శారీ సెలెక్ట్ చేసేవారు. ఇప్పుడు మిస్సమ్మకు సెలెక్ట్ చేస్తున్నారన్న మాట
అంజు: అవును ఆ విషయం మీకు చెబుదామనే పరుగెత్తుకుంటూ వచ్చాను.
భాగీ: పో అంజు నువ్వు నాకు అబద్దం చెప్తున్నావు. నన్ను ఆట పట్టించాలని చూస్తున్నావు.
అంజు: అయ్యో మిస్సమ్మ నీ మీద ఒట్టు
అనగానే భాగీ ఏదేదో ఊహించుకుంటూ సిగ్గుపడుతుంది. పిల్లలు భాగీని ఆట పట్టిస్తుంటారు. ఇక వార్డెన్ సరస్వతి అమర్ కోసం చాలా సేపు వెయిట్ చేసి మనోహరి వెళ్లడం లేదని నిర్దారించుకుని అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతుంది. అక్కడి స్టాప్‌తో అడిగి పేపర్ పెన్ను తీసుకుని లెటర్ రాసి అమర్‌కు ఇవ్వమని అక్కడి స్టాప్‌కు ఇచ్చి వెళ్లిపోతుంది. ఆ లెటర్ అమర్‌కు ఇవ్వబోతున్న స్టాప్ ను ఆపి తాను తీసుకుంటుంది మనోహరి. లెటర్ చూసి షాక్ అవుతుంది. వెంటనే లిఫ్ట్ దగ్గరకు పరుగెడుతుంది.
చిత్ర: ఏంటి మను బావగారి చేత ఎన్ని శారీస్ కొనిచ్చుకున్నావు.
మను: శారీస్ కాదే వార్డెన్ ఇక్కడికి వచ్చింది.
చిత్ర: సరస్వతి వార్డెన్ ఇక్కడికి వచ్చారా..? పిల్లలకు బట్టలు కొనడానికి రాజు గారు వస్తారనుకుంటే వార్డెన్ వచ్చిందా..?
మను: అదొచ్చింది పిల్లలకు బట్టలు తీసుకోవడానికి కాదు. అమర్‌కు నా గురించి చెప్పడానికి.. అమర్‌ను కలవాలని ఈ స్లిప్ రాసి మీ స్టాప్ తో అమర్‌కు పంపించింది. లక్కీగా అది నా చేతుల్లో పడింది.
చిత్ర: ఇప్పుడు ఏం చేద్దాం మను
మను: సెల్లార్ లో వెయిట్ చేస్తానని చెప్పింది కదా అక్కడే దాన్ని చంపేస్తాను
అని ఆవేశంగా వెళ్లిపోతుంది. మనోహరిని చూసిన వార్డెన్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. తర్వాత అమర్ వాళ్లు ఇంట్లో గణపతి పూజ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంటారు. అది తెలికసిన చంభా ఎలాగైనా ఆ పూజను ఆపేయమని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















