Nindu Manasulu Serial Today September 1st: నిండు మనసులు సీరియల్: కాబోయే వదినని నానా తిట్లు తిట్టిన సాహితి.. చెల్లి, ప్రేరణల మధ్య ఇరుక్కున్న సిద్ధూ!
Nindu Manasulu Serial Today Episode September 1st సాహితి, సిద్ధూ, ప్రేరణ కలిసి కాఫీ తాగడం.. సాహితి ప్రేరణని తిట్టేయడం సిద్ధూ ఇరుక్కున్నా అని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ ప్రేరణని తీసుకొని బైక్ మీద వెళ్తుంటే షాపింగ్ పూర్తి చేసి వస్తున్న సాహితి అన్నని చూసి ఆపుతుంది. అన్న కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు.. మెసేజ్‌కి రిప్లే ఇవ్వలేదు అని బుంగ మూతి పెట్టుకుంటుంది.
సిద్ధూ: సాహితి నువ్వేంటి ఇక్కడ.
సాహితి: షాపింగ్‌కి వచ్చా అది సరే తను ఎవరు.
సిద్ధూ: తనా..
ప్రేరణ: ఎందుకు అంతలా ఆలోచిస్తావ్.. నేను అతని బైక్ బుక్ చేసుకున్న ప్యాసింజర్‌ని. ఆ విషయం చెప్పు.
సిద్ధూ: ఏవండీ అలా అంటారేంటండి..
సాహితి: ప్యాసింజరా తను.
సిద్ధూ: అంటే అది..
సాహితి: అసలు నువ్వు చేసిన పనికి నిన్ను పనీష్ చేయాలి. ఫోన్ ఎత్తడం లేదు నాతో మాట్లాడటం లేదు..
ప్రేరణ: మనసులో గురుడులో చాలా కలలు ఉన్నాయే. (సాహితి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటుంది.)
సిద్ధూ: సారీ చెప్పాను కాదా.
సాహితి: సారీ కాదు నాకు నీతో మాట్లాడాలి అని ఉంది. కాఫీ తాగాలి నీతో కలిసి తాగాలి అన్నయ్యా.. పద.
సిద్ధూ: అది కాదమ్మా వెనకాలే అమ్మాయి.
సాహితి: తను కూడా మనతో వస్తుందిలే.
ప్రేరణ: ఈయన మీ అన్నయ్యా.
సాహితి: మరి మీరు ఏమనుకున్నారు.
ప్రేరణ: ఏం లేదులే..

సాహితి: ( సిద్ధూ ప్రేరణని కాఫీకి పిలిస్తే ప్రేరణ రాను అని చెప్పేస్తుంది.) ఏవండీ రెండు రోజులు అయింది నేను మా అన్నయ్యని చూసి ఇప్పుడు కలిశాడు. మీరు ఒప్పుకుంటే కాసేపు నేను మా అన్నయ్యతో మాట్లాడుతా. ప్లీజ్ ఒప్పుకోండి. దొరికిపోయాన్‌రా అనుకుంటూ ప్రేరణ వస్తుంది. అన్నయ్యా ఎప్పుడూ అమ్మాయిలు అంటే అంత దూరం ఉండే నువ్వు ఈ అమ్మాయితో తిరుగుతున్నావ్ ఏంటి.
ప్రేరణ: హలో నేను ప్యాసింజర్‌ని చెప్పాకదా. ఇక సాహితి ప్రేరణ గురించి మాట్లాడితే ఆ టాపిక్ వద్దని సిద్ధూ అంటాడు. ఇంకేమైనా టాపిక్ మాట్లాడు అని సిద్ధూ అంటే అయితే ఇంటికి వచ్చేయ్ అని సాహితి అంటుంది. దానికి సిద్ధూ ఈ టాపిక్ అస్సలు వద్దు అని అంటాడు. అన్నయ్యా నీ కోచింగ్ ఎలా ఉంది.
సిద్ధూ: సూపర్.
సాహితి: అసలు మా అన్నయ్యకి ఆ సీట్ ఈజీగా వచ్చేసేది కానీ ఎవరో ఒకమ్మాయి పోటీకి వచ్చింది. ఎవరన్నయ్యా ఆ అమ్మాయి. అయినా తను ఎవరు అయితే నాకు ఏంటి గాలి గంగమ్మా అని అంటుంది.

సాహితి ప్రేరణనే ఆ అమ్మాయి అని తెలీక గాలి ముఖంది.. డొక్కు ముఖంది.. నిన్నూ నీ మెరిట్‌ని అంచనా వేయనిది రేపు సివిల్స్ ఎలా కొడుతుంది అన్నయ్యా అని సాహితి అనేస్తుంది. సిద్ధూ ఎంత టాపిక్ డైవర్ట్ చేయమని చెప్పినా సాహితి వినదు.. ఆ పూర్ గల్ ఏ ఇన్‌స్టిట్యూటలో చేరిందో ఏంటో నీతో పెట్టుకుంటే ఎవరైనా ఓడిపోవాల్సిందే ఎంత పొగరు దానికి అని తిట్టేస్తుంది. వద్దే సాహితి ప్లీజ్ ఇక్కడే ఉందే అని అనుకుంటాడు. ఇక ప్రేరణ అయితే ఇలా అనేస్తుందేంటి అని కోపంగా సిద్ధూని చూస్తుంది. మీరేం మాట్లాడటం లేదు అని సాహితి ప్రేరణని అంటే మీరు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు కదా.. నేను విశ్వనాథ్ గారి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నా అంటుంది. దాంతో సాహితి అంటే మీరు అంటే దానికి ప్రేరణ మీరు చెప్పిన ఆ పొగరుది.. డొక్కు ముఖంది.. నేనే అని అంటుంది. సారీ అని సాహితి బుంగ మూతి పెడుతుంది. సర్లే అన్నయ్య నేను వెళ్తాను నువ్వు బిల్ కట్టేసి వచ్చేయ్ అని వెళ్లిపోతుంది. ప్రేరణ కోపంగా నేను డొక్కు ముఖమా నాకు బుద్ధి లేదా అని అరుస్తుంది. వదిలేయండి అని సిద్ధూ అంటాడు.

ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ కోపంగా ఉంటే ఇంతలో అంకుశం.. పరాకుంశం అక్కడి వస్తాడు. ఇద్దరికీ పెయింటింగ్ కొనమని అంటే ఇద్దరూ ఒకేసారి లాగి పెట్టి కొడతారు. ఐశ్వర్య, ఇందిర ఇద్దరూ టిఫెన్ చేస్తారు. ఐశ్వర్య టిఫెన్ పట్టుకొని రంజిత్ దగ్గరకు వెళ్తుంది. ఏంటి లేటు అని రంజిత్ అడిగితే ఇదేం హోటల్ కాదు అని అంటుంది. ఇక సౌండ్ చేసుకుంటూ వడ్డిస్తే రంజిత్ మెల్లగా అంటాడు. దానికి ఐశ్వర్య సౌండ్ రాకుండా వడ్డించడం చప్పుడు లేకుండా అప్పడం తినడం నాకు రాదు అని అంటుంది. ఇద్దరూ గిల్లీ గజ్జాలు పడుతుంటారు. ఇక ఐశ్వర్య తన గురించి కంప్లైంట్ ఎందుకు ఇచ్చావ్ అని తిడుతుంది. నేను ఇచ్చానా అవునా అని రంజిత్ అంటే మర్చిపోయాడు సచ్చినోడు అని ఐశ్వర్య తిట్టుకుంటుంది. ఇక రంజిత్ నేను నా లిమిట్స్‌లో ఉంటాను నీ విషయాల్లో జోక్యం చేసుకోని అని అంటాడు.

ఇందిర రాగానే తనతో మీ అమ్మాయి లేటుగా వచ్చింది కదా అడిగారా అని మళ్లీ అంటాడు. ఐశ్వర్య మనసులో చచ్చినోడు నా విషయంలో దూరను అని మళ్లీ అంటించేశాడు అనుకుంటుంది. ఇందిర ఐశ్వర్యని ఫుల్‌గా తిడుతుంది. ఐశ్వర్య రంజిత్‌ని చూసి తిట్టుకుంటుంది. మరోవైపు ప్రేరణ సాహితి సిద్ధూని ఇంటికి వచ్చేయమని చెప్పడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధూతో నీ గురించి నాకు అంతా తెలిసిపోయింది అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.






















