అన్వేషించండి

Nindu Manasulu Serial Today May 13th: నిండు మనసులు: మామ కుటుంబాన్ని రంజిత్‌ కలుపుతాడా! ప్రేరణని ఎత్తుకొని సిద్ధూ ముడుపు కట్టిస్తాడా!

Nindu Manasulu Serial Today May 13th | రాజశేఖరం రంజిత్‌ని కలిసి ప్రేరణతో మాట్లాడించమని కోరడం అందరూ గుడికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode | రాజశేఖరం గుడికి వచ్చి ప్రేరణ పేరు మీద అర్చన చేయిస్తాడు. నా ఇద్దరు కూతుళ్లని దగ్గరకు తీసుకొని వాళ్లకి ఏం కష్టం రాకుండా చూసుకోవాలి.. నా భార్యకి తోడుగా ఉండాలి.. అంతకంటే ఏం కోరుకోను స్వామీ అని వేడుకుంటాడు. ఇంతలో ప్రేరణ వాళ్లు గుడికి వస్తారు. వాళ్లని చూసి రాజశేఖరం దాక్కుంటాడు. సిద్ధూ ప్రేరణ పేరు మీద అర్చన చేయమని అంటే ఇంతకు ముందే ఈ పేరు మీద అర్చన చేశాను అని చెప్తే ఇందిర చేయించుంటుందని అందరూ అనుకుంటారు.

సిద్ధూ తన తల్లి తనని కొడుకుగా అంగీకరించాలని తన తప్పు క్షమించాలి అని వేడుకుంటాడు. ఇక ప్రేరణ అయితే సిద్ధూ తనని భార్యగా అంగీకరించాలని వేడుకుంటుంది. పంతులు ప్రేరణ వాళ్లకి మీరు కొత్త జంటలా ఉన్నారు.. గుడి దగ్గర ఉన్నా చెట్టుకి ముడుపు కట్టి మనసులో కోరిక కోరుకుంటే కచ్చితంగా జరుగుతుందని అంటారు. ప్రేరణ తనకు ఓ కోరిక ఉందని ముడుపు కడతాను అని చెప్తుంది. ఒకసారి ముడుపు చేతిలోకి తీసుకొని కట్టడానికి బయల్దేరిన తర్వాత ఆ దేవుడు మీ కోరికకు పరీక్ష పెడతాడు. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలి.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చేతిలోని ముడుపు కింద పెట్టకూడదు అని పంతులు చెప్తారు. ఎంత కష్టం వచ్చినా నేను ఈ అవకాశం వదులుకోను అని ప్రేరణ అంటుంది. ఇంతలో ఇందిర గుడికి వస్తుంది. అమ్మా నువ్వు అక్క పుట్టిన రోజు అని వచ్చావా.. లేక మామూలుగా వచ్చావా అని అడుగుతుంది ఐశ్వర్య. దానికి ఇందిర నేను ఏం మర్చిపోయినా మీ అక్క పుట్టిన రోజుని మర్చిపోను.. తను మన కోసం పుట్టిన దేవత. తను నాకు తల్లీ, తండ్రీ, కొడుకు అన్నీ అయి చూసుకుందని తను లేకపోతే మనం లేం.. అని ఇందిర ఎమోషనల్ అయిపోతుంది. ఇక ప్రేరణ ఇందిర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. 

సిద్ధూ ఇందిరతో మీరు ఇప్పుడే వస్తే మరి ప్రేరణ పేరు మీద అర్చన చేయించింది ఎవరు అని అంటాడు. రంజిత్ ఫ్లాష్‌బ్యాక్‌లో రాజశేఖరం తనని కలిసి రేపు ప్రేరణ పుట్టిన రోజు తనతో సమయం గడపాలి అని ఉంది.. అందుకే రేపు తనని ఎలా అయినా కలిసేలా చేస్తావా.. ఈ మామయ్యకి ఈ చిన్న సాయం చేయలేవా అని రంజిత్‌ని అడుగుతాడు. అది గుర్తు చేసుకున్న రంజిత్ ఇదంతా మామయ్య పనే అని అనుకుంటాడు. గుడిలో మామయ్య ఉన్నాడు అని మొత్తం చూస్తే రాజశేఖరం కనిపిస్తాడు. సిద్ధూ వాళ్లతో ప్రేరణ పేరుతో చాలా మంది ఉంటారని అంటాడు. విశ్వాసం విజయానంద్‌ని గుడికి తీసుకొస్తాడు. ఇప్పుడు ఎందుకు అని విజయానంద్ అంటే మీ కోడలు గారు వచ్చినప్పటి నుంచి మీరు చాలా బాధ పడుతున్నారు సార్.. ఎక్కువ ఆలోచించి తాగేస్తున్నారు.. మీ ఆరోగ్యం బాగుంటే కదా నా జీతం జీవితం రెండూ బాగుంటాయ్.. అందుకే తీసుకొచ్చా అంటాడు. అంటే నేను ఉండను.. నీకు జీతం ఉండదు అని ఫిక్స్ అయిపోయావా అని విజయానంద్ అడిగితే మీ మనసు బాగుంటుందని విశ్వాసం అంటాడు.

విజయానంద్ వాళ్లు సిద్ధూ ప్రేరణ వాళ్లని చూస్తారు. వీళ్లకి ఈ గుడే దొరికిందా అని విజయానంద్ అంటాడు. ప్రేరణ ముడుపు కడతాను అని తల్లికి చెప్తుంది. ప్రేరణ బాధ పడితే చూడాలి అని నా మనసు కోరుకుంటుంది విశ్వాసం ఏదో ఒకటి చేయ్ అని విజయానంద్ అంటాడు. ప్రేరణ ముడుపు తీసుకురావడానికి వెళ్తుంది. ఐశ్వర్య రంజిత్‌తో మీకు ఏమైనా కోరిక ఉంటే మీరు కట్టండి ఓనర్‌గారు.. మీరు ముడుపు కట్టండి అని అంటుంది. నా గురించి ఆలోచించడానికి కూడా ఎవరూ లేనప్పుడు నాకు ఏం కోరికలు ఉంటాయ్ అని రంజిత్ అంటాడు. దానికి ఐశ్వర్య మీ గురించి ఆలోచించడానికి నేను ఉన్నాను కదా అంటుంది. ఏం అన్నావ్ అని రంజిత్ అడిగితే అదే మీతో పాటు నేను ఉన్నాను కదా అంటున్నాను అని కవర్ చేస్తుంది. 

ప్రేరణ ముడుపు తీసుకొచ్చి విజయానంద్ నిజస్వరూపం బయట పెట్టి తల్లీకొడుకుల్ని ఒకటి చేయ్.. భార్యగా సిద్ధూ నన్ను అంగీకరించేలా చేయ్ అని అనుకుంటుంది. ప్రేరణ ముడుపు కట్టడానికి వెళ్తే ప్రేరణ ముడుపు కట్టకుండా అడ్డుకోవడానికి విశ్వాసం ప్రేరణ కాలి కింద కొబ్బరి చిప్ప విసురుతాడు. దాంతో అది ప్రేరణ కాలికి తగిలి రక్తం వస్తుంది. అమ్మా అని ప్రేరణ అనగానే.. అందరూ అక్కడికి వెళ్తారు. ఇంతలో అక్కడికి విజయానంద్ వచ్చి నిన్ను చూస్తే జాలేస్తుందమ్మా ఏదో గట్టిగా కోరుకున్నావ్ నీ కోరిక నెరవేరకూడదనే ఇలా దేవుడు చేశాడు ఇప్పుడు ఎలా ముడుపు కడతావ్,, నా మాట వినేసి ఇంటికి పదండి అని అంటాడు. ముడుపు కట్టకుండా నేను ఇంటికి వెళ్లను అని ప్రేరణ అంటే నొల్చోడానికే ఇబ్బంది పడుతున్నావ్,. అక్కడి వరకు ఎలా వెళ్తావ్ అని విజయానంద్ అంటాడు. ప్రేరణ పంతానికి వెళ్తుంది కానీ నడవలేదు.. దాంతో విజయానంద్ నీ కోరిక నెరవేరదమ్మా.. నువ్వు వెళ్లలేవు అని అంటాడు. వెళ్తాను అని ప్రేరణ  బలవంతంగా నడుస్తుంటే సిద్ధూ ప్రేరణని ఎత్తుకుంటాడు. నీతో నేను ముడుపు కట్టిస్తా.. నీ కోరిక నెరవేరుతుంది అని ఎత్తుకొని తీసుకెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 13th: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
నువ్వులేక నేను లేను: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
Podarillu Serial Today August 13th:బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు
పొదరిల్లు: బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు
Gundeninda Gudigantalu August 13th:మనోజ్‌ రోహిణిని ఒక్కటి చేసిన బామ్మ...పార్లరమ్మ ఇంకా ఏదో దాచిపెడుతోందని బాలుకు అనుమానం
గుండెనిండా గుడిగంటలు:మనోజ్‌ రోహిణిని ఒక్కటి చేసిన బామ్మ...పార్లరమ్మ ఇంకా ఏదో దాచిపెడుతోందని బాలుకు అనుమానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget