అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today may 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: జంటల రొమాన్స్! బెడిసికొట్టిన వల్లీ ప్లాన్! నర్మదకు విషయం తెలిసిపోయిందా!

Illu Illalu Pillalu Serial Today Episode may 13th నర్మద వల్లీ, సుకన్యల దగ్గరకు వెళ్లి రాత్రి పాలలో ఏం కలపారని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode  వల్లీ సుకన్య దగ్గరకు వచ్చి మన ప్లాన్ వర్కౌట్ అయింది.. నన్ను ముద్దు పెట్టుకోబోయాడు అంటే.. సుకన్య వల్లీని తిడుతుంది. ముద్దు ఇచ్చాక నువ్వే సంక ఎక్కాలి.. నిద్ర  పోయాక ఎక్కుతా అంటే కుదరదు వెళ్లు అని వల్లీని గదిలోకి తోలుతుంది. ఇక నర్మద, ప్రేమలు మత్తులో సాగర్‌, ధీరజ్‌లతో కో అన్నదోయి కొండమీద కొక్కిరాయి.. రా అన్నదోయి పైట చాటు పావురాయి.. మావ అరే మావ కట్టేయ్ చుమ్మా.. అంటూ పెదరాయుడు సినిమాలో సాంగ్‌కి చిందులేస్తారు. వల్లీ, చందు కూడా డ్యాన్స్ వేస్తారు. తిరుపతి అయితే కన్యా కన్యా అంటూ సుకన్య వెంట పడతాడు. 

 ప్రేమ చేసిన బీభత్సానికి ధీరజ్ ఓ మూల వెళ్లి కూర్చొంటాడు. తిరుపతి ధీరజ్‌ని సునక్యా అనుకొని ముసుగు వేసి ముద్దు పెట్టుకోబోతే మామ నువ్వేంటి ఇలా తయారయ్యావ్ అని అడుగుతాడు. మీ లాంటి లేత ప్రేమికులకు ప్రైవసీ ఇవ్వరా.. నన్ను సన్యాసుల్లోకి చేర్చేవరకు మీరు నిద్రపోరురా అని తిరుపతి వెళ్లిపోతాడు. 

భాగ్యం మల్లెపూలు పెట్టుకొని రెడీ అయితే ఇడ్లీబాబాయ్ చిందులేస్తూ సుకన్య అక్కడ ప్లాన్ వేసింది.. మన అమ్మడుకి లేని కడుపు ఈసారి వచ్చేస్తుంది.. అని డ్యాన్స్ చేస్తాడు. ఉదయం సుకన్య స్వీట్ చేస్తూ రాత్రి జరిగిన గుడ్‌న్యూస్ వల్లి వచ్చి నాతో చెప్పుకుంటుంది. అందుకే నేను ఈ స్వీట్ చేసుకుంటా అని స్వీట్ చేస్తూ రీల్స్ చేస్తుంది. వల్లీ చందులను కలపడానికి పాలలో మూలికల పౌడర్ కలిపాను ఫ్రెండ్స్ అందుకే పదనిసలు చేశారు అని అంటుంది. అప్పుడే నర్మద తల పట్టుకొని అటు వస్తుంది. సుకన్యని అనుమానంగా చూస్తుంది. సుకన్య మాత్రం ఏం తెలీనట్లు పాయసం చేస్తుంటుంది. పాయసం ఎవరికీ ఇప్పుడు పాయసం ఎందుకు అని నర్మద అడిగితే వల్లీ కడుపు పండబోతుంది కదా అని సుకన్య నోరు జారిపోతుంది. వల్లీ ఆల్రెడీ ప్రెగ్నెంట్ కదా మళ్లీ అలా అన్నావ్ ఏంటి అని నర్మద అడిగితే అదే వల్లీ ప్రెగ్నెంట్ కదా స్వీట్ పెడితే వాళ్ల మనసు నిండిపోతుంది అని అంటుంది. 

నర్మద సుకన్యని చూసి ఏంటి ఏదో తేడా కొడుతుంది అని అనుకుంటుంది. వల్లీ బెడ్ మీద చిరాకుగా కూర్చొని ఉంటుంది. సుకన్య సంతోషంగా స్వీట్ పట్టుకొని వెళ్లి స్వీట్ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్తుంది. వల్లి నెత్త మీద చేయి వేసుకొని కూర్చొవడం చూసి సుకన్య తిడుతుంది. నా మేనత్త కూతురువి అని నీకు సాయం చేశా.. మరి నాకు సన్మానాలు చేయకు.. ఈ సుక్కు వేసిన ప్లాన్‌కి నెల తిరక్కుండానే నువ్వు నెల తప్పుతావు కదా.. ఈ స్వీట్ తిను అని సుకన్య అంటుంది. ఓసేయ్ నేను నెత్తి మీద చేయి వేసుకున్నా నీకు ఏం అర్థం కాలేదా.. నేను నెల తప్పడానికి రాత్రి ఏం జరగలేదే.. ఆయన ఫుల్లుగా గుర్రు పెట్టుకొని పడుకున్నారు అని చెప్తుంది. మా ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నారు అని చెప్పడానికి ఆరాటంతో నీ దగ్గరకు వచ్చా.. మళ్లీ వెళ్లేలోపు పడుకున్నాడు.. నీ దగ్గరకు రాకుండా ఉండాల్సింది అని వల్లీ అంటుంది. పాలలో మందు ఎక్కువ కలిపేశానా ఏంటి అని సుకన్య అంటుంది. మందు ఏంటి.. రాత్రి పాలలో ఏం కలిపావ్ అని నర్మద వచ్చి అడుగుతుంది. నేను ఏం కలపడం ఏంటి.. ఏం మాట్లాడుతున్నావ్ అని సుకన్య అంటుంది. నిజం చెప్పకపోతే లాగిపెట్టి ఒక్కటిస్తా.. మీ ఇద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను అని నర్మద చెప్తుంది. మొగుడు పెళ్లాలని ఒకటి చేయాలని చిన్న మందు కలిపాను.. కానీ అది బెడిసి కొట్టి ఎగిరి తన్నేసింది.. అని సుకన్య అంటుంది. 

వల్లీ ప్రెగ్నెంట్ కదా మళ్లీ ఇద్దరినీ కలపడం ఏంటి.. అని నర్మద అంటే వల్లీని చందు అన్న తీసుకొచ్చాడు కానీ అస్సలు పట్టించుకోవడం లేదు.. అందుకే తనువులు కలిస్తే మనసులు ఒక్కటవుతాయని సుకన్య అంటుంది. దానికి వల్లీ అవును చెల్లాయ్.. మీ బావగారు నాతో సరిగా ఉండటం లేదు.. ఇలా అయినా నన్ను దగ్గరకు తీసుకుంటారని మేం సంతోషంగా ఉంటామని ఇలా చేశా అంటుంది. నర్మద ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. ఇక ప్రేమ గదిలోకి వెళ్తే ధీరజ్ అడ్డుకుంటాడు.

ఎందుకురా నన్ను అడ్డుకుంటున్నావ్ అని అంటే నువ్వు గదిలోకి వస్తావ్., ధీరజ్ రారా అని పిలిచి నా చేయి పట్టుకొని నన్ను హగ్ చేసుకొని ఇలా పట్టుకుంటావ్.. తర్వాత బెడ్ మీదకు లాగుతావ్ అని యాక్షన్ చేసి చెప్తాడు. రేయ్ ఏంట్రా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావ్ అని ప్రేమ అంటుంది. ఇవన్నీ నా విషయంలో నువ్వు రాత్రి చేసినవి.. అని చెప్తాడు. అమాయకురాలి మీద నిందలు వేయకురా అని ప్రేమ అంటే ధీరజ్ ప్రేమని దగ్గరకు తీసుకొని అమాయకురాలివా నువ్వు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని రెచ్చగొట్టి తన్నులు తిన్న సీఐ! అంబిక కుట్రకు విహారి బలైపోతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని రెచ్చగొట్టి తన్నులు తిన్న సీఐ! అంబిక కుట్రకు విహారి బలైపోతాడా!
Godavari Serial Today July 29th: 'గోదావరి' సీరియల్: మోసగాడు అంటే ఓకేనా? ఫార్మా కంపెనీతో సింహాద్రి సీక్రెట్‌ డీల్.. చివరి నిమిషంలో ట్విస్ట్‌!
'గోదావరి' సీరియల్: మోసగాడు అంటే ఓకేనా? ఫార్మా కంపెనీతో సింహాద్రి సీక్రెట్‌ డీల్.. చివరి నిమిషంలో ట్విస్ట్‌!
Nindu Manasulu Serial Today July 29th: నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
Karthika Deepam 2 Serial Today July 29th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget