అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today May 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిచ్చి పట్టిన అమర్‌ - అయోమయంలో పిల్లలు, భాగీ  

Nindu Noorella Saavasam Serial Today Episode May 13th: గతం గుర్తుకు రాక అమర్‌ పిచ్చిపట్టినట్టు బిహేవ్‌ చేస్తాడు. దీంతో భాగీ, పిల్లలు అయోమయంగా చూస్తుంటారు  

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌కు గతం గుర్తు చేసేందుకు భాగీ ప్రయత్నిస్తుందని తెలియడంతో మనోహరి కోపంగా బయటకు వస్తుంది. దీంతో నిండునూరేళ్లసావాసం ఇవాళ కొత్త మలుపు తీసుకోనుంది.

అందరూ భోజనం చేస్తుంటే.. అమర్‌ విచిత్రంగా చూస్తుంటాడు. ఏమీ అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ.. ఉంటే భాగీ మాత్రం భోజనం వడ్డిస్తూ.. తినండి అంటుంది.

అమర్‌: మీరెవరు..? నాకు ఏమవుతారు..? ఈ పిల్లలందరూ ఎవరు..? నాకు వీళ్లకు ఏంటి సంబంధం..?

అందరూ ఒక్కసారిగా షాక్‌ అవుతారు..

రాథోడ్‌: ( మనసులో) భగవంతుడా కట్టుకున్న భార్యను కన్నబిడ్డలను కూడా సారు గుర్తు పట్టలేకపోతున్నారు

అమర్‌: చెప్పండి నాకు ఈ ఇల్లు కొత్తగా ఉంది. మీరంతా అపరిచితులుగా ఉన్నారు అంతా అయోమయంగా ఉంది

భాగీ: ఓ రెండురోజులు అయ్యాక మెల్లగా అన్ని  విషయాలు చెబుతాం. ఇప్పుడు భోజనం చేయండి.

అమర్‌: మీ కళ్లల్లో నీళ్లు ఎందుకు వస్తున్నాయి.. మీరు ఏడుస్తున్నారా..? మీరు అందరూ ఎందుకు బాధపడుతున్నారు..? ఏం జరిగింది..?

భాగీ: ఏం లేదండి మీరు భోజనం చేయండి

అమర్‌: సరే మీరు కూడా తినండి

అప్పుడే మనోహరి వచ్చి అమర్‌ను భోజనం చేయకుండా చేయి పట్టుకుంటుంది.

భాగీ: ఏం చేస్తున్నావు మనోహరి తింటున్న ఆయన్ని ఆపేస్తావా..?

మనోహరి: నువ్వు ఏం చేస్తున్నావు భాగీ.. అమర్‌కు ఏం పెడుతున్నావు..

రాథోడ్‌: సార్‌ రోజూ ఈ ఫుడ్డే తింటున్నారు కదా మేడం

మనోహరి: ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు.. అమర్‌ స్పెషల్ ఫుడ్‌ తినాలి

అమర్‌: స్పెషల్‌ ఫుడ్డా..?

మనోహరి: అవును అమర్‌ నీకోసం స్పెషల్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేశాను. నువ్వు అదే తినాలి. పద అమర్‌

అమర్‌: ఒక్కనిమిషం అసలు నేను ఎవర్ని.. నా పేరేంటి..?

మనోహరి: నీ పేరు అమరేంద్ర నువ్వు ఆర్మీలో పెద్ద ఆఫీసర్‌వి..

అమర్‌: మరి ఈ ఇల్లు ఎవరిది..? వీళ్లంతా ఎవరు..? నాకు ఏమవుతారు..? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను..? నా ఇల్లు నా వాళ్లు ఎక్కడ..?

మనోహరి: నీకు ఏమీ గుర్తు లేదా అమర్‌

అమర్‌: లేదు నాకు అంతా అయోమయంగా ఉంది.

మనోహరి: నేను కూడా గుర్తు లేనా..? అమర్‌

అమర్‌: మీరు మనోహరి అని నాకు బాగా కావాల్సిన వాళ్లు అని చెప్పారు కదా..?

మనోహరి: ప్రస్తుతానికి నీకు తెలిసిన ఈ రెండు విషయాలు చాలు అమర్‌.. మిగతా విషయాలు తర్వత చెప్తాను

అమర్‌: నాకు ఇప్పుడే తెలియాలి. అసలు ఈ ఇల్లు ఎవరిది…? వీళ్లంతా ఎవరు..? నాకు వీళ్లకు ఏంటి సంబంధం…? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను..? నాకు ఏం జరిగింది..? నా తల బద్దలయిపోతుంది. పిచ్చిపట్టినట్టు అవుతుంది. తలలో బాగా నొప్పి.. మెదడులో రక్తం పోటెత్తుతుంది..

రాథోడ్‌: సార్‌ మీకేం కాదు సార్‌ కాసేపు రెస్ట్ తీసుకోండి..

అని రాథోడ్‌, అమర్‌ను రూంలోకి తీసుకెళ్తాడు.

మనోహరి: ఇలా జరుగుతుందనే.. మీరెవరూ..? అమర్‌ దగ్గరకు రాకూడదని చెప్పాను. ఇప్పుడు చూడండి మీవల్ల అమర్‌ నరకయాతన పడుతున్నారు. తలలో నరాలు చిట్లిపోయి చనిపోతే మీరు బాధ్యత తీసుకుంటారా..?

అంటూ మనోహరి కోప్పడగానే.. భాగీ, పిల్లలు షాక్‌ అవుతారు. భాగీ కోపంగా మనోహరి ఏం మాట్లాడుతున్నావు.. అంటూ ప్రశ్నించగానే.. అమర్‌ బాధ్యత నాది ఇక మీరు అందరూ అమర్‌కు దూరంగా ఉండండి అంటూ వార్నింగ్‌ ఇస్తుంది మనోహరి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 13th: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
నువ్వులేక నేను లేను: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
Podarillu Serial Today August 13th:బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు
పొదరిల్లు: బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు
Gundeninda Gudigantalu August 13th:మనోజ్‌ రోహిణిని ఒక్కటి చేసిన బామ్మ...పార్లరమ్మ ఇంకా ఏదో దాచిపెడుతోందని బాలుకు అనుమానం
గుండెనిండా గుడిగంటలు:మనోజ్‌ రోహిణిని ఒక్కటి చేసిన బామ్మ...పార్లరమ్మ ఇంకా ఏదో దాచిపెడుతోందని బాలుకు అనుమానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget