అన్వేషించండి

Gunde Ninda Gudi Gantalu May 13th Episode: బయటపడుతున్న పార్లలమ్మ పాపాల చిట్టా, ఎంక్వైరీ మొదలుపెట్టిన బాలు - గుండెనిండా గుడిగంటలు మే 13 ఎపిసోడ్

Gunde Ninda Gudi Gantalu May 13th Episode: మీనా, బాలు తమకు ఎదురైన అవమానం గురించి చెప్పుకుంటారు. రోహిణి గురించి మరో విషయం బయటపడుతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Gunde Ninda Gudi Gantalu 2025 MAy 13th Episode Telugu Serial -  గుండెనిండా గుడిగంటలు మే13 ఎపిసోడ్

రోహిణికి భోజనం తీసుకెళ్లిన మీనాను అవమానిస్తుంది రోహిణి. అప్పటివరకూ సైలెంట్ గా ఉన్న మీనా ఏమ్మా పార్లలమ్మా మింగడం మీకు అలవాటు మాకు కాదు..మేం కష్టపడి బతుకుతున్నాం..నీకు అసలు నాతో మాట్లాడే అర్హతే లేదు, ఇకపై నువ్వు తిన్న ప్లేట్ నువ్వే కడుక్కో..దాన్ని ముట్టుకోవడం కూడా అసహ్యం అని క్లాస్ వేసి వెళ్లిపోతుంది. కిందకు రాగానే ప్రభావతి నిందలేస్తుంది..నా చిన్న కోడలిని మచ్చికచేసుకుని నాకు దూరం చేశావ్..ఇప్పుడు పెద్దకోడలిని నీవైపు తిప్పుకుందాం అనుకుంటున్నావా అని విరుచుకుపడుతుంది. నాకు పూలు కట్టడమే కానీ..పుల్లలు పెట్టడం రాదంటుంది మీనా.ఇది ఎవర్ని అంది అని ఆలోచనలో పడుతుంది ప్రభావతి.

మీనా డల్ గా కూర్చుంటుంది..బాలు వచ్చి చెప్పు చేతికిచ్చి కొట్టు అంటాడు. ఎందుకు అంటే.. మనోజ్ కి బిర్యానీ తీసుకెళ్లడం, అవమానించడం అన్నీ చెబుతాడు. నేను కూడా అదే పని చేశానంటూ రోహిణికి తనకి జరిగిన డిస్కషన్ చెబుతుంది. ఇకపై ఎవర్నీ పట్టించుకోకుండా మనపని మనం చేసుకుందాం అనుకుంటారు

తెల్లారేసరికి గుడి దగ్గరకు వెళ్లిన మీనా.. తన తల్లి, చెల్లి, తమ్ముడితో ఇంట్లో జరిగినదంతా చెబుతుంది. మనోజ్ ని కొట్టకుండా రోహిణిని అనడం ఏంటి అంటుంది పార్వతి. మంచిపని అయింది..ఆ రోహిణికి కాల్ చేసి ఇప్పుడు కడిగేస్తా అంటుంది సుమతి. ఆ రోహిణి ఏదో తేడాగా ఉంది.. రోహిణి గుణ నుంచి డబ్బులు తీసుకెళ్తూనే ఉండేది..తను నన్ను చూడలేదు..నేను దాక్కునేవాడిని అంటూ గుణ దగ్గరకు రోహిణి తరచూ వస్తూ ఉండేదనే విషయం బయటపెడతాడు శివ. రోహిణి వాళ్ల నాన్న జైల్లో ఉన్నాడు కాబట్టి గుణ దగ్గర డబ్బు తీసుకునేదేమో అంటుంది పార్వతి. మనోజ్ ఎప్పుడూ రాలేదు కానీ రోహిణి రెగ్యులర్ గా వస్తూనే ఉంటుందని బయటపెడతాడు శివ. రోహిణి గురించి ప్రతీసారీ ఓ కొత్త విషయం బయటపడుతోంది..తను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఆలోచనలో పడుతుంది మీనా.

ఇంటికి చేరుకున్న మనోజ్..డోర్ కొట్టినా చాలా సేపటి వరకూ రోహిణి తీయదు. ప్రభావతి వచ్చి ఏంటి బయటే ఉన్నావ్ అంటుంది. డోర్ తీయడం లేదంటాడు. ఏం చేస్తోంది లోపల అని ప్రభావతి అడుగుతుంది. బాధలో ఉంది కదా అమ్మా అందుకే తీయడం లేదు..నువ్వు తనను ఏమీ అనొద్దు అంటాడు. చేయాల్సింది అంతా చేసి రూమ్ లో కూర్చుంటే చూస్తూ ఊరుకోవాలా , అది నిన్ను మోసం చేసింది నువ్వు దాన్ని వెనకేసుకుని రావొద్దు అంటుంది ప్రభావతి. ఏమైందని మీనా వస్తే తిట్టి పంపించేస్తుంది ప్రభావతి. పార్లలమ్మ బకెట్ తన్నేసిందేమో అని బాలు అనగానే మీరు ఆగండి అంటుంది. ఇంతలో రోహిణి డోర్ తీస్తుంది.. నాకు నిద్రపట్టేసింది, తప్పు చేశావనే అపరాధ భావం అస్సలు లేదా అని క్లాస్ వేస్తుంది ప్రభావతి. లోపలకు వెళ్లి డోర్ వేస్తుంటుంది రోహిణి..తీసే ఉంచు అని క్లాస్ వేసి వెళ్లిపోతుంది ప్రభావతి.

వీడెందుకు భయపడుతున్నాడు.. పెద్దలంటే గౌరవం ఉండొచ్చు కానీ పెళ్లాంతో మాట్లాడకూడదు అన్నంత భయం ఉండకూడదు అంటాడు. ఫ్రెష్ అయ్యేందుకు వెళతాడు బాలు.. మీనా మాత్రం రోహిణి-గుణ దగ్గరకు వెళ్లిందనే విషయం గుర్తుచేసుకుంటుంది. రోహిణి ఏదో చేస్తోందంటూ బాలుతో అంటుంది. రోహిణి తరచూ గుణ దగ్గర లక్షలు లక్షలు అప్పు చేస్తోందనే విషయం శివ చెప్పినట్టు చెబుతుంది మీనా. షాక్ అవుతాడు బాలు. అన్ని లక్షలు తీసుకొచ్చి ఏం చేస్తోంది? ఎవరికి ఇస్తోంది? ఎవర్ని మోసం చేస్తోంది? ఆ డబ్బుతో ఏం చేస్తోందనే చర్చ పెట్టుకుంటారు మీనా బాలు. ఏదో ఉంది..ఇంటికి ముప్పు తెచ్చే అప్పు, తప్పు నేనొప్పుకోను అంటాడు బాలు. మీ అన్నయ్యకి లాభాలు వస్తున్నాయ్.. అలాంటప్పుడు రోహిణికి అంత డబ్బు ఏం అవసరం ..ఇదంతా మనోజ్ కి తెలిసి ఉండదు అంటుంది మీనా. ఇదేదో తేల్చుకోవాల్సిన విషయమే అనుకుంటాడు బాలు.

సత్యం దగ్గరకు వెళ్లిన రోహిణి.. మావయ్యా నేను తప్పు చేశాను కానీ మనోజ్ కోసమే ఇదంతా చేశాను అంటుంది. నువ్వు ఇప్పుడు ఎంత చెప్పినా అది మోసం కిందకే వస్తుందనేస్తాడు. ఆ డబ్బులు పెట్టుబడి పెట్టి వచ్చిన లాభాలతో మీకు ఇవ్వాలి అనుకున్నా అంటుంది. సత్యం దగ్గర దొంగ ఏడుపు ఏడుస్తుంది. మీ అత్తయ్య అర్థం చేసుకోలేదన్నావ్ కానీ ఆవిడ నిన్ను నమ్మింది..నువ్వు మోసం చేశావ్ అనేసి వెళ్లిపోతాడు సత్యం.

క్యారియర్ కట్టావా అంటూ వంటగదిలోకి ఎంట్రీ ఇస్తుంది ప్రభావతి. మీనా నన్నోసారి గిల్లు..మా అమ్మ నాన్నకి క్యారియర్ తీసుకెళ్తోందా , మా అమ్మ ఉద్యోగంలో చేరిందా అని సెటైర్స్ వేస్తుంటాడు బాలు. ఇక ఆపరా..ఈ క్యారియర్ నాకోసం కాదు మీనాన్నకోసం అంటుంది ప్రభావతి.

సత్యం రూమ్ నుంచి వస్తున్న రోహిణిని చూసి...మీ మావయ్యని నీవైపు తిప్పుకుందాం అని చూస్తున్నావా అని కోప్పడుతుంది ప్రభావతి.  ఆ తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు... రోహిణి వస్తుంది...

 కాశీలో 9 రాత్రులు నిద్ర చేయాలనడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? వారణాసిలో ఆ 9 రోజులు ఏం చేయాలి?

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today June4th:తప్పు ఒప్పుకుని గోపాల్ గుండెలపై వాలిపోయిన సింధూ...భర్తతో కలిసి ఊరికి పయనం
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌:తప్పు ఒప్పుకుని గోపాల్ గుండెలపై వాలిపోయిన సింధూ...భర్తతో కలిసి ఊరికి పయనం
Jagadhatri Serial Today June 4th:నిషిక బండారం బయటపెట్టడానికి జగధాత్రి వేసిన ఎత్తు ఏంటి..? జేడీ వార్నింగ్‌కు వణికిపోయిన డాక్టర్
జగద్ధాత్రి సీరియల్: నిషిక బండారం బయటపెట్టడానికి జగధాత్రి వేసిన ఎత్తు ఏంటి..? జేడీ వార్నింగ్‌కు వణికిపోయిన డాక్టర్
Nindu Manasulu Serial Today June 4th: ప్రేరణను ఇంటి నుంచి పంపడానికి విజయానంద్ వేసిన ఎత్తు ఏంటి..? సిద్ధూ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?
నిండుమనసులు: ప్రేరణను ఇంటి నుంచి పంపడానికి విజయానంద్ వేసిన ఎత్తు ఏంటి..? సిద్ధూ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?
Illu Illalu Pillalu Serial Today June 4th: ధీరజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు....స్టేషన్‌లో పెట్టి కొట్టడంతో ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు....స్టేషన్‌లో పెట్టి కొట్టడంతో ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget