అన్వేషించండి

Nindu Manasulu Serial Cast :స్టార్ మా ' నిండు మనసులు' సీరియల్‌ ఎందుకంత స్పెషల్‌? నటీనటుల ఎవరు?

Nindu Manasulu Serial Cast :ధైర్యవంతురాలైన యువతి తన తండ్రి కన్న కలలను నిజం చేయడమే జీవిత లక్ష్యంగా పోరాటం చేస్తున్న కథతో వస్తున్న నిండు మనసులు సీరియల్‌ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నిండు మనసులు సీరియల్ ప్రేరణ తండ్రి కలల నెరవేర్పు చుట్టూ తిరుగుతుంది.
  • తండ్రి రహస్యాలు, కుటుంబ సమస్యలు ప్రేరణను మానసికంగా దెబ్బతీస్తాయి.
  • పవిత్ర, యశ్వంత్, ఇంద్ర నాగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
  • స్టార్ మాలో సోమవారం-శనివారం, డిస్నీ+ హాట్‌స్టార్‌లో చూడవచ్చు.

Nindu Manasulu Cast and Crew : బుల్లి తెర ప్రేక్షకులకు వినోదం పంచడంలో స్టార్‌ మా ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇప్పటికే ఆ ఛానల్‌లో ప్రసారమయ్యే చాలా సీరియల్స్‌ మనం చూస్తునే ఉన్నాం. అలాంటి సీరియల్స్‌లో మరొకటి ' నిండు మనసులు' కుటుంబ బంధాలు, ఆశయాలు, వాటి చుట్టూ తిరిగే కథనం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశంగా మారుతింది. ఇందులో లీడ్‌ రోల్ ప్రేరణ పాత్ర పోషిస్తున్న పవిత్ర  నాయక్‌ నటన, అమె ఎదుర్కొనే సవాళ్లు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అసలు ఈ కథ ఏంటీ ఇందులో నటిస్తున్న వారు ఎవరు మీరు ఈ సీరియల్‌ఎక్కడ చూడొచ్చు అనేది తెలుసుకుందాం. 

ప్రేరణ ఆశయం ఒక ఎమోషనల్ జర్నీ

ఈ కథ అంతా ప్రేరణ అనే ధైర్యవంతురాలైన యువతి చుట్టూ తిరుగుతుంది. తన తండ్రి రాజశేఖర్‌ కన్న కలలను నిజం చేయడమే ఆమె జీవిత లక్ష్యం. అమె ఒక సివిల్ సర్వెంట్ కావాలని నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. అయితే జీవితం ఎప్పుడూ అనుకున్నట్టు సాగదు కదా. ప్రేరణ తన తండ్రి జీవితానికి సంబంధించిన కొన్ని భయంకరమైన నిజాలను తెలుసుకుంటుంది. తండ్రికి ఉన్న ఇతర సంబంధాలు, దాగి ఉన్న కుటుంబ రహస్యాలు ఆమెను మానసికంగా కుంగదీస్తాయి. 

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె ఎలా నిలబడింది. తన ఆశయాన్ని నెరవేర్చుకుందా లేదా కుటుంబ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిందా అనేది ఈ సీరియల్‌ స్టోరీ. 

కథను మలుపు తిప్పే పాత్రలు ఇవే!

ఈ సీరియల్‌ ఇంతలా క్లిక్ అవ్వడానికి ప్రధాన కాణం అందులోని పాత్రలు, వాటిని రక్తి కట్టించిన నటులు. 

ప్రేరణ: కథానాయికగా పవిత్ర (Pavithra B. Naik)అద్భుతంగా నటిస్తోంది. గతంలో నువ్వు నేను ప్రేమ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ఇప్పుడు ప్రేరణ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె తన సోషల్ మీడియా ద్వారా షూటింగ్ విశేషాలను కూడా పంచుకుంటూ ప్రేక్షకులతో టచ్‌లో ఉంటోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pavithra B Naik💫 (@pavithrabnaik)

 

సిద్ధార్థ్‌: ప్రేరణకు జంటగా సిద్ధార్థ్‌ పాత్రలో యశ్వంత్‌ కనిపిస్తున్నాడు. గతంలో దేవతలారా రండి సీరియల్ ద్వారా పరిచయమైన యశ్వంత్‌ ఈ సీరియల్‌లో చాలా పరిణతి చెందిన నటనను కనబరుస్తున్నాడు. సిద్ధార్థ్‌ జీవితంలో కొన్ని విషాదాలు ఉంటాయి. వీరిద్ధరి జీవితాలు ఎలా కలిశాయి అనేది చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by YaShWaNth_B (@yashwanth_bettaswamy)

రాజశేఖర్‌: ప్రేరణ తండ్రి పాత్రలో ఇంద్ర నాగ్ నటిస్తున్నారు. ఈయన సీరియల్‌ నటుడు. కథను మలుపు తిప్పే కీలకమైన ఎమోషనల్‌పాయింట్ ఈయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. 

నీపా శివ: గతంలో బ్రహ్మముడి సీరియల్‌లో కనకమ్మగా అలరించిన నీపా శివ, ఇందులో ఒక కీలకమైన తల్లి పాత్రలో కనిపిస్తున్నారు. కుటుంబ బంధాల మధ్య నలిగిపోయే ఈ పాత్రలో ఆమె నటన సీరియల్‌కు నిండుదనాన్ని ఇస్తోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by K Sreevani (@kambhammettu_sreevani)

సంగీత కొండవీటి: రాజశేఖర్‌ మొదటి భార్యగా సంగీత కనిపిస్తున్నారు. ఈమె పాత్ర కథలో ఎంతో గంభీరంగా, కొత్త మలుపులు తెచ్చేలా ఉంటుంది. 

పోలీస్‌ ఆఫీసర్ గుణ: కథలో ఒక కీలకమైన మలుపులో పోలీస్‌ఆఫీసర్‌ గుణ పాత్ర ప్రవేశిస్తుంది. దీనిని శశాంక్‌ పోషిస్తున్నారు. 

నిండు మనసులు ఎందుకు చూడాలి?

ఈ సీరియల్ కేవలం ఏడుపుగొట్టు సీన్లు మాత్రమే కాకుండా, ఒక యువతి తన కలల సాకారం చేసుకోవడానికి చేసే పోరాటం ఉంది. కుటుంబంలో రహస్యాలు బయటపడినప్పుడు ఒక మనిషి ఎంత ధైర్యంగా ఉండాలో ప్రేరణ పాత్ర ద్వారా చూపించారు. ఎమోషన్స్‌, సస్పెన్స్‌, సామాజిక బాధ్యత కలగలిసిన కథ కావడంతో అందరికీ నచ్చుతోంది. 

నిండు మనసులు ఎప్పుడు ఎక్కడ చూడాలి?

ఈ సీరియల్ స్టార్ మాలో ప్రతి సోమవారం నుంచి శనివారం సాయంత్ర 6.30 నుంచి 7.30 మధ్య టెలికాస్ట్ అవుతుంది. ఒక వేళ సీరియల్‌ టీవీలో మిస్ అయితే డిస్నీ+ హాట్‌స్టార్‌ యాప్‌లో ఎప్పుడైనా చూడొచ్చు. దీని కోసం మీకు సబ్‌స్క్రిప్షన్ అవసరం ఉంటుంది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌ ప్లే యాప్‌లో కూడా ఈ ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి. 

మొత్తానికి నిండు మనసులు కేవలం ఒక సీరియల్‌ మాత్రమే కాదు, అది ఒక ఎమోషనల్‌ జర్నీ, ప్రేరణ తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తుందా? ఆమె జీవితంలోకి వచ్చిన సిద్ధార్థ ఎలాంటి తోడుగా నిలిచాడు, అనే విషయాలు తెలియాలంటే మీరు ప్రతి రోజూ సీరియల్ చూడాల్సిందే.  

Frequently Asked Questions

'నిండు మనసులు' సీరియల్ కథ ఏమిటి?

'నిండు మనసులు' సీరియల్, ప్రేరణ అనే యువతి తన తండ్రి కలలను నెరవేర్చడానికి చేసే పోరాటం మరియు ఆమె కుటుంబ రహస్యాలను ఎదుర్కోవడం చుట్టూ తిరుగుతుంది.

'నిండు మనసులు' సీరియల్ లో ప్రధాన పాత్రలు ఎవరు?

ప్రేరణ పాత్రలో పవిత్ర, సిద్ధార్థ్ పాత్రలో యశ్వంత్, రాజశేఖర్ పాత్రలో ఇంద్ర నాగ్, మరియు నీపా శివ, సంగీత కొండవీటి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'నిండు మనసులు' సీరియల్ ఎక్కడ, ఎప్పుడు చూడవచ్చు?

ఈ సీరియల్ స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం సాయంత్రం 6:30 నుంచి 7:30 మధ్య ప్రసారం అవుతుంది. టీవీలో మిస్ అయితే, డిస్నీ+ హాట్‌స్టార్‌ లేదా ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌ ప్లే యాప్‌లో చూడవచ్చు.

'నిండు మనసులు' సీరియల్ చూడటం ఎందుకు మంచిది?

ఈ సీరియల్ యువతి ఆశయాలు, కుటుంబ రహస్యాలు, భావోద్వేగాలు, మరియు సామాజిక బాధ్యతలను అందంగా చిత్రీకరిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Embed widget