Nindu Manasulu Serial Today February 16th: నిండు మనసులు: ప్రేరణ కోసమే సిద్ధూ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడా! గణ దగ్గరున్న సాక్ష్యమేంటి?
Nindu Manasulu Serial Today Episode February 16th సిద్ధూ ప్రేరణని పూర్తిగా అర్థం చేసుకొని ప్రేరణ వెనక తిరగడం కుమార్ సిద్ధూని ఆటపట్టించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

సుధా నువ్వు వాళ్ల మనిషివే కదా.. అందుకే కదా తనని ఇక్కడ పనిలో చేర్చావ్..నువ్వు కూడా నాకు వెన్నుపోటు పొడిచావ్ అని గణ కోపంగా అరుస్తాడు. సార్ ఏం మాట్లాడుతున్నారు.. నేను మీకు నమ్మినబంటు సార్.. నడిరోడ్డు మీద ఆవిడ పని కోసం తిరుగుతుంటే ఇక్కడికి తీసుకొచ్చా అంతే కానీ ఆవిడే ప్రేరణ వాళ్ల అమ్మ అని తెలుసుంటే అక్కడే నిలదీసేవాడిని.. మీ మీద ఒట్టు సార్ నాకు ఏం తెలీదు అని సుధాకర్ అంటాడు. నా మీద కాదు నీ మీద ఒట్టు వేసి చెప్పు అని గణ అంటే సుధాకర్ ఒట్టు వేసి ఏం తెలీదు అంటాడు. దానికి గణ సుధా నీ మీద ఒట్టు వేశావ్.. నువ్వు చెప్పింది అబద్ధం అయితే ఏ లారీ కిందైనా పడి చచ్చిపోతావ్ అంటాడు. మిమల్ని నమ్మించలేని బతుకు ఎందుకు సార్ నిజంగానే పోతాను అని సుధా అంటాడు. నిజమే సుధా నాకు అదే అనిపిస్తుంది.. నువ్వు నా నమ్మిన బంటు సుధా అంటాడు. వాళ్లని అంత ఈజీగా వదిలేశారు సార్ ఏం చేయరా అని సుధాకర్ అడుగుతాడు. అంత ఈజీగా ఎలా వదిలేస్తా సుధా.. వాళ్లకి దిమ్మతిరిగే షాక్ ఇస్తాడు.. కానీ అంతకంటే ముందు నాకు నా జాబ్ రావాలి అప్పుడు చెప్తా వాళ్ల సంగతి అని అంటాడు.
ప్రేరణ కేఫ్‌కి రాగానే సిద్ధూ ప్రేరణతో చదువుకోవడానికి రమ్మని చెప్పావ్ తీరా వస్తే ఇంట్లో ఎవరూ లేరు అని అంటాడు. సిద్ధూకి నిజం చెప్తే తను నన్ను తక్కువ చేసి చూస్తే నేను తట్టుకోలేను అని ప్రేరణ అనుకొని సిద్ధూతో అర్జెంట్ పని పడి వెళ్లానని అంటుంది. ఇక ప్రేరణ కాఫీ పెడుతుంటే సిద్ధూ చాటుగా చూస్తే నా కోసం నువ్వు కోరుకున్న లక్ష్యం కూడా వదులుకోవడానికి రెడీ అయ్యావ్.. నీది నిజంగా మంచి మనసు ప్రేరణ అంటూ ప్రేరణనే చూస్తూ ఉంటాడు. సిద్ధూ ప్రేరణని ఫాలో అవుతూ చూడటం కుమార్ చూసి సిద్ధూ దగ్గరకు వెళ్లి పనిలో మునిగిపోవాల్సిన వాడిని ఇలా ప్రేరణని చూసే పనిలో మునిగిపోయావ్ అంటాడు. ఏదైనా పనే కదరా నువ్వు వెళ్లి నీ పని చూసుకో అని అంటాడు. ప్రేమ ముదిరి పాకానికి వచ్చినట్లు ఉంది.. అంత బాగుందా ప్రేరణ గారు అని కుమార్ అడిగితే కొత్తగా కనిపిస్తుందిరా అని సిద్ధూ అంటాడు. వెంటనే కుమార్ ప్రేరణని పిలిచి మీరు వీడికి కొత్తగా కనిపిస్తున్నారు అంట అని ఇరికించేస్తాడు.
ప్రేరణ వచ్చి ఏంటి సిద్ధూ కొత్తగా కనిపించడం ఏంటి అంతే కొత్తగా కాదు.. గొప్పగా కనిపిస్తున్నావ్.. కొన్ని విషయాలు ఉంటాయి ప్రేరణ.. ఒక మనిషి గురించి మనం అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు మనం ఇప్పుడు అర్థం చేసుకున్నప్పుడు.. వాళ్లు అప్పుడు అలా ఎందుకు చేశారో ఇప్పుడు తెలిస్తే గొప్పగా కనిపిస్తారు కదా అంటాడు. ప్రేరణ మనసులో నా గురించి ఏమైనా తెలిసిందా.. దేని గురించి మాట్లాడుతున్నావ్ సిద్ధూ అంటుంది. నేను నీ కంటే హైట్ అనుకున్నా కానీ నువ్వు నా కంటే హైట్‌లో ఉన్నావ్ అంటాడు. ఆ రోజు విశ్వనాథ్ గారి దగ్గర సీటు కోసం తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డావో ఇప్పుడు తెలిసింది ఇప్పుడు నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావ్ అని అంటాడు. మనసులో నువ్వేంటో నాకు ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది ప్రేరణ అని అనుకుంటాడు.
గణ డీసీపీ దగ్గరకు వెళ్తాడు. తప్పుడు కేసులో నన్ను కావాలనే ఇరికించారు సార్ నన్ను నమ్మండి నా ఉద్యోగం నాకు తిరిగి ఇప్పించండి అని అంటాడు. పేపర్ మీద సంతకం పెట్టు అప్పుడు ఇంక్వైరీ చేస్తా అంటాడు. నేను తప్పు చేయలేదు అని చెప్పడానికి బలమైన సాక్ష్యం ఉంది సార్ అని గణ అంటే తీసుకురమ్మని డీసీపీ అంటాడు. మరోవైపు శైలు కుమార్‌కి కాల్ చేసి నీకు నా కంటే ఆ కేఫ్ ఎక్కువైపోయింది. పెళ్లికి ముందు వరకు నా వెనక తిరిగావ్.. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు అని ఫోన్ కట్ చేసేస్తుంది. కుమార్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఏమైందని సిద్ధూ అడిగితే ఫ్లాష్‌బ్యాక్‌లో కుమార్ ఇంట్లో తినను అన్నందుకు శైలు చితక్కొట్టి మీద నీరు విసిరేసి పిచ్చకొట్టుడు కొట్టిన విషయం చెప్తాడు. శైలుని నువ్వు అర్థం చేసుకోవాలి.. తను తన తండ్రిని వదిలేసి వచ్చింది. తనకి కొన్ని సరదాలు ఉంటాయి. నువ్వు తనని సంతోషంగా చూసుకోవాలి లేదంటనే నీ పని అయిపోతుందని ప్రేరణ అంటుంది.
సిద్ధూ కుమార్‌తో మన కేఫ్‌లోనే శైలు కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయరా అంటాడు. కుమార్ ప్రేరణకు విషయం చెప్తా అంటే సిద్ధూ వద్దు అనేస్తాడు. మరోవైపు ఇందిర భర్తని చూడలేదు అని ఏడుస్తూ ఉంటుంది. ఐశ్వర్య కూడా ఎలా నాన్నని చూస్తాం అని అంటుంది. రంజిత్ వచ్చి ఆకలేస్తుంది అని అంటాడు. ఇప్పుడే వంట చేస్తా అని ఇందిర అడిగితే ఐశ్వర్య రంజిత్ మీద సీరియస్ అయిపోతుంది. టైంకి అన్నీ కావాలి అంటే ఎలా.. మేం మనషులం మాకు ఎమోషన్స్ ఉంటాయి అంటుంది. నాకు అన్నీ ఉన్నాయ్.. అసలు మీది సమస్యే కదా.. మీరు వెళ్లి చూస్తే మిమల్ని ఏం చేయలేడు.. మీకు మీ నాన్న ఎంత ముఖ్యమో వాడికి వాడి తండ్రి అంతే ముఖ్యం.. ప్రేరణ ఇచ్చిన వార్నింగ్‌కి వాడు ఏం చేయలేడు.. మీకు అంత అవసరం అయితే నేను మీతో వస్తా అని అంటాడు. మీరు ఇంత సపోర్ట్ చేస్తే నేనే మీ కోసం వంట చేస్తా అని ఐశ్వర్య పరుగులు పెడుతుంది. సిద్ధూ కుమార్ కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు. కుమార్ శైలుకి ఫోన్ చేసి కేఫ్‌కి రమ్మని అంటాడు. నా కోపం పోవాలి అంటే బయటకు తీసుకెళ్తావని అనుకున్నా మళ్లీ కేఫ్‌కి రమ్మని అంటావా.. మర్యాదగా వచ్చి బయటకు తీసుకెళ్లు అంటుంది. కుమార్ భయంతో వెళ్లిపోతాడు. అనవసరంగా ఈ సెటప్ వేస్ట్ అయింది అనుకోకు.. నీ మనసులో మాట ప్రేరణకి ఇప్పుడే చెప్పే అని అంటాడు. నోరు మూసుకొని వెళ్లరా అని సిద్ధూ పంపేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























