అన్వేషించండి

Nindu Manasulu Serial Today February 14th: నిండు మనసులు: గణ ఇంట్లో రచ్చ రచ్చ! సిద్ధూకి తెలిసిపోయిన నిజం! రంజిత్ సలహా ఏంటి?

Nindu Manasulu Serial Today Episode February 14th ప్రేరణ గణల తండ్రి ఒక్కరే అని సిద్ధూకి తెలియడం, ప్రేరణ గణతో గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode రాజశేఖరం చనిపోయాడు అని గణ ప్రేరణకు చెప్పడంతో ప్రేరణ, ఇందిర, ఐశ్వర్యలు పరుగున వస్తారు. తండ్రి శవాన్ని చూపించమని గణని బతిమాలుతారు. ప్రేరణ ఇందిరని తల్లి అనడంతో గణ అక్కడున్న అందరినీ పంపేసి.. ఈవిడ మీ అమ్మా,, అని అంటాడు. అవును మా అమ్మే అని ప్రేరణ అంటుంది. అప్పుడే గణ తన తల్లిని పిలుస్తాడు. ఈశ్వరి రాజశేఖరాన్ని తీసుకొని వస్తుంది. ప్రేరణ, ఇందిర, ఐశ్వర్యలు షాక్ అయిపోతారు. 

గణ తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా చూశావా.. ఈ తల్లీకూతుళ్ల నాటకం.. ఏంటి అలా చూస్తున్నారు.. మా నాన్న చనిపోలేదు.. కానీ తన చావుని అడ్డు పెట్టుకొని మీ అమ్మ ఎవరో మీ నోటితోనే బయట పెట్టించాలి అని ఇదంతా చేశాను అని చెప్తాడు. ప్రేరణ వాళ్లు షాక్ అయిపోతారు. సిద్ధూకి కూడా ప్రేరణ వాళ్లని ఫాలో అయి గణ వాళ్ల ఇంటికి ఎందుకు వచ్చారు.. ఇక్కడ వీళ్లకేంటి పని అని అనుకుంటాడు. గణ తల్లితో అమ్మా ఇన్ని రోజులు ఈవిడను నువ్వు పని మనిషి గంగ అనుకున్నావ్ కానీ తను కాదమ్మా.. ప్రేరణ తల్లి ఇందిర అని అంటాడు. అబద్ధం చెప్పడం తప్పే కానీ పనిమనిషిగా అయినా నా భర్తకి సేవలు చేసి ఆయన్ను కోలుకోవాలి అనుకున్నా తప్పు కాదు కదా అమ్మా అని ఇందిర అంటుంది. ఎవరీ నీకు భర్త ఈయన నాకు మాత్రమే భర్త.. ఈయన నీకు ఎప్పటికీ భర్త కాలేరు అని అంటుంది. సిద్ధూ మొత్తం విని.. నేను కాపాడిన రాజశేఖరం గారు ప్రేరణ తండ్రా.. గణ, ప్రేరణ ఒకే తండ్రికి పుట్టిన పిల్లలా అని నోరెళ్లబెడతాడు. 

గణ ప్రేరణ వాళ్లతో ఎంత బాగా నటించారురా.. ఈ మహాతల్లి అయితే వాళ్లు తనకు ఎవరో తెలీనట్లు తనకు పుట్టనట్లు భలే నటించింది అంటాడు. ఇలాంటి బుద్ధులు ఉన్నాయి కాబట్టే మీ నాన్నని భర్త అని చెప్పుకొని తిరుగుతున్నారు.. ఛీ సిగ్గులేని జన్మ అని అంటుంది. ఈశ్వరి గారు అని ఇందిర అరుస్తుంది. నా పక్కన నిల్చొనే ధైర్యం లేదు కానీ నన్నే పేరు పెట్టి పిలుస్తావా అని అడుగుతుంది ఈశ్వరి.. మీరు ఎప్పటికీ బజారు మనుషులేనా అని గణ అంటాడు. మా అమ్మ కాదురా మీరే బజారు మనుషులు అయిండొచ్చు కదా అని ఐశ్వర్య అంటే ఈశ్వరి కొట్టడానికి చేయి ఎత్తుతుంది. ప్రేరణ చేయి పట్టుకొని మర్యాదగా చేయి అదుపులో పెట్టుకో లేదంటే నేను ఇలాగే సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటుంది. నేను మా నాన్న అని చెప్పుకోవడానికి సాక్ష్యాలు ఉన్నాయి. మీకు ఉన్నాయా అని గణ అడుగుతుంది. వీళ్ల అవసరాలు తీర్చుకోవడానికే మీ నాన్నని వాళ్ల నాన్న అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఇలా ఎవరిని పడితే వాళ్లని నాన్న అని చెప్పుకొని తిరగడం వాళ్లకి అలవాటే అంటుంది ఈశ్వరి. నోర్ముయ్.. నువ్వు మనిషివేనా.. ఎవరికి పడితే వాళ్లకి మేం నాన్న అని ఎందుకు అంటాం.. ఆయనే మా నాన్న.. మా అమ్మకి తాళి కట్టిన భర్త.. అని ప్రేరణ అంటుంది. ఇంకోసారి మా గురించి తప్పుగా మాట్లాడితే మీ అమ్మని కొట్టినట్లు నిన్ను కొడతా అని ఐశ్వర్య అంటుంది. మీ అంతు చూడకుండా నేను ఉండనే అని గణ అంటాడు. మా నాన్న పరువు తీయకూడదు అని ఆగాను కానీ నేను తెగిస్తే మీరు ఎంతరా.. ఒక్కొక్కురి అంతు తేల్చుతా.. మేం ఆడపిల్లలమే కానీ ఆడపులిలం.. పైన చేయి పడితే చేయి విరిచేస్తాం.. ఇది మా నాన్న ఇళ్లు.. ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క.. ఈయన మా నాన్న.. మా నాన్నని చూడటానికి ఎప్పుడైనా వస్తాం.. ఎప్పుడైనా వెళ్తాం అని ప్రేరణ అంటుంది. 

ఏయ్ అని ఈశ్వరి అంటే నీ కొడుకునే కొట్టినదాన్ని అడ్డువస్తే నిన్ను వదలను అంటుంది. ప్రేరణ నువ్వు ఎక్కువ చేస్తున్నావ్ అని గణ అంటే బరాభర్ చేస్తా.. నువ్వేం చేయగలవు.. నీ ముందే మా అమ్మ వచ్చి మా నాన్నకి సేవలు చేసింది.. పోలీస్ పోలీస్ అంటావ్ కదా కనిపెట్టలేకపోయావ్.. పదే పదే ఆయన మా నాన్న కాదు అంటావ్ కదా.. ఆయన మా నాన్న కాదు అనడానికి నీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి.. ఇక నుంచి మేం అంతా వస్తాం.. కాదని అడ్డు పడితే ఇక్కడే టెంట్ వేసుకొని కూర్చొంటాం.. వచ్చేవాళ్లకి నువ్వేం చెప్తావో నీ ఇష్టం.. నేను మాత్రం ఈయనే మా నాన్న అని చెప్తా.. అమ్మా ఇక నుంచి నువ్వు పనిమనిషిగా కాదు మా నాన్నకి భార్యగారా ఎవరు కాదంటారో నేను చూసుకుంటా అని అంటుంది. నాన్నని మనతో తీసుకెళ్దాం అని ఐశ్వర్య అంటే వద్దు ఐషూ మనం అలా చేస్తే మనపై పడిన నిందని మనం నిజం చేసినట్లు అవుతుంది. నాన్న కోలుకొని మన గురించి చెప్పిన తర్వాతా అప్పుడు మన నాన్న మన దగ్గరకు వస్తారు. అంత  వరకు నాన్న ఇక్కడే ఉంటారు.. మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి.. అని ప్రేరణ తల్లీ చెల్లిని తీసుకెళ్లిపోతుంది.

సిద్ధూ చూసి ఇది ప్రేరణ వాళ్ల ఫ్యామిలీ సమస్య నేను కలుగజేసుకోకపోవడం మంచిది అని వెళ్లిపోతాడు. వాళ్లు అన్ని మాటలు అని వెళ్లిపోతుంటే ఎందుకు ఊరుకున్నావ్ అని ఈశ్వరి అడిగితే చేయాల్సిన పని అప్పుడే చేశానమ్మా అని చాటుగా రికార్డ్ చేసిన వీడియో తీసుకొస్తాడు. కావాలనే అది రెచ్చిపోయింది. ఇక చూడు వాళ్లని ఎలా ఆడుకుంటానో అని అంటాడు. గణకి నిజం తెలిసిపోయిందని సుధాకర్‌కి తెలియడంతో కళ్లు తిరిగి పడిపోతాడు. నా గురించి కూడా తెలిసిపోయిందా అంటే అమ్మ గురించి తెలిసిన వాడికి అమ్మ తమ్ముడి గురించి కూడా తెలీదా అని ఐశ్వర్య అంటుంది. మీ బావ చనిపోయాడు అని అబద్ధం చెప్పాడురా.. మా మీద కోపంతో మీ బావని ఏమైనా చేస్తాడనే భయంగా ఉందని ఇందిర అంటుంది. వాడు రెచ్చిపోకూడదు అని అంటే వాడికి మనం తిరగబడాలి అని ప్రేరణ, ఐశ్వర్యలు అంటారు. వాడు కూడా మీలాగే తెగిస్తాడు.. మీ నాన్నపై మీ నీడ కూడా పడనివ్వడు అప్పుడేం చేస్తారు అని సుధాకర్ అంటే వాడేం చేస్తాడు. తండ్రీ మీద వాడికి ఎంత హక్కు ఉందో వీళ్లకి అంతే హక్కు ఉందని రంజిత్ అంటాడు. మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందే అని సుధాకర్ అంటే మీ ముగ్గురు ధైర్యంగా ఉంటే ఎవరూ ఏం చేయలేరు.. అని రంజిత్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today March 7th: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
నిండుమనసులు: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
Chinni Serial Today March 7th: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
చిన్ని సీరియల్: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
Illu Illalu Pillalu Serial Today March 7th: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
Meghasandesam Serial Today march 7th:‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి తన ప్రేమ గురించి చెప్పిన శివ – శివను తిట్టిన భూమి
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి తన ప్రేమ గురించి చెప్పిన శివ – శివను తిట్టిన భూమి
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Embed widget