Naga Panchami November 30th Episode: 'నాగ పంచమి' సీరియల్: తల్లైతేనే ఇంట్లో ఉంటావ్ - పంచమిని హెచ్చరించిన మోక్ష, గెటప్ మార్చేసిన కరాళి!
Naga Panchami Serial Today Episode : బిడ్డకు జన్మనిస్తేనే ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుందని మోక్ష పంచమికి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Naga Panchami Telugu Serial November 30th Episode : కరాళి ప్రాణత్యాగం చేసుకునేందుకు తన చుట్టూ మంటను పెట్టుకుంటుంది. అయితే తాను ఆ మంటలో కాలిపోదు. మంట ఆరిపోతుంది. అప్పుడు మహాంకాళి దర్శనం ఇస్తుంది. నేను ప్రాణాలతో ఉండి ఏం చేయలేను అనుకుంటుంది. మోక్ష, పంచమి ఒకటైపోయారని.. మోక్షను తన వశం చేసుకోవడం సాధ్యం కాదని అంటుంది. అప్పుడు మహాంకాళి మోక్ష పవిత్రంగానే ఉన్నాడని.. పెళ్లయిన బ్రహ్మచారి అని అంటుంది. దీంతో కరాళి సంతోషిస్తుంది. తనను బతికించినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్తుంది. ఇక మోక్షకు ఉన్న శక్తులు వశం చేసుకోవడానికి వచ్చేకార్తీక పౌర్ణమి వరకే టైం ఉందని కరాళికి మహాంకాళి చెప్తుంది.
పంచమి: కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది. సుబ్బు చెప్పినట్లు పవిత్రంగా ఉండి దీపాలు వెలిగించి ఆ శివయ్యను వేడుకోవాలి. సుబ్బు చెప్పాడు అంటే కచ్చితంగా ఫలితం ఉంటుంది. బాలవాక్కు బ్రహ్మవాక్కు. ఇప్పుడు నా దైవం సుబ్బూనే.
మోక్ష: పంచమి.. ఇక్కడ ఉన్నావా.. ఏంటా ఆ ఆలోచన.. మనకు మన గురించి అన్నీ తెలిసిపోయాయి.
పంచమి: మనకు తెలిసిపోయింది ప్రశ్నలే కానీ సమాధానాలు కాదు. మనవి ఎవరూ పరిష్కరించలేని చిక్కు సమస్యలు
మోక్ష: ఇక మనం నా గురించి ఆలోచించడం అనవసరం. నా సమస్యకు పరిష్కారం చావు మాత్రమే
పంచమి: అప్పుడు అది పరిష్కారం అవ్వదు మోక్షబాబు. ఇప్పుడు దాన్ని మనం జయించడమే మన ముందు ఉన్న అతి పెద్ద పరీక్ష
మోక్ష: అది మన చేతుల్లో లేదు పంచమి. మనం ఇప్పుడు అత్యవసరంగా చేయాల్సింది ఒక్కటే మనిద్దరం ఒక్కటి అవ్వడమే. అది ఒక్కటే మన ముందు ఉన్న ప్రత్యమ్నాయం. కనీసం నువ్వు అయినా ఈ భూమ్మీద ఉండిపోవాలి. నా వారసత్వం నీ కడుపులో పుడితేనే పంచమి ఈ ఇంట్లో నీ స్థానం పదిలం అవుతుంది. లేదంటే నేను పోయిన మరుక్షణమే నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేస్తారు
పంచమి: అదే ప్రత్యమ్నాయం అనుకుంటే మీకన్నా ఒక్క క్షణం ముందే ఈ పంచమి కన్ను మూస్తుంది బాబు
మోక్ష: నీ ఆలోచనే తప్పు పంచమి. ఒక కన్ను పోయింది అని ఇంకో కన్ను పొడుచుకోవడం మూర్ఖత్వం. నేను ఒక బిడ్డకు జన్మనిద్దాం అంటున్నా. నువ్వు నీ ప్రాణం కూడా వద్దు అంటున్నావ్
పంచమి: అవును మోక్ష బాబు నేను బతికున్నదే మీ కోసం మీరే లేనప్పుడు నేను ఉండటంలో అర్థం లేదు. ఇదే నా నిర్ణయం.
మోక్ష: నా నిర్ణయం కూడా విను పంచమి. నేను ఉన్నా లేకున్నా నువ్వు ఈ లోకంలో ఈ ఇంట్లో ఉండి తీరాలి. అలా జరగాలి అంటే నువ్వు కచ్చితంగా తల్లివై తీరాలి. ఇందులో నా ఆశ స్వార్థం ఏం లేవు పంచమి. నన్ను నేను కాపాడుకునే అవకాశం లేదు. కానీ నిన్ను కాపాడుకునే అదృష్టం అయినా దొరికింది. అందుకే మరీ మరీ చెప్తున్నా. రానున్న పౌర్ణమికి రోజులే కానీ సమయం ఎక్కువ లేదు. ఇప్పుడు మనకు ఒక రోజు కూడా ఒక యుగం ఆలస్యం చేయకూడదు అని నిర్ణయించుకున్నా ఈరోజే అందుకు ముహూర్తం.
పంచమి తల్లి: అమ్మా పంచమి నాతో వస్తావా అమ్మా
పంచమి: నీ ఒడిలో తల పెట్టుకొని అలాగే శాశ్వతంగా నిద్ర పోవాలి అని ఉందమ్మా.. నేను అంతగా అలసిపోయే రోజు వస్తే నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తాను అమ్మా. నా గురించి మాత్రం దిగులు పెట్టుకోకు
పంచమితల్లి: నువ్వు ఆ శివయ్యని నమ్ముకో తల్లి ఆ తండ్రే నిన్ను గట్టెక్కిస్తాడు. వెళ్లొస్తా తల్లీ జాగ్రత్త
ఫణేంద్ర: మానవులతో చేరి నువ్వు మోసాలకు అలవాటు పడ్డావ్ యువరాణి. మీ రహస్యాలు అన్నీ నాకు తెలిసిపోయాయి. నిన్ను శాశ్వతంగా భూలోకంలో ఉంచడానికి మోక్ష వేసిన ఎత్తుగడ నాకు తెలిసిపోయింది. అందుకే నేను వెళ్లి ఆ విషయం నాగదేవతకు చెప్పేశా. అలాంటి ప్రయత్నం చేస్తున్నారు అని తెలిస్తే మోక్షను చంపయమని నాగదేవత నాకు అధికారం ఇచ్చింది. పోయిన సారి నేను మోక్షను కాటేయబోతే నాకు అధికారం లేదు అని చెప్పావు యువరాణి. కానీ నాకు ఇప్పుడు అధికారం లభించింది మోక్ష నిన్ను తాకితే కర్కషంగా కాటేసి చంపేస్తాను. ఈ క్షణం నుంచి నువ్వు మోక్షకు దూరంగా ఉండు యువరాణి. అప్పుడు కనీసం పౌర్ణమి వరకు అయినా అతన్ని చూసుకోవడానికి అయినా ఉంటుంది. నేను మీ వెన్నంటే ఉంటాను నా కన్ను కప్పి మీరేం చేయలేరు. గుర్తుంచుకో యువరాణి.
మరోవైపు కరాళి తన అన్న ఆత్మను పిలిపిస్తుంది. తన అన్నకు క్షమించమని చెప్తుంది. తను కొన్ని రోజులు ఈ ఆశ్రమం వదిలివెళ్తున్నాను అని చెప్తుంది. దీంతో తన శరీరాన్ని వదిలివెళ్తావా అని నంబూద్రీ ప్రశ్నిస్తాడు. అయితే తనను అలా గాలికి వదిలేయొద్దు బతికించమని నంబూద్రీ వేడుకుంటాడు. తన దేహం కొన్ని రోజులకు క్షీణించిపోతుంది అంటాడు. దీంతో కరాళి రోజూ దేహాన్ని చూస్తున్నా అని పసర్లు వేస్తూ చక్కగా చూసుకుంటున్నాను అని అంటుంది. తనకు ఓ మార్గం దొరికింది అని మోక్షను వశపరచుకోవడానికి ఇప్పుడు ఆ పని మీద వెళ్తాను అని అన్నతో చెప్తుంది. ఒక మాయాశక్తిని ఆ ఆశ్రమానికి కాపలాగా పెడతాను అని చెప్తుంది. తన శరీరాన్ని మాయా దృష్టశక్తులు కబళించకుండా తాను ఆత్మగా అక్కడే కాపలాగా ఉంటున్నానని.. తన శరీరం ఏమాత్రం క్షీణించడం ప్రారంభించినా నువ్వే చూసుకోవాలి అని అంటాడు. నాగమణి నీ సొంతమై నన్ను బతికిస్తే ఈ లోకంలో తమకు తిరుగు ఉండదని నంబూద్రీ చెప్తాడు. ఆ ఆశతోనే తాను బతుకుతున్నానని చెప్తుంది కరాళి.
మరోవైపు పంచమి ఇంటికి నరఘోష పోవాలి అని గుమ్మం దగ్గర గుమ్మడికాయ కట్టిస్తారు పంతులు. ఇక పంచమి పంతులకు తాంబూలంలో డబ్బు కట్ట వేస్తే చిత్ర, జ్వాలాలు దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. శబరి వాళ్లని వారిస్తుంది. మరోవైపు కరాళి గెటప్ మార్చి ఫారిన్ అమ్మాయిలా మోక్ష ఇంటికి వస్తుంది. రావడం రావడమే తన చేతిని కట్ చేసుకొని రక్తంతో చెట్టుపైన రాస్తుంది. ఇంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply