Naga Panchami Serial Today January 2nd Episode - మోక్ష, మేఘనల రొమాన్స్ చూసేసిన వైదేహి.. పంచమిని తీసుకొస్తున్న సుబ్బు!
Naga Panchami Today January 2nd Episode పంచమి కనిపించడం లేదనే విషయం నాగదేవతకు తెలీకుండా ఫణేంద్ర జాగ్రత్త పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Serial Today Episode
మోక్ష షర్ట్‌లోకి బొద్దింక దూరగా దాన్ని తీస్తాననే నెపంతో ఇద్దరూ బెడ్ మీద పడేలా చేస్తుంది. మేఘన, మోక్ష ఒకరిపై మరొకరు ఉండగా బయట నుంచి మోక్షతల్లిదండ్రులు చూసి షాక్ అవుతారు.
నాగదేవత: ఏంటి యువరాజా.. నీకు ఇచ్చిన సమయం దగ్గర పడుతుంది. యువరాణిని ఒప్పించగలవా లేదా..
ఫణేంద్ర: మనసులో.. యువరాణి కనిపించడం లేదని నాగదేవతకు తెలిసినట్లు లేదు.
నాగదేవత: ఆలోచిస్తున్నావ్ అంటే యువరాణి ఒప్పుకుంటుంది అని నీకు నమ్మకం లేదు అన్నమాట.
ఫణేంద్ర: అలాంటిది ఏం లేదు మాతా.. మీరిచ్చిన గడువులోగా ఇక్కడే పని పూర్తి చేసుకొని వస్తా.
నాగదేవత: నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నా యువరాజా.. జాగ్రత్తగా యువరాణిని తీసుకురా. దానివల్ల మనకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి. పంచమిని మోక్షని కాటేసి చంపేస్తే మనం నాగరాణి చివరికోరిక తీర్చి నాగలోకానికి గౌరవం నిలబెట్టినట్లు అవుతుంది. రెండోది నాగలోకానికి రాణి లేని లోటు తీరిపోతుంది. మళ్లీ నేను ఒకసారి యువరాణితో మాట్లాడి చూస్తాను. నా శక్తిని ఉపయోగించి యువరాణి ఇంట్లోనుంచి ఇక్కడికి వచ్చేలా చేస్తాను.
ఫణేంద్ర: అవసరం లేదు మాతా. మరీ ఎక్కువ ఒత్తిడి చేస్తే తను ప్రాణాలు తీసుకొనే అవకాశం ఉంది. అందుకే నేను సున్నితంగా చెప్తూ ఒప్పిస్తున్నాను. ఈ మూడు రోజుల లోనే నేను మీకు మంచి శుభవార్త అందిస్తాను మాతా. హమ్మయ్యా.. యువరాణి కనిపించడం లేదని నాగదేవతకు తెలిస్తే అందుకు నేనే కారణం అని భావించి నాకు శిక్ష వేసేది. త్రుటిలో తప్పించుకున్నాను.
మరోవైపు పంచమి లేచి తాను బతికే ఉన్నానా.. చనిపోలేదా అని అనుకుంటుంది. తనకు ఈ జీవితం వద్దు అని.. సంతోషంగా చనిపోయే అదృష్టం కూడా నాకు లేదా అని సుబ్రహ్మణ్య స్వామి అంటూ ఏడుస్తుంది. మరోసారి తలను కొట్టుకుంటుంది. ఇక అప్పుడు అక్కడికి సుబ్బు వస్తాడు.
సుబ్బు: ఏంటి పంచమి అలా చూస్తున్నావు. నేను ఎవరో గుర్తులేదా.. నన్ను అప్పుడే మర్చిపోయావా.
పంచమి: నా జీవితంలో ఏదైనా ప్రశాంతత ఉందంటే. అది నీతో గడిపిన క్షణాలే సుబ్బు. నిన్నటి నుంచి వేడుకుంటున్నాను సుబ్రహ్మణ్యస్వామిని నన్ను చంపేయమని.. కానీ నిన్ను చూడాలి అనే నన్ను బతికించినట్లు ఉన్నారు. అది సరే సుబ్బు నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు.
సుబ్బు: ఆ మాట నేను అడగాలి పంచమి. నేను నీకు మొట్టమొదట ఎక్కడ కనిపించాను.
పంచమి: ఇక్కడే..
సుబ్బు: అంటే ఇక్కడికి నేను రావడం పోవడం చేస్తూ ఉంటాననే కదా అర్థం. ఇది నాకు ఇష్టమైన ప్రదేశం. నువ్వు నేను ఉన్న చోటుకి వచ్చి..నువ్వెలా వచ్చావని నన్ను అడుగుతున్నావు. పంచమి మీ ఇంటి విశేషాలు చెప్పు.
పంచమి: ఒక్క నేను తప్పా ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉంటారు సుబ్బు.
సుబ్బు: సంతోషం అంటే ఏంటో తెలుసా పంచమి. ఆస్వాదించడం పురిటి నొప్పులు బాధపెడతాయి కాని నొప్పులను ఆస్వాదిస్తే ఆనందాన్ని ఇస్తాయి. అలాగే మరణం కూడా అంతే పంచమి తనని ఆహ్వానించి ఆస్వాదించడం ప్రారంభిస్తే చావు అంటే భయం బదులు మహా ఆనందం కలుగుతుంది.
పంచమి: నీ మాటలు కనికట్టులా పనిచేస్తాయి సుబ్బు. ఒక్క క్షణంలో సర్వం మర్చిపోయేలా చేస్తాయి సుబ్బు.
సుబ్బు: స్వామిని ఏం వేడుకోవడానికి వచ్చావు పంచమి.
పంచమి: ఇక్కడే చనిపోవాలి అని వచ్చాను సుబ్బు. కానీ ఆ స్వామి కరుణించడం లేదు.
సుబ్బు: అంటే ఆ స్వామికి అది ఇష్టం లేదు అనేకదా.. పంచమి ఇక బయలు దేరుదామా..
పంచమి: నేను రాను సుబ్బు ఇక్కడే ఉండిపోతాను అంటుంది. ఇక సుబ్బు తన తల్లిదండ్రులు ఒకర్ని వదిలి ఒకరు ఉండలేరు ఆది దంపతులు అని.. వాళ్లలాగే నువ్వు మోక్ష కూడా ఒకర్ని వదిలి మరొకరు ఉండలేరు అని మోక్ష మీద పంచమి ప్రేమ చెప్పడంతో పంచమి వెంటనే మోక్ష దగ్గరకు వెళ్లిపోతానని అంటుంది. ఇక సుబ్బు కొంత వరకు తోడుగా వస్తాను అని తర్వాత నువ్వే వెళ్లాలి అని పంచమితో అంటాడు. ఇక ఇద్దరూ బయలుదేరుతారు.
ఇక మోక్ష అడవిలో ఉండే నాగసాధువు దగ్గరకు వస్తాడు. పెద్ద తప్పు చేశానని ఆయనతో చెప్తాడు. భార్యని కొట్టానని ఇప్పుడు పంచమి కనిపించడం లేదని చెప్పి కంగారు పడతాడు. పంచమికి ఏం కాకూడదు అని కోరుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.